benefits of Dancing: డ్యాన్స్ తో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. మీరు వాటిని మిస్ అవుతున్నారేమో చూసుకోండి

Published : Feb 25, 2022, 12:49 PM IST

benefits of Dancing: వయస్సు ఏడైనా లేదా 70 ఏండ్లైనా కానీయండి ఏలాంటి మొహమాటం, బిడియం లేకుండా డ్యాన్స్ చేయండి. అది మీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. డ్యాన్స్ వ్యాయామంలా పనిచేస్తుంది. డ్యాన్స్ తో ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంటారు. మరి డ్యాన్స్ కైతే ఆడ, మగ అంటూ తేడాలేమీ లేవండి.. 

PREV
17
benefits of Dancing: డ్యాన్స్ తో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. మీరు వాటిని మిస్ అవుతున్నారేమో చూసుకోండి

benefits of Dancing: పెళ్లిల్లో, పేరంటాల్లో బాక్సులు పెట్టుకుని దూందాంగా అదిరిపోయే స్టెప్పులు వేయడమంటే చాలా మందికి ఇష్టం. ఇక పెళ్లిల్లో బరత్ లల్లో ఆడమగ అంటూ తేడాలు లేకుండా చిందులు వేస్తుంటారు. డాన్స్ చేయడం చాలా మందికి ఇష్టం ఉంటుంది. కానీ స్టెప్పులు బాలేకపోతే వారేమనుకుంటారో వీళ్లేమనకుంటారో అంటూ చాలా మంది డ్యాన్స్ చేయాలని ఉన్నా.. చేయలేకపోతుంటారు.  7 లేదా 70 నుంచి 80 ఏడ్లున్నా.. మీరు ఎలాంటి అపోహలు, బిడియం, సిగ్గు లాంటివేమీ పెట్టుకోకుండా స్టెప్పులు వేయొచ్చు. ఇది మీ ఆనందం కోసమే కాదు.. మీ ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఇది ఉత్తమైన వ్యాయామం అని చెబుతున్నారు. ఈ వ్యాయామానికి వయస్సు గానీ లింగం అని మరే ఇతర భేధాలు లేవు. ఈ డ్యాన్స్ తో ఎన్నో శారీరక, మానసిక మరియు భావోద్వేగ ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి మొహమాట పడకుండా ప్రతి రోజూ కొన్ని స్టెప్పులు వేయండి. మరి డ్యాన్స్ తో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.. 

27

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: డ్యాన్స్ తో గుండె పది కాలాల పాటు పదిలంగా ఉంటుంది. డ్యాన్స్ చేయడం వల్ల Heart rate స్థిరంగా ఉంటుంది. అంతేకాదు అకస్మత్తుగా గుండె ఆగిపోయే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. Cardiovascular వ్యాయామం చేసినప్పుడు మీ స్టామినా పెరుగుతుంది. 

37

ఫ్లెక్సిబిలిటీ:  ఒక వ్యక్తికి ఎముకలు, కండరాల ఆరోగ్యం బాగున్నప్పుడే తను అన్ని విధాల తన పనులను చేసుకోగలుగుతాడు. అదే కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు వంటి సమస్యలతో బాధపడితే మాత్రం తమ రోజు వారి పనులను కూడా చేయలేరు. అయితే కీళ్ల నొప్పులు తగ్గించేందుకు ఎముకలు బలంగా ఉండేందు డ్యాన్స్ ఎంతో సహాయపడుతుంది. అంతే కాదు డ్యాన్స్ తో మనల్ని ఫ్లెక్సిబుల్ గా చేస్తుంది. దీనివల్ల మీరు బలంగా తయారవుతారు. ముఖ్యంగా మీ రోజు వారి పనులను చకచకా చేసుకోగలరు. 
 

47

బ్యాలెన్సింగ్ :  చిన్న వయస్సు నుంచి డ్యాన్స్ చేసే వారు బ్యాలెన్సింగ్ సమస్యను ఎదుర్కోవాల్సిన అవసరం రాదు. మీ వయస్సు ఎంతైనా ఉండని.. అందరిలాగానే నడవగలుగుతారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి డ్యాన్స్ చేయడం వలల మీ శరరం స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. ఈ డ్యాన్స్ వల్ల మీరు ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి ఈజీగా బయటపడగలుగుతారు. 

57

మెదడుకు గొప్ప వ్యాయామం :  చాలా మందికి వయస్సు పెరుగుతున్న కొద్ది  జ్ఞాపకశక్తి తగ్గుతూ వస్తుంటుంది. ఈ సమస్య సాధారణంగా అందరిలో కనిపిస్తూ ఉంటుంది. అయితే డ్యాన్స్ మీ  జ్ఞాపకశక్తి ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. డ్యాన్స్ అద్బుతమైన వ్యాయామం. డ్యాన్స్ చేస్తుంటే మన శరీరంలో ఎన్నో భాగాలు కదులుతాయి. అలాగే డ్యాన్స్ నేర్చుకోవడం, ఆ స్టెప్పులను గుర్తించుకోవడం వంటివి మీ  దృష్టిని పెంచుతుంది.

67

ఒత్తిడిని తగ్గిస్తుంది: తీవ్రమైన ఒత్తిడి, నిరుత్సాహం వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి డ్యాన్స్ చక్కటి పరిష్కార మార్గం. డ్యాన్స్ చేయడంతో మీ శరీరం రిలాక్స్ అవుతుంది. ముఖ్యంగా మీ మానసిక పరిస్థితి ప్రశాంతంగా మారుతుంది. డ్యాన్స్ ఇలానే చేయాలి అలాగే చేయాలి అని రూలేమీ లేదు. నచ్చిన పాట పెట్టుకుని మీకు నచ్చిన లేదా వచ్చిన స్టెప్పులతోనే చిందులోయండి. క్షణాల్లో మీ ఒత్తిడంతా మటుమాయమవుతుంది. 

77

బరువు తగ్గడంలో సహాయపడుతుంది: వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి డ్యాన్స్ చక్కటి వ్యాయామం. డ్యాన్స్ చేయడం వల్ల కేలరీలు ఖర్చవుతాయి. సాధారణంగా ఒక వ్యక్తి గంటపాటు డ్యాన్స్ చేస్తే అతనిలో 300 నుంచి 400 కేలరీలు ఖర్చైపోతాయి. ఇదికూడా అది అతను డ్యాన్స్ చేసే విధానంపై ఆధారపడి ఉంటుంది. మీ శరీర బరువు, డ్యాన్స్ చేస్తున్న తీరుతోనే మీ శరీరంలో ఉండే కేలరీలు తగ్గుతాయి. ఎరోబిక్ డ్యాన్స్ లేదా జాగింగ్ , సైక్లింగ్ చేయడం ద్వారా ఎలా అయితే కేలరీలు ఖర్చవుతాయో.. అలాగే డ్యాన్స్ ద్వారా కూడా ఖర్చవుతాయి. 

Read more Photos on
click me!

Recommended Stories