రెండేండ్ల కంటే ఎక్కువ వయసున్న పిల్లలకు ఈ ఆహారాలను తప్పక పెట్టండి..

First Published Sep 11, 2022, 2:01 PM IST

ఎదుగుతున్న పిల్లలకు బలమైన ఆహారం చాలా అవసరం. ఈ ఫుడ్ శరీర ఎదుగుదలకే కాదు బ్రెయిన్ అభివృద్ధికి కూడా సహాయపడుతుంది. 

పిల్లలకు పౌష్టికాహారం చాలా అవసరం. పౌష్టికాహారంతోనే పిల్లలు ఎలాంటి జబ్బులు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఎదుగుతున్న పిల్లలకు మంచి ఆహారం ఇవ్వకపోతే పోషకాహార లోపంతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. పౌష్టికాహారం ఎదుగుతున్న శరీరానికే కాదు మెదడు అభివృద్ధికి కూడా సహాయపడుతుంది. రెండేండ్ల కంటే ఎక్కువ వయసున్న పిల్లలకు ఎలాంటి ఆహారాలను ఇవ్వాలో తెలుసుకుందాం పదండి. 

గుడ్డు

ఎదుగుతున్న పిల్లలకు పెట్టాల్సిన పోషకాహారంలో గుడ్లు ముందు ప్లేస్ లో ఉంటాయి.  ఎందుకంటే గుడ్లు పోషకాల భాండాగారం. ప్రోటీన్లు పుష్కలంగా ఉండే గుడ్లలో విటమిన్లు, క్యాల్షియం, ఐరన్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ గుడ్లు పిల్లల ఎదుగుదలకు ఎంతో సహాయపడతాయి. 

పాలు

పిల్లల ఆరోగ్యానికి పాలు ఎంతో అవసరం. పాలు పిల్లల శరీరాన్ని శక్తివంతంగా తయారుచేస్తాయి. వీటిలో కాల్షియం తో పాటుగా విటమిన్ డి కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవి పిల్లల ఎముకలు, దంతాలను బలంగా ఉంచడానికి సహాయపడతాయి. 

బచ్చలి కూర

పిల్లలకు తప్పకుండా పెట్టాల్సిన ఆహారాల్లో బచ్చలికూర కూడా ఒకటి. ఆకు కూరలలో బచ్చలి కూర ఎన్నో పోషకవిలువలు కలిగినది. బచ్చలికూరలో ఎన్నో రకాల విటమిన్లు ఉంటాయి. వీటిలో విటమిన్ ఎ,విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె, కాల్షియం, పొటాషియం, ఐరన్ ఉంటాయి. ఈ కూరలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు, ప్రోటీన్, ఫైబర్ లు  పిల్లల మెదడు అభివృద్ధికి సహాయపడతాయి.

క్యారెట్లు

క్యారెట్లలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. వీటిలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది పిల్లల కంటిచూపును మెరుగుపరుస్తుంది. ఇవి దంతాల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అందుకే పిల్లలకు క్యారెట్లను తప్పకుండా ఇవ్వాలి. 
 

ఆరెంజ్

ఆరెంజ్ లు కూడా ఎన్నో ఔషదగుణాలను కలిగి ఉంటాయి. ఈ సిట్రస్ ఫ్రూట్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది పిల్లలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో ఎన్నో అంటువ్యాధులు దూరమవుతాయి. అందుకే నారింజ పండ్లను పిల్లలకు ఇవ్వండి. 
 

click me!