Food : ఏ వయసు వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా..?

Published : Mar 24, 2022, 10:47 AM IST

Food : వయసుకు తగ్గట్టు ఆహారం తీసుకోకపోతే.. అది తొందరగా జీర్ణం అవక శరీరంలో కొవ్వులు విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం ఉంది. అంతేకాదు.. దీనివల్ల మీరు అధిక బరువు సమస్య బారిన పడతారు. 

PREV
17
Food : ఏ వయసు వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా..?

Food : వయసుకు తగ్గ ఆహారం తీసుకుంటేనే మీ ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదు. కాదు కూడదు అంటూ.. యంగ్ ఏజ్ లో తినాల్సిన ఫుడ్ ను ఓల్డ్ ఏజ్ లో తింటే ఒక మీ ఆరోగ్యాన్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. ముఖ్యంగా యవ్వనంలో ఉన్నప్పుడు రకరకాల ఆహారాలను తింటూ ఉంటారు. అవన్నీ బాగానే అనిపించినా.. తర్వాత కాలంలో అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోకతప్పదు. 

27


వయసు మీద పడుతున్న కొద్దీ మనం తీసుకునే ఆహార పదార్థాల్లో కూడా మార్పులు రావాలి. ఎందుకంటే వయసు పై బడుతున్న కొద్దీ జీవక్రియలు మందగించడం మొదలవుతాయి. అయినా మీరు ఫుడ్ ను ఎక్కువ మోతాదులో, మీ వయసుకు తగ్గ ఆహారాలను తీసుకోకపోతే అది తొందరగా జీర్ణం అవతుంది. దాంతో మీరు అధిక బరువు పెరుగుతారు. అధిక బరువు కాస్త ఊబకాయానికి దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఆ తర్వాత మీకు సర్వరోగాలు చుట్టుకునే అవకాశం ఉంది. అది కూడా దీర్ఘకాలిక రోగాలు. కాబట్టి వయసుకు తగ్గ ఫుడ్ తీసుకోవడం మంచిది. ఎంత వయసు వారు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో తెలుసుకుందాం పదండి.. 

37

20 ఏండ్లు.. ఈ వయసు వారికి ఫుడ్ లిమిట్స్ అస్సలు ఉండవు. అందులోనూ ఈ ఏజ్ లో రాళ్లనైనా.. కరిగించే శక్తి వీళ్లకుంటుంది. అందుకే నోటికి నచ్చిన ఆహారాలను లాగించేస్తుంటారు. కానీ ఇలా తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఈ వయసు వారు ఫుడ్ ను తక్కువగా తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. అంటే తక్కువగా తీసుకుంటూ.. ఎక్కువ సార్లు తింటూ ఉంటాలి. ముఖ్యంగా వీరు తినే ఆహారంలో సాల్మన్ , సోయా, ట్యూనా, పాల ఉత్పత్తులు, వోట్మీల్, కూరగాయలు, పండ్లను ఎక్కువగా తింటూ ఉండాలి. అంతేకాదు విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారాలను తప్పనిసరిగా తినాలి. వీటివల్ల మీ గుండె ఆరోగ్యంగా ఉండటంతో పాటుగా, దంతాలు, ఎముకలు బలంగా తయారవుతాయి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తినడం వల్ల మధుమేహం వ్యాధి  సోకే అవకాశం ఉండదు. వీటితో జీర్ణవ్యవస్థ కూడా మెరుగ్గా పనిచేస్తుంది. వీటివల్ల కడుపు నిండుగానే ఉంటుంది.

47

30 ఏండ్లు.. ఈ వయస్సు వారి శరీరం అంత బలంగా ఉండదు. ఈ వయస్సు నుంచే శరీరం బలాన్ని, శక్తిని కోల్పోవడం మొదలుపెడుతుంది. కాబట్టి వీళ్ల తమ రోజు వారి ఆహారంలో గుల్లలు, సాల్మాన్, ట్రౌట్ పెర్చ్, మాకేరెల్ వంటి వాటిని చేర్చుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు గుండె ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి. ఇకపోతే ఈ వయసు వారు స్మోకింగ్, డ్రింకింగ్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లేదంటే అనేక జబ్బుల పాలవడం పక్కా..
 

57

40 ఏండ్లు.. ఈ వయసు వారికి జీర్ణక్రియ స్లోగా అవుతుంది. అందులోనూ ఈ వయసు వారే ఎక్కువగా క్యాన్సర్ బారిన పడే ప్రమాదముంది. దీన్ని నివారించాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఆహారాలను తప్పక తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా మామిడి, ఓట్ మీల్, డ్రాగన్ ఫ్రూట్స్, సలాడ్స్ ను తీసుకోవాలి. వీటిని వల్ల జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. వీటితో బరువు పెరిగే ఛాన్స్ కూడా లేదు. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ కూడా వీరి ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందుకోసం గోధుమ రొట్టే, బీన్స్, గంజి, చిక్కళ్లు, పాస్తా వంటి వాటిని తింటూ ఉండాలి. 

67

50 ఏండ్లు.. ఈ వయసులోకి ఎంట్రీ ఇవ్వగానే చాలా మంది ఆడవారు ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. అధిక రక్తపోటు, షుగర్ లెవెల్స్ పెరగడం, కొలెస్ట్రాల్ వంటి సమస్యలను తప్పక ఫేస్ చేయాల్సి వస్తుంటుంది. ఇలాంటి సమయంలో వీరు ఆలుగడ్డలు, ఆకు కూరలు, బీన్స్, మొలకలు, బీట్ రూట్ లను ఎక్కువగా తినాలి. వీటిని రెగ్యులర్ గా తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ముఖ్యంగా ఈ వయసులో ఉప్పును మోతాదులోనే తినాలి. ప్యాకెట్ ఫుడ్స్ జోలికి అస్సలు వెళ్లకూడదు. .
 

77

60 ఏండ్లు.. ఈ వయసు వారు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వయస్సు నుంచే కండరాలు కోల్పోతుంటాయి. అందుకే వీరు ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు వైద్యులు సంప్రదిస్తూ ఎలాంటి ఆహారాలను తినాలో ప్లాన్ చేసుకోవాలి.    

Read more Photos on
click me!

Recommended Stories