తొందరగా బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ పానియాలు తీసుకోండి..

Published : Feb 25, 2022, 10:01 AM IST

వీలైనంత తొందరగా బరువు తగ్గాలనీ ప్లాన్ వేసుకున్న వాళ్లకు కొన్ని రకాల పానీయాలు బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా సుగంద ద్రవ్యాలు, మూలికలు, సిట్రస్ ఆహారాలను మీ రోజు వారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఈజీగా బరువు తగ్గుతారు. 

PREV
17
తొందరగా బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ పానియాలు తీసుకోండి..
weight loss

ప్రస్తుత కాలంలో అధిక బరువు సమస్యతో బాధపడేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. వీలైనంత తొందరగా నేను బరువు తగ్గాలని ప్లాన్ చేసుకున్నవారికి వెయిట్ లాస్ అవడం కష్టమైన పనేం కాదు. పోషకాలతో కూడిన ఆహారం, వ్యాయాలను మరువ కుండా చేస్తూ ఉండాలి. అంతేకాదు ఒకటి రెండు రోజులు ఇవి పాటించి ఇంకా తగ్గడం లేదేంటని నిరాశ చెందకూడదు. బరువు తగ్గాలంటే మీ శరీర  కొవ్వును కరిగించాలి. అలా కరగాలంటే మీ జీవక్రియను పెంచే ఆహారాలను మాత్రమే తీసుకోవాలి. 
 

27

శరీర బరువును తగ్గించడంలో సిట్రస్ ఫ్రూట్స్, మూలికలు, సుంగంద ద్రవ్యాలు ఎంతో సహాయపడతాయి. ఎందుకంటే వీటిలో  Anti-inflammatory, antioxidant యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలుంటాయి. వీటిని మీ రోజు వారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎన్నో అరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. వీటి వల్ల ఊబకాయంతో ముడుపడి ఉన్న ఫ్రీ రాడికల్స్ వల్ల నష్టాన్ని తగ్గించువచ్చు. అంతేకాదు దీర్ఘకాలిక వ్యాధులు సోకే ప్రమాదం కూడా తగ్గుతుంది. అలాగే అంతర్గత అవయాలు సరిగ్గా పనిచేస్తాయి. కాగా 5 రకాల పానియాలు మీరు వేగంగా బరువు తగ్గేలా చేస్తాయి. అవేంటంటే.. 

37

జీలకర్ర లేదా జీలకర్ర నీరు: భారతీయ మసాలా దినుసుల్లో జీలకర్ర ఒకటి. ఇవి కూరలకు మంచి రుచిని తెస్తాయి. జీలకర్రలో తక్కువ కేలరీలు, విటమిన్ ఎ, సి , యాంటీ యాక్సిడెంట్లు, మాంగనీస్, కాపర్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాదు మీ బరువును కూడా తగ్గిస్తాయి.  ముఖ్యంగా ఊబకాయ సమస్యను తగ్గించడంలో ఇవి ఎంతో సహాయపడతాయి. ఒక టీస్పూన్ జీలకర్రలో 7 కేలరీలు మాత్రమే ఉంటాయి. కాబట్టి వీటిని మీ రోజు వారి ఆహారంలో చేర్చుకోండి. ఇందుకోసం.. ఒక టీస్పూన్ జీలకర్రను ఒక కప్పు నీటిలో వేసి రాత్రంతా నానబెట్టండి. ఉదయం ఆ నీటిలో కొద్దిగా దాల్చిన చెక్క వేసి 5 నిమిషాల పాటు బాగా మరిగించండి. ఆ నీరు చల్లబడిన తర్వాత వడగట్టి తాగండి.   

47

యాపిల్ సైడర్ వెనిగర్ లేదా ACV: పులియబెట్టిన ఆపిల్ రసంలో ఎన్నో ఔషద గుణాలున్నాయి. వీటిని ఎన్నో ఆరోగ్య సమస్యల నివారణ కోసం ఉపయోగిస్తున్నారు. కాగా ప్రతిరోజూ ఆపిల్ సైడర్ వెనిగర్ ను తాగితే టైప్ 2 డయాబెటిస్ ఎగ్జిమా , అధిక కొలెస్ట్రాల్ సమస్యలను నయం చేయడానికి ఎంతో సహాయపడుతుంది. ఒకవేళ మీరు బరువు తగ్గాలనకుంటే.. ఇది మీ కొవ్వును కరిగించడానికి సహాయపడుతుందని పలు అధ్యయనాలు తేల్చి చెబుతున్నాయి. వెనిగర్ లో ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది కొవ్వును కరిగిస్తుంది. ముఖ్యంగా ఆకలిని తగ్గిస్తుంది. ఇందుకోసం.. ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లను తీసుకుని అందులో ఒక టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ వేసి బాగా మిక్స్ చేసి తాగాలి. ఇందులో తేనె కూడా వేసుకోవచ్చు. 

57

కలోంజి లేదా నిగెల్లా విత్తనాలు:  కలోంజిల్లో విటమిన్ ఎ, సి, కె, ఫాస్పరస్, ఐరన్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఎన్నో విలువైన పోషకాలుంటాయి. అంతేకాదు వీటిలో ఫైటోకెమికల్స్ అనే క్రియాశీల సమ్మేళనాలు కూడా ఉంటాయి. ఇవి మీరు ఈజీగా బరువు తగ్గేందుకు సహాయపడతాయి. ఫైటోకెమికల్ మీ ఆకలిని తగ్గిస్తుంది. అలాగే కొవ్వును కూడా కరిగిస్తుంది. ఆర్థరైటిస్, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులున్న వారు ఈ కలోంజి నీటిని తాగితే ఈ వ్యాధుల లక్షనాలు తగ్గుతాయి. ఇందుకోసం. కలోంజి గింజలను చిటికెడు తీసుకుని వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లను తీసుకుని అందులో ఈ పొడిని కలుపుకుని తాగాలి. 
 

67

నల్ల ఉప్పుతో నిమ్మకాయ నీరు: నిమ్మలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా వీటిలో కేలరీలు తక్కువ మొత్తంలో ఉండి విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి మిమ్మల్ని హైడ్రేటెడ్ గా ఉంచుతాయి. అంతేకాదు మీ జీవక్రియను పెంచి కిలోల్లో బరువు తగ్గడానికి సహాయపడతాయి. ఇందుకోసం.. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీళ్లలో చిటికెడు నల్ల ఉప్పును కలుపుకుని తాగాలి. ఇలా తాగితే మీ పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు ఇట్టే కరుగుతుంది. అలాగే ఈ నీరు జీర్ణ ప్రక్రియను కూడా మెరుగుపరుస్తుంది. నిమ్మనీటిలో బ్లాక్ సాల్ట్ కలిపి తాగితే చర్మవ్యాధులు, ఎసిడిటి, కీళ్లనొప్పులు, ఆస్టియోపోరోసిస్ తగ్గుతుంది. ఒక గ్లాసు నీళ్లలో రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం చిటికెడు నల్ల ఉప్పు కలిపి తీసుకోండి.
 

77

 ఉసిరి మరియు జీరా నీరు:  ఉసిరిలో వటమిన్ సి, బి5, బి6, మాంగనీస్, కాపర్, పొటాషియం మెండుగా ఉంటాయి. ఈ పోషకాలు తక్కువ సమయంలో కొవ్వులు కరిగేందుకు సహాయపడతాయి. అంతేకాదు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గిస్తాయి. ముఖ్యంగా దీర్థకాలిక వ్యాధులు సోకే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. ఇందుకోసం.. ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో అరకప్పు ఉసిరి రసం, కొద్దిగా వేయించిన జీలకర్ పొడిని వేసుకుని బాగా కలపి తాగాలి. 

Read more Photos on
click me!

Recommended Stories