International Cat Day 2022: ప్రపంచ పిల్లుల దినోత్సవం జరుపుకోవడానికి వెనుకున్న అసలు చరిత్ర ఇదే..!

First Published Aug 8, 2022, 2:18 PM IST

International Cat Day 2022: ఈ రోజు అంతర్జాతీయ పిల్లుల దినోత్సవం. పిల్లులను గౌరవించేందుకే అంతర్జాతీయ జంతు సంక్షేమ నిధి ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది.
 

cat

ప్రపంచ పిల్లుల దినోత్సవాన్ని ఏటా ఆగస్టు 8న జరుపుకుంటారు. జంతు సంరక్షణ కోసం అంతర్జాతీయ నిధి 2002లో పిల్లుల అవసరాలు,  ప్రాధాన్యతల గురించి ప్రజలకు అవగాహన పెంచడానికి, వారి పెంపుడు జంతువులతో వారి బంధాలను బలోపేతం చేయడానికి ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది.

పురాతన ఈజిప్టు సంస్కృతిలో పిల్లలను గౌరవించారు. బాస్టెట్ ఒక పురాతన ఈజిప్షియన్ దేవత. ఈమె మొదటగా సింహరాశి రూపంలో.. ఆ తర్వాత పిల్లిగా పూజించబడుతుంది. 
 

ప్రపంచ పిల్లి దినోత్సవం ప్రాముఖ్యత

ప్రపంచవ్యాప్తంగా కుక్కలు, పిల్లులే అత్యంత సాధారణ పెంపుడు జంతువులు. కుక్కలు ఎంతలా మనిషిని విశ్వసిస్తాయో.. పిల్లలు కూడా అంతే. వాటి చిలిపి చేష్టలు మనసుకు ఆనందాన్ని కలిగిస్తాయి. అయితే పిల్లల యాజమానుకు కూడా ఆ మూగజీవాల పట్ల అంతే ప్రేమగా ఉండాలి. వాటి అవసరాలను తీర్చాలి. మూగజీవాల ప్రేమ చాలా స్వచ్ఛమైంది.
 

చరిత్ర

జంతు సంక్షేమం కోసం అంతర్జాతీయ నిధి లేదా IFAW అంతర్జాతీయ పిల్లి దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. పిల్లుల దుర్వినియోగం నుంచి రక్షించడానికి ఈ రోజును ప్రారంభించింది. ఇంటర్నేషనల్ క్యాట్ డే సంరక్షకత్వం 2020లో ఇంటర్నేషనల్ క్యాట్ కేర్‌కు పంపబడింది. ఈ సంస్థ 1958 నుంచి ప్రపంచవ్యాప్తంగా పెంపుడు పిల్లుల సంక్షేమాన్ని మెరుగుపరచడానికి కృషి చేస్తున్న బ్రిటిష్ లాభాపేక్ష రహిత సమూహం.

cat

థీమ్

అంతర్జాతీయ పిల్లి దినోత్సవం 2022 థీమ్ 'పిల్లి స్నేహపూర్వక వనరులు'.

దీన్ని ఎలా జరుపుకోవాలి

స్థానిక ఆశ్రయం నుంచి పిల్లిని దత్తత తీసుకోవడం ద్వారా అంతర్జాతీయ పిల్లుల దినోత్సవాన్ని జరుపుకోవచ్చు. చాలా రోజులుగా ఆహారం దొరకని పిల్లి పిల్లలు చాలానే ఉన్నారు. వాటిని రక్షించడానికి మీరు వాటిని పెంచుకోవచ్చు.  ఈ రోజు సందర్భంగా మీరు మీ పిల్లికి కొత్త బొమ్మలను కూడా కొనొచ్చు. ముఖ్యంగా వాటితో కాస్త టైంను కేటాయించడం మర్చిపోకండి. 

click me!