వినాయక చవితి వినాయకుడి జన్మదినాన్ని సూచించే పండుగ. ఇక ఈ ఏడాది ఈ పండుగ ఆగస్టు 31 న ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 9న ముగుస్తుంది. వినాయకుడిని విఘ్నహర్త, విఘ్నకర్త, గణపతి, వినాయకుడు అంటూ మరెన్నో పేర్లతో పిలుస్తారు. దేవతలందరిలో వినాయకుడే మొదటి పూజలు అందుకుంటాడు.
హిందూ పంచాంగం ప్రకారం.. భాద్రపద మాసంలో శుక్లపక్షంలోని చతుర్థి తిథి నాడు వినాయక చవితిని జరుపుకుంటాం. ఈ పండుగను మనం 10 రోజుల పాటు సెలబ్రేట్ చేసుకుంటాం.. ఇలా పదిరోజులే ఎందుకు జరుపుకుంటాం.. దీనివెనకున్న చరిత్ర ఏంటో తెలుసుకుందాం పదండి.
Image: Getty Images
మరాఠా పాలకుడు శివాజీ వినాయక చవితి ఉత్సవాలను ప్రారంభించాడని చరిత్ర చెబుతోంది. ఎందుకంటే మొఘలులతో పోరాడుతున్న తమ పౌరుల్లో జాతీయవాద భావాలను రేకెత్తిండానికే ఇలా చేశాడని నిపుణులు చెబుతున్నారు. 1893 లో లోకమాన్య తిలక్ గణేష్ చతుర్థి సంప్రదాయన్ని పునరుద్దరించారు.
Image: Getty Images
బ్రిటీష్ పాలనా కాలంలో యువతలో స్వాతంత్ర్య పోరాట భావాలను రేకెత్తించడానికి లోకమాన్య తిలక్ గణేష్ చతుర్థి ఉత్సవాల గురించి ఆలోచించారు. ఈ పండుగ హిందూమత ఆచారాలు, ఆరాధనలతో సంబంధం ఉన్నందున బ్రిటీషర్లు కూడా దీనిలో జోక్యం చేసుకోలేదు.
Image: Getty Images
1893 లో పూణేలో వినాయక చవితి వేడుకలను బహిరంగంగా ప్రారంభించారు. దీని ముఖ్య ఉద్ధేశ్యం స్వాతంత్ర్య ఉధ్యమంలో భాగంగా ప్రజలందరినీ ఏకతతాటిపైకి తీసుకురావడం. అలాగే భారతీయులందరం కలిసికట్టుగా ఉంటాం.. అన్న భావాన్ని బ్రిటీషర్లకు తెలియజేయడం.
Image: Getty Images
లోకమాన్య తిలక్ పూణేలో ఒక బహిరంగ సభను నిర్వహించి.. భాద్రపద శుక్ల చతుర్థి నుంచి భాద్రపద శుక్ల చతుర్థి (అనంత్ చతుర్దశి) వరకు గణేష్ చతుర్థి వేడుకలను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. గణేష్ చతుర్థి భారతీయుల్లో ఐక్యతా భావాన్ని పెంపొందించాలని.. బ్రిటీష్ పాలన నుంచి విముక్తి పొందేందుకు ఈ పండుగను జరుపుకోవాలని నిర్ణయించారు.
ganesh chaturthi 2022
అప్పట్లోనే మహారాష్ట్ర అంతటా ప్రజలందరూ పెద్ద ఎత్తున గణేష్ ఉత్సవాలను జరుపుకోవడం ప్రారంభించారు. ఈ గణేష్ చతుర్థిని జరుపుకోవాలనే భావన క్రమంగా ఇతర రాష్ట్రాలకు వ్యాపించింది కూడా ఈ మహారాష్ట్ర నుంచే. అప్పటి నుంచి ఈ పండుగను ఇతర రాష్ట్రాలు ఘనంగా జరుపుకోవడం మొదలుపెట్టాయి.