ఫుడ్ విషయంలో ఈ జాగ్రత్తలను తీసుకుంటే.. మొటిమలు వాటంతట అవే తగ్గిపోతాయి..

First Published Aug 27, 2022, 2:04 PM IST

వాతావరణ కాలుష్యం, ముఖంపై మురికి పేరుకుపోవడం వంటి కారణాల వల్లే కాదు.. మీరు తినే ఆహార పదార్థాల ద్వారా కూడా ముఖంపై మొటిమలు ఏర్పడతాయి. 
 

యువతను ఎక్కువగా వేధించే సమస్యల్లో మొటిమలు  ఒకటి. ఈ మొటిమలు వివిధ కారణాల వల్ల వస్తాయి. ఈ మొటిమలు జిడ్డు చర్మం ఉన్నవారికే ఎక్కువగా అవుతాయి. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే మొటిమల నుంచి ఉపశమనం పొందుతారు. అవేంటో తెలుసుకుందాం పదండి. 

వాటర్

నీరే సర్వరోగిని అంటారు కొంతమంది ఆరోగ్య నిపుణులు.  నీటిని పుష్కలంగా తాగడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉండటంతో పాటుగా.. ఆరోగ్యంగా కూడా ఉంటుంది. వాటర్ ఎన్నో రకాల సమస్యలను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అంతెందుకు రోజూ పుష్కలంగా నీళ్లను తాగితే మొటిమలు మెల్లి మెల్లిగా తగ్గిపోతాయి. 
 

వేయించిన ఆహారాలు

నూనెలో వేయించిన ఆహారాలు మన ఆరోగ్యానికి ఏమాత్రం మంచివి కావు. ముఖ్యంగా ఇవి చర్మంపై చెడు ప్రభావాన్ని చూపెడుతాయి. ఎందుకంటే వీటిలో నూనె క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది. ఇదికాస్త మొటిమలు రావడానికి దారితీస్తుంది. అంతేకాదు ఈ నూనె శరీరంలో కొవ్వుతో పాటుగా కేలరీలను కూడా పెంచుతుంది. అందుకే నూనెలో వేయించిన ఆహారాలకు దూరంగా ఉండండి. అప్పుడే మొటిమలు తగ్గడం ప్రారంభమవుతాయి. శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. 
 

పాలు, పాల ఉత్పత్తులు

పాలు, పాల ఉత్పత్తుల ద్వారా మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. అయితే మొటిమల సమస్య ఎక్కువగా ఉన్నవారు మాత్రం వీటిని తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే పాల ఉత్పత్తుల్లో చర్మం జిడ్డును పెంచే కొన్ని పదార్థాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అందుకే వీటిని తీసుకోకూడదు. 
 

చక్కెర 

మీ రోజు వారి ఆహారంలో చక్కెర, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు ఉండకుండా జాగ్రత్తపడండి.  గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోకపోవడం వల్ల చర్మ ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం ఉండదు. ముఖ్యంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలను, రసాలు తీసుకోకండి. 

ఉప్పు

ఉప్పును మోతాదుకు మించి తీసుకుంటే కూడా మొటిమలు వస్తాయి. అందుకే వీటి వాడకాన్ని తగ్గించవచ్చు.  శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఉప్పును మితంగానే తీసుకోవాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

కొవ్వు పదార్థాలు

కొవ్వు పదార్థాలు మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కావు. ఇవి ఎన్నో ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. ముఖ్యంగా ఇవి చర్మ ఆరోగ్యాన్ని చాలా ప్రభావితం చేస్తాయి. అందుకే వేయించిన, ప్రాసెస్ చేసిన, కొవ్వు అధికంగా ఉండే ఆహారాలను  తినడం మానుకోండి. 

click me!