సమ్మర్ స్పెషల్.. మజ్జిగ తాగితే ఆ జబ్బులు అన్నీ మాయం.. అవి ఏంటంటే?

Navya G   | Asianet News
Published : Mar 23, 2022, 02:37 PM IST

మజ్జిగ (Buttermilk) శరీరానికి శక్తిని ఇచ్చే మంచి ఎనర్జీ డ్రింక్. వేసవి కాలంలో మజ్జిగను తీసుకుంటే అధిక ఎండ తీవ్రత కారణంగా శరీరానికి కలిగే హానిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఎక్కువ సార్లు మజ్జిగను తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను (Health benefits) పొందవచ్చును. అవేంటో ఇప్పుడు కూడా తెలుసుకుందాం..  

PREV
18
సమ్మర్ స్పెషల్.. మజ్జిగ తాగితే ఆ జబ్బులు అన్నీ మాయం.. అవి ఏంటంటే?

మజ్జిగ శరీర వేడిని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుంది. మజ్జిగ దాహాన్ని తీర్చడమే కాకుండా శరీరానికి అవసరమయ్యే సోడియం (Sodium), క్యాల్షియంను (Calcium) అందిస్తుంది.  ఇవి శరీరానికి శక్తిని అందించి రోగనిరోధక శక్తిని పెంచి అనేక అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉంచుతాయి. దీంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది.

28

పైల్స్ వ్యాధి నుంచి ఉపశమనం కలుగుతుంది: పైల్స్ వ్యాధితో బాధపడే వారికి మజ్జిగ మంచి పరిష్కారాన్ని ఇస్తుంది. ఒక గ్లాసు మజ్జిగలో సగం టీ స్పూన్ శోంఠి పొడిని (Ginger powder) కలుపుకొని తీసుకున్నట్లయితే పైల్స్ వ్యాధి (Piles disease) నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇలా క్రమం తప్పకుండా చేయడంతో మంచి ఫలితాన్ని పొందవచ్చు.
 

38

బరువు తగ్గుతారు: ప్రస్తుత కాలంలో చాలా మంది ఎదుర్కొనే సమస్య అధిక బరువు. అధిక బరువు సమస్యలను తగ్గించడానికి మజ్జిగ చక్కగా సహాయపడుతుంది. ఇందుకోసం మజ్జిగలో (Buttermilk) ఒక టీ స్పూన్ తేనె (Honey) కలుపుకొని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇలా క్రమం తప్పకుండా చేస్తే బరువు తగ్గుతారు.

48

వెన్నునొప్పి తగ్గుతుంది: వెన్నునొప్పితో బాధపడే వారికి మజ్జిగ ఉపశమనాన్ని ఇస్తుంది. ఇందుకోసం ఒక గ్లాసు మజ్జిగలో (Buttermilk) ఒక స్పూన్ అల్లం రసం (Ginger juice), చిటికెడు మిరియాల పొడి (Pepper powder) కలిపి తీసుకుంటే  వెన్నునొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చును. ఇలా క్రమం తప్పకుండా చేస్తే వెన్నునొప్పి నుంచి శాశ్వత ఉపశమనాన్ని పొందవచ్చు.

58

ఉదర సమస్యలు తగ్గుతాయి: కడుపులో ఏర్పడే అజీర్తి, ఎసిడిటీ వంటి సమస్యలను తగ్గించడానికి మజ్జిగ సహాయపడుతుంది. ఈ సమస్యలతో బాధపడేవారు మజ్జిగలో (Buttermilk) జీలకర్ర (Cumin), ఇంగువ (Asparagus), సైంధవ లవణం (Synthetic salt) కలిపి తీసుకున్నట్లయితే ఉదర సమస్యలు తగ్గుతాయి. అలాగే పరగడుపున మజ్జిగ తాగితే జీర్ణ సమస్యలు దూరమవుతాయి.
 

68

డయాబెటిస్ ను తగ్గిస్తుంది: డయాబెటిస్ ఉన్నవారు మజ్జిగను తీసుకుంటే మంచి ఫలితాన్ని పొందవచ్చును. ఇందుకోసం మజ్జిగలో (Buttermilk) సగం టీ స్పూన్ మిరియాల పొడి (Pepper powder), రెండు కరివేపాకులు (Curries) కలిపి తాగితే షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. దీంతో డయాబెటిస్ తగ్గుతుంది. అంతేకాకుండా కొవ్వు కూడా తగ్గుతుంది.  
 

78

గుండె ఆరోగ్యంగా ఉంటుంది: మజ్జిగను తీసుకుంటే గుండె సంబంధిత సమస్యలు తగ్గి గుండె ఆరోగ్యంగా (Heart health) ఉంటుంది. అలాగే బీపీని అదుపులో ఉంచడంతో పాటు చెడు కొలెస్ట్రాల్ (Bad Cholesterol) ను కూడా నివారిస్తుంది. శరీరానికి హాని కలిగించే వ్యర్థాలను బయటకు పంపడంలో కూడా సమర్ధవంతంగా సహాయపడుతుంది.
 

88

అంతేకాకుండా మజ్జిగను తీసుకుంటే ఎముకలు దృడంగా మారుతాయి. అలాగే మూత్రంలో మంట (Inflammation in the urine), పొడి చర్మ సమస్యలు (Dry skin problems) కూడా తగ్గుతాయి. కనుక రోజులో ఎక్కువ సార్లు మజ్జిగను తాగండి ఆరోగ్యంగా ఉండండి.

click me!

Recommended Stories