ఇంటి ఆర్థిక పరిస్థితిని ప్రతి భార్య అర్థం చేసుకోవాలి. అందుకు తగినట్టుగా నడుచుకోవాలి. ఎక్కడ ఖర్చు పెట్టాలో, ఎక్కడ పొదుపులో చేయాలో తెలిసిన భార్యే తెలివైనది. అనవసరంగా ఖర్చు చేయకుండా, అవసరానికి తగినట్టుగా డబ్బును వాడుతూ, పొదుపు చేసే భార్య ఆ భర్తకు పెద్ద ఆస్తి లాంటిది. ఇది కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది.
భార్య మాట తీరు కూడా చాలా ముఖ్యం ఆమె మాటతీరే ఇంటిని నిలబెడుతుంది. వినయంగా, మధురంగా మాట్లాడే భార్య దొరికిన పురుషుడు ఎంతో లక్కీ. ఆ ఇల్లు ఎప్పుడూ శాంతి, ప్రేమ నిండి ఉంటాయి. కఠినంగా మాట్లాడే మాటలు మాటలు బంధంలో పగుళ్లు ఏర్పడేలా చేస్తాయి.