ఈ టీ లు బ్లడ్ షుగర్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచుతాయి.. తప్పక తాగండి

First Published Aug 27, 2022, 11:54 AM IST

ఈ రోజుల్లో మధుమేహుల సంఖ్య బారీగా పెరిగిపోతూనే ఉంది. అయితే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంచడానికి ఈ స్పెషల్ టీలు మీకెంతో సహాయపడతాయి. 

30 ఏండ్లు నిండితే చాలు.. ఎక్కడలేని రోగాలు శరీరానికి చుట్టుకుంటాయి. అందులో థైరాయిడ్, ఒత్తిడి, ఫ్యాటీ లివర్, అధిక కొలెస్ట్రాల్ వంటి వ్యాధులు మరీ దారుణంగా వ్యాపిస్తున్నాయి. ఇక వీటన్నింటిలో డయాబెటీస్ పేషెంట్ల సంఖ్య అయితే మరీ దారుణంగా ఎక్కువ అవుతుంది. ఈ వ్యాధి నుంచి బయటపడాలంటే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవాలి. లేదంటే శరీరం మొత్తంపై తీవ్రమైన చెడు ప్రభావం పడుతుంది. అయితే కొన్ని రకాల టీలను తాగితే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. 
 

అల్లం టీ 

అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటుగా ఇతర పోషక పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. అయితే మధుమేహులకు అల్లం ఎంతో మేలు చేస్తుంది. అల్లంతో చేసిన టీ డయాబెటీస్ పేషెంట్లకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను సరిగ్గా ఉంచుతుంది. అలాగే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. దీన్ని మీరు ప్రతిరోజూ తీసుకోవచ్చు. 
 

Image: Getty Images

అలోవెరా టీ

అలోవెరా టీ అని ఇంతకుముందెప్పుడూ విని ఉండరు. కానీ ఇది డయాబెటిస్ పేషెంట్లకు ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే కలబంద టీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను  కూడా తగ్గిస్తుంది. అలాగే ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతుంది. ఇందుకోసం ఉదయాన్నే కలబంద ఆకులను కోసి గుజ్జును బయటకు తీయాలి. దీనిని నీటిలో వేసి బాగా మరిగించి తాగితే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. 

దాల్చిన చెక్క టీ 

దాల్చిన చెక్కలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఈ దాల్చిన చెక్క టీని రోజుకు తాగితే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ టీ కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపర్చడమే కాదు మధుమేహాన్ని కూడా అదుపులో ఉంచుతుంది. మేరీల్యాండ్ విశ్వవిద్యాలయం ప్రచురించిన ఒక నివేదికలో ఈ విషయం వెల్లడైంది.

టర్మరిక్ టీ 

ప్రతిరోజూ 1 కప్పు పసుపు టీ తాగడం వల్ల శరీరం హెల్తీగా ఉంటుంది. ఈ టీ రోగనిరోధక శక్తిని  పెంచుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రణలో ఉంచుతుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో ఈ పసుపు టీని ప్రయోజనకరంగా ఉంటుంది. 
 

diabetes

డయాబెటీస్ వల్ల మానసిక ఆందోళన, అలసట, ఆతురత వంటి ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. అనారోగ్యకరమైన జీవనశైలి కూడా మధుమేహానికి కారణం కావొచ్చు. ఒకసారి ఈ వ్యాధి సోకినాక ఎంతో జాగ్రత్తగా ఉండాలి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించకపోతే.. శరీరంలోని మిగిలిన భాగాలను ఇది ప్రభావితం చేస్తుంది. కాబట్టి వ్యాధిని నివారించడానికి లేదా డయాబెటిక్ రోగులు ఆరోగ్యంగా ఉండటానికి మంచి ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలి. 

click me!