
బయట మార్కెట్ లో ఎన్నో రకాల పండ్లు లభిస్తాయి. అందులో ఒక్కో పండు ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంటుంది. ముఖ్యంగా సీజనల్ పండ్లు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఫ్లూ, ఇన్ఫెక్షన్స్ వంటి వాటికి దూరంగా ఉంచుతాయి. ఇలాంటి పండ్లలో చెర్రీ ఒకటి. సాధారణంగా చెర్రీ పండ్లను చాలా మంది తినరు. ఎందుకంటే ఇది పుల్లగా ఉంటుందని. కానీ ఈ పండును చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు ప్రతిఒక్కరూ తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ పండులో పోషకాలు మెండుగా ఉంటాయి. ముఖ్యంగా చెర్రీ పండులో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. చెర్రీ మన ఆరోగ్యానికి చాలా మంచిది.
చెర్రీలు చాలా చిన్న సైజులో ఉంటాయి. కానీ ఈ పండులో కళ్లు చెదిరే పోషకవిలువలు ఉంటాయి. అయితే చెర్రీలు రెండు రకాల రుచుల్లో ఉంటాయి. ఒకటి తియ్యనిది. రెండోది టార్ట్ చెర్రీ. భారతదేశంలో సాధారణంగా తీపి చెర్రీలే ఉంటాయి. టార్ట్ చెర్రీ పుల్లగా ఉంటుంది. చెర్రీ పండులో ఫైబర్, పాలీఫెనాల్స్, కెరోటినాయిడ్స్, విటమిన్ సి, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
చెర్రీ పండులో ఉండే లక్షణాలు
యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు: మన శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి మన శరీరాన్ని రక్షించడానికి సహాయపడతాయి. మీకు తెలుసా ఫ్రీరాడికల్స్ వల్లే ఆక్సీకరణ ఒత్తిడి ఫ్రీ వస్తుంది. ఇది గుండెజబ్బులు, క్యాన్సర్, మధుమేహం, పార్కిన్సన్ వ్యాధి, శుక్లాలు మొదలైన కంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. రోజూ గుప్పెడు చెర్రీలను తినడం వల్ల ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది.
నిద్రలేమికి ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది: నిద్రలేమి గుండెకు సంబంధించిన సమస్యలకు, డిప్రెషన్ వంటి ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. నిద్రలేమి మీ లైఫ్ టైం ని కూడా తగ్గిస్తుంది. అయితే చెర్రీలను తినడం వల్ల నిద్రలేమి తగ్గుతుంది. చెర్రీ జ్యూస్ మంచి నిద్రకు సహాయపడుతుంది. చెర్రీ జ్యూస్ లో ఉండే మెలటోనిన్ నిద్రను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
యాంటీ ఇన్ఫ్లమేటరీ రిలీఫ్ కోసం: ఇన్ఫ్లమేషన్ సమస్యను తగ్గించడంలో చెర్రీ పండ్లు ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. పలు పరిశోధనల ప్రకారం.. ఇన్ఫ్లమేటరీ సమస్య తీవ్రమైన మంట, ఆర్థరైటిస్, గుండె జబ్బులు, డయాబెటీస్, క్యాన్సర్ వంటి రోగాల ప్రమాదాన్నిపెంచుతుంది. చెర్రీలను తీసుకోవడం వల్ల ఈ ఇన్ఫ్లమేషన్ సమస్య తగ్గిపోతుంది.
గుండె ఆరోగ్యానికి చెర్రీస్: గుండె ఆరోగ్యంపైనే మన లైఫ్ టైం ఆధారపడి ఉంటుంది. అందుకే గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. గుండెను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలనే తినాలి. అయితే చెర్రీలు కూడా హార్ట్ ను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. ఈ పండ్లలో ఉండే పొటాషియం, పాలీఫెనాల్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి గుండెను రక్షించడానికి ఉపయోగపడతాయి.
తలనొప్పిని తగ్గిస్తాయి : చెర్రీస్ తినడం వల్ల మైగ్రేన్ తో సహా అన్ని రకాల తలనొప్పులు తగ్గిపోతాయి. ఒక అధ్యయనం ప్రకారం.. 24 ఏళ్ల మహిళ మైగ్రేన్ తో బాధపడుతుండేది. అయితే ఆమె చెర్రీలను తిన్న తర్వాత మైగ్రేన్ నొప్పి చాలా తగ్గిందని నివేధికలు వెల్లడిస్తున్నాయి.
కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: వృద్ధులకు వచ్చే అత్యంత సాధారణ కంటి వ్యాధుల్లో గ్లకోమా ఒకటి. ఇది అంధత్వం ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ సమస్య వల్ల ఆప్టిక్ నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. చెర్రీ పండులో లోగానిక్ ఆమ్లం ఉంటుంది. ఇది ఇది ఇంట్రాక్యులర్ పీడనాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
మలబద్ధకాన్ని తగ్గిస్తుంది: మలబద్ధకం జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్య. అయితే ఈ సమస్యకు చెర్రీ మంచి మెడిసిన్ లా పనిచేస్తుంది. ఎందుకంటే చెర్రీలల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మలబద్దకాన్ని తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది.
వ్యాయామం : వ్యాయామం చేసిన తర్వాత చెర్రీలను తప్పకుండా తినాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. టార్ట్ చెర్రీ జ్యూస్, లేదా పౌడర్ అథ్లెట్లకు చాలా మంచిది. ఇది వ్యాయామం చేసిన తర్వాత కలిగే నొప్పిని, కండరాల తిమ్మిరిని తగ్గిస్తుంది.