ప్రభాస్ పర్సనాలిటీకి ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఆయనకు అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. మరి అందరినీ ఆకర్షించడానికి ఆయన ఎలాంటి డైట్ ఫాలో అవుతుంటారు..? ఆయన ఫిట్నెస్ సీక్రెట్స్ ఏంటి తెలుసుకోవాలని ఉందా..? ఇంకెందుకు ఆలస్యం చదివేయండి.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. బాహుబలి తర్వాత ఆయన రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఆయన అన్నీ ఆ తర్వాత పాన్ ఇండియా సినిమాలు మాత్రమే చేస్తున్నారు.
29
సాహో తర్వాత.. ప్రభాస్ నుంచి ఒక్క సినిమా కూడా రాకపోయినా.. వరసగా క్యూలో మాత్రం మూడు సినిమాలు ఉన్నాయి. దీంతో.. వాటి కోసం ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాధేశ్యామ్ వచ్చే నెలలో ప్రేక్షకుల ముందు కు వచ్చే అవకాశం ఉంది.
39
ఈ సంగతి పక్కన పెడితే.. ప్రభాస్ పర్సనాలిటీకి ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఆయనకు అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. మరి అందరినీ ఆకర్షించడానికి ఆయన ఎలాంటి డైట్ ఫాలో అవుతుంటారు..? ఆయన ఫిట్నెస్ సీక్రెట్స్ ఏంటి తెలుసుకోవాలని ఉందా..? ఇంకెందుకు ఆలస్యం చదివేయండి.
49
తన బాడీని ఫిట్ గా ఉంచుకునేందుకు ప్రభాస్ 30 శాతం వర్కౌట్స్, 70 శాతం డైట్ మీద ఫోకస్ పెడతారట. వాటి వల్లే ఆయన సినిమా సినిమాకీ ఫిట్ గా.. మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు.
59
ఫిట్ గా ఉండేందుకు ఆయన స్పోర్ట్స్ మీద కూడా ఎక్కువ దృష్టి పెడుతుంటారు. సాహో సినిమా కోసం ఆయన స్విమ్మింగ్, సైక్లింగ్, వాలీబాల్ ఆడి దాదాపు 10 కేజీల బరువు తగ్గడం గమనార్హం.
69
ఇక బాహుబలి సినిమా కోసం అయితే.. ప్రభాస్ ప్రతిరోజూ ఏకంగా ఆరు గంటల పాటు జిమ్ లో వర్కౌట్స్ చేసేవాడట. సినిమా జరుగుతున్నంత కాలం ఒక్కరోజు కూడా మిస్ కాకుండా జిమ్ లో కష్టపడ్డాడు.
79
ఆయన తన ఒత్తిడి తగ్గించుకోవడానికి ఫిట్నెస్ మీద మరింత ఎక్కువ ఫోకస్ పెడతాడట. ఈ విషయాన్ని ఆయన ట్రైనర్ స్వయంగా చెప్పడం గమనార్హం. ఇక డైట్ విషయంలోనూ ఆయన చాలా కఠినంగా ఉంటారు.
89
సినిమా షూటింగ్ సమయంలో ఆయన సెవెన్ మీల్ డైట్ ని ఫాలో అవుతారట. అందులో కార్బ్స్, ప్రోటీన్స్ కచ్చితంగా ఉండేలా జాగ్రత్తపడతాడట. అంతేకాకుండా తన డైట్ లో నట్స్, చేప, బాదం, కోడిగుడ్డు వైట్, కూరగాయలు కచ్చితంగా తీసుకుంటారట.
99
విదేశాల్లో షూటింగ్ కోసం వెళ్లినప్పుడు కూడా ఆయన తన వర్కౌట్స్ ని పక్కన పెట్టడట. తనతోపాటు.. డంబెల్స్, వెయిట్స్ లాంటివి తీసుకువెళతాడట. వర్కౌట్స్ చేయడానికి ఎలాంటి ఎక్విప్మెంట్ లేకపోయినా.. ప్రతిరోజూ 100 స్క్వాట్స్ చేస్తాడట.లేదంటే గంటపాటు వాకింగ్ చేస్తాడని.. ఆయన ట్రైనర్ చెప్పారు.