Diabetes: నోటి నుంచి దుర్వాసన వస్తోందా..? అయితే మీకు డయాబెటిస్ వచ్చినట్టే..!

Published : Mar 24, 2022, 09:38 AM IST

Diabetes: మీకు నోటి నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మీరు డయాబెటిస్ బారిన పడ్డట్టేనంటున్నారు నిపుణులు. ఎలా అంటే.. 

PREV
18
Diabetes: నోటి నుంచి దుర్వాసన వస్తోందా..? అయితే మీకు డయాబెటిస్ వచ్చినట్టే..!

Diabetes: ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్ రోగుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. ఇక మన దేశంలో అయితే చిన్న వయసు నుంచి ముసలి వాళ్ల వరకు డయాబెటిస్ వ్యాధి బారిన పడుతూ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ వ్యాధి నుంచి పూర్తిగా ఉపశమనం పొందేందుకు మందులు నేటికీ కూడా అందుబాటులో లేవు. కేవలం ఈ వ్యాధి పెరిగిపోకుండా  నియంత్రించడానికి ఎన్నో మెడిసిన్స్ మాత్రం మనకు అందుబాటులో ఉన్నాయి. 

28

అయితే ఈ  వ్యాధి సోకడానికి అసలు కారణం.. మారుతున్న మన జీవన శైలే. చెడు ఆహారపు అలవాట్ల మూలంగానే చాలా మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారని ఆరోగ్య నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఈ సమస్య ఎందుకు వస్తుంది? అన్న అవగాహన లేకపోవడం వల్లే నేడు ఎంతో మంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. సమస్యను మరింత పెద్దది చేస్తున్నారు. 
 

38
bad breath

మన రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగితే.. ఆ లక్షణాలు నోటి ద్వారా తెలుసుకోవచ్చంటున్నారు నిపుణులు. మధుమేహం కేవలం మన శరీరంలోని ఒక్క భాగానికే పరిమితం కాదు. ఇది మన శరీరంలోని ప్రతిపార్ట్ ను ప్రభావితం చేస్తుందట.

48

ఇకపోతే ఎవరికైతే నోటి దుర్వాసన వస్తుందో.. వారు డయాబెటిక్ వ్యాధి బారిన పడ్డట్టేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవును మన రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోతే వారి నోటి నుంచి దుర్వాసన వస్తుందట. 

58

షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడానికి  వ్యాయామం, మంచి ఆహారం వంటివి తీసుకుంటున్నా.. ఒక్కోసారి షుగర్ లెవెల్స్ పెరగొచ్చంట. అలాంటి సమయంలో కూడా నోటినుంచి దుర్వాసన వస్తుందని నిపుణులు అంటున్నారు. ఇలా వచ్చినప్పుడు మూత్ర, దంత పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 

68

ఎవరి నోటి నుంచైతే బ్యాడ్ స్మెల్ వస్తుందో వారు నోటి పరీక్షను తప్పనిసరిగా చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వైద్య భాషలో దీన్నే Halitosis అంటారు. అంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే.. మౌత్ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుందట. 

78

మధుమేహ రోగుల్లో కొన్ని అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అందులో కీటో అసిడోసిన్ ఒకటి. ఇది చాలా ప్రమాదకరం. దీనివల్ల ప్రాణాలో పోయే ప్రమాదం ఉంది. అయితే ఈ సమస్య మధుమేహుల్లో సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇది ఇన్సులిన్ స్రామాన్ని నిరోధించి..  కీటోన్ లను ఎక్కువగా స్రవిస్తుంది. దీనివల్ల రక్తంలో అసిటోన్, కార్బన్ డైయాక్సైడ్ చేరి.. కడుపు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు వచ్చేలా చేస్తాయి. ఒక్కోసారి వీటి మూలంగా కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం కూడా ఉంది. అంతేకాదు.. దీనివల్ల ప్రాణాలు కూడా పోవచ్చు. 

88

కాబట్టి నోటి నుంచి దుర్వాస వచ్చే వాళ్లు తప్పనిసరిగా మూత్ర పరీక్షచేయించుకోవాలి. ఈ పరీక్ష ద్వారా కీటోన్లు ఉన్నాయా? లేదా అనేది నిర్ధారించుకోవచ్చు. మీకు తెలుసా.. డయాబెటిక్ పేషెంట్లలో నోటి దుర్వాసన సమస్య సర్వసాధారణంగా వచ్చేదే నట. 
 

click me!

Recommended Stories