మద్యం తాగిన తర్వాత వీటిని అస్సలు తినకండి.. తింటే గుండెపోటు కూడా రావొచ్చు జాగ్రత్త..

First Published Sep 11, 2022, 2:44 PM IST

అప్పుడప్పుడు మందు కొట్టడం వల్ల జరిగే అనర్థం ఏమీ ఉండదు. కానీ ఆల్కహాల్ తాగిన తర్వాత కొన్ని రకాల ఆహారాలను తింటే గుండెపోటు కూడా రావొచ్చు జాగ్రత్త.. 

ఆనందమొచ్చి.. బాధొచ్చినా టక్కున కొందరికి గుర్తొచ్చేది మద్యమే. అయితే కొందరు ఆల్కహాల్ ను తాగడానికి కారణాలు వెతుక్కుంటే.. మరికొందరు మాత్రం సమయం సందర్భం అంటూ ఏదీ లేకుండా.. రోజూ లాగిస్తూనే ఉంటారు. రాతం ఆల్కహాల్ ను తాగితే మాత్రం మీ ఆయుష్షు దగ్గర పడుతున్నట్టే. దీనికి తోడు లివర్ దెబ్బతింటుంది. గుండె రిస్క్ లో పడుతుంది. శరీరం సక్రమంగా పనిచేయదు. మొత్తంగా చెప్పాలంటే ఈ మందు మిమ్మల్ని మంచానికే పరిమితం చేస్తుందన్న మాట. అందుకే ఆల్కహాల్ తరచుగా తాగడం మానేయండి. ఇక ఎప్పుడన్నా ఒకసారి తాగితే అప్పుడు కూడా లిమిట్ లోనే తాగండి. ఇక ఈ సంగతి పక్కన పెడితే.. ఆల్కహాల్ తాగిన తర్వాత ఏది పడితే అది తినకూడదు. తింటే మీరు డేంజర్ లో పడతారు. ఇంతకీ మద్యం తాగినప్పుడు ఎలాంటి ఆహారాలను తినకూడదో తెలుసుకుందాం పదండి. 
 

నూనె పదార్థాలను తీసుకోకూడదు

ఆల్కహాల్ తాగేటప్పుడు చాలా మంది ఆయిలీ ఫుడ్స్ నే ఎక్కువగా తింటుంటారు. ఆ సమయంలో అవి టేస్టీగా అనిపించినా మీ ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. ఒకవేళ ఆల్కహాల్ తాగి ఆయిలీ ఫుడ్స్ ను తింటే జీర్ణక్రియ సక్రమంగా పనిచేయదు. అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ కూడా వస్తుంది. ముఖ్యంగా ఈ  ఫుడ్స్ గుండెను రిస్క్ లో పడేస్తాయి. 
 

పాలు, తీపి పదార్థాలు

ఫుల్ గా ఆల్కహాల్ తాగిన తర్వాత పాలు, తీపి పదార్థాలను తాగకపోవడమే మంచిది. వీటివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. అందులో ఆల్కహాల్ ను తాగి పాలు తాగితే హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉంది. ఇక స్వీట్ ఐటమ్స్ తింటే మత్తు దారుణంగా పెరిగిపోతుంది. దీంతో మీరు unconsciousness లోకి వెళ్లిపోతారు. అందుకే మందు తాగిన తర్వాత పాలు, స్వీట్ ఐటమ్స్ ను ఎట్టి పరిస్థితిలో తీసుకోకండి. 
 

శీతల పానీయాలు, సోడా

సాధారణంగా కొంతమంది మద్యంలో నీళ్లను కలుపుకుని తాగుతుంటారు. ఇంకొంతమంది మాత్రం శీతల పానీయాలనో లేదా సోడానో మిక్స్ చేసుకుని తాగుతుంటారు. నిజానికి సోడాలను, శీతల పానీయాలను ఆల్కహాల్ ను కలుపుకుని తాగకూడదు. ఇది మీ బాడీ డీహైడ్రేషన్ బారిన పడేస్తుంది. అందుకే ఇంకెప్పుడైనా ఆల్కహాల్ తాగుతున్నప్పుడు దానిలో నీళ్లు మాత్రమే కలుపుకుని తాగండి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. 

click me!