ఆస్తమా రోగులకు ఈ ఆహారాలు చాలా మంచివి..

First Published Sep 11, 2022, 12:40 PM IST

ఆస్తమా రోగులు కొన్ని రకాల ఆహారాలను తప్పకుండా తినాలి. ఇవి ఆస్తమా లక్షణాలను చాలా వరకు తగ్గిస్తాయి. వారి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయి. 
 

ఆస్తమా వ్యాధి ప్రపంచంలో అత్యంత సాధారణ వ్యాధులలో ఒకటిగా మారిపోయింది. ఆస్తమాను పూర్తిగా తగ్గించుకోకపోయినా.. దీన్ని నియంత్రించవచ్చు. ఇందుకోసం మందులు, ఆహారం ఎంతో సహాయపడతాయి. ఈ ఆస్తమా వల్ల ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది. అలాగే నిద్రలేమి సమస్య కూడా వస్తుంది. దీనికి తోడు ఇది ఎన్నో ప్రమాదకరమైన రోగాలకు దారితీస్తుంది. ఆస్తమా పేషెంట్లు ఎలాంటి ఆహారాలను తినాలో తెలుసుకుందాం పదండి. 

apple

ఆపిల్

రోజూ ఒక ఆపిల్ పండును తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదంటారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే దీనిలో ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించే ఔషదగుణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండులో విటమిన్ సి, ఇ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తాయి. శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారు ముఖ్యంగా ఆస్తమా రోగులు ఆపిల్ పండ్లను తప్పకుండా తినాలి. 
 

అల్లం

ఆస్తమా పేషెంట్లు తప్పకుండా తినాల్సిన జాబితాలో అల్లం కూడా ఒకటి. ఊపిరితిత్తుల వ్యాధులను నివారించడంలో అల్లం ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అందుకే ఆస్తమా రోగులు తమ ఆహారంలో అల్లం ఉండేట్టు చేసుకోవాలి. అల్లాన్ని నీళ్లలో మరిగించి తాగితే ఆస్తమా లక్షణాలు తగ్గుతాయి. 
 

garlic

వెల్లుల్లి

వెల్లుల్లిలో కూడా ఎన్నో ఔషదగుణాలుంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి.. ఒక గ్లాసు నీటిలో కలిపి రోజుకు ఒకసారి తాగితే చాలా మంచిది. అరకప్పు పాలలో మూడు లేదా నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి మరిగించి తాగినా మంచి ప్రయోజనాలను పొందుతారు. 

పసుపు

పసుపును ఆయుర్వేదంలో ఔషదాల తయారీలో నేటికీ ఉపయోగిస్తూనే ఉన్నారు.  కర్కుమిన్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఎన్నో అంటువ్యాధులతో పోరాడటానికి సహాయపడతాయి. ఇది ఆస్తమా రోగులకు కూడా చాలా మంచిది.

బచ్చలికూర

బచ్చలికూరలో ఎన్నో రకాల ప్రోటీన్లు, విటమిన్లు, పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఆస్తమా రోగుల్లో మెగ్నీషియం, పొటాషియం లోపం ఉంటుంది. ఇవి బచ్చలి కూరలో పుష్కలంగా ఉంటాయి. అందుకే ఆస్తమా రోగులు బచ్చలికూరను తప్పకుండా తినాలి. 
 

తేనె

తేనెను ఆస్తమాను నియంత్రించడానికి ఎన్నో ఏండ్ల నుంచి ఉపయోగిస్తున్నారు. వీళ్లు పడుకునే ముందు ఒక టీస్పూన్ తేనెలో చిటికెడు దాల్చినచెక్క పొడిని కలపి తీసుకోవచ్చు. ఇది శ్లేష్మాన్ని తొలగించడంలో సహాయపడుతుంది.
 

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే గ్రీన్ టీ ఆస్తమా పేషెంట్లకు ఎంతో మేలు చేస్తుంది. ఇది శరీరంలోని ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. అందుకే ఆస్తమా పేషెంట్లు గ్రీన్ టీని తప్పకుండా తాగాలి. అదికూడా లిమిట్ లోనే. 

ఉసిరిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధకక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ఆస్తమా రోగలు ఉసిరిని తప్పకుండా తీసుకోవాలి. 

వాల్ నట్స్ లో ఒమేగా -3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. వీటికి ఆస్తమాతో పోరాడే సామర్థ్యం కూడా ఉంటుంది.
 

click me!