Mukesh Ambani: ముకేశ్ అంబానీ 27 అంతస్తుల ఇంట్లో ఒక్క ఏసీ కూడా పెట్టలేదు.. ఎందుకు?

Published : Mar 30, 2026, 08:38 AM IST

Mukesh Ambani: ముకేశ్ అంబానీ ఇల్లు ఆంటిలియా దేశంలోనే అత్యంత విలాసవంతమైన భవనం. ఇందులో అన్ని సౌకర్యాలు ఉంటాయి. కానీ ఒక్క ఏసీ కూడా కనిపించదు. ఏసీ లేకుండా అంబానీ కుటుంబం ఎలా జీవిస్తోంది. 

PREV
14
అంబానీల ఇల్లు ఆంటిలియా

ప్రపంచంలోని అత్యంత సంపన్న గృహం ఆంటిలియా. ఇందులో ముకేశ్ అంబానీ కుటుంబం నివసిస్తోంది. ముంబైలోని వర్లీ ప్రాంతంలో ఉన్న ఈ ఇల్లు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, విలాసవంతమైన ప్రైవేట్ నివాసాల్లో ఒకటిగా నిలుస్తుంది. సుమారు రూ. 15,000 కోట్లతో కట్టిన ఈ 27 అంతస్తుల భవనంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. వేలాడే తోటలు, స్నో రూమ్, థియేటర్, జిమ్, ఆరు అంతస్తుల కార్ పార్కింగ్, హెలిప్యాడ్.. ఇలా అన్నీ సౌకర్యాలతో నిర్మించారు. కానీ ఈ ఇంట్లో ఒక్కటంటే ఒక్క ఏసీ కూడా పెట్టలేదు.

24
ఏసీ లేకుండా ఎలా?

కోటీశ్వరుల ఇంట్లో ఏసీ లేకపోవడం ఏమిటి అని మీకు అనిపించవచ్చు. కానీ ఇది నిజం. ముంబై లాంటి వేడి, తేమ ఉన్న నగరంలో ఏసీ లేకుండా ఉండటం చాలా కష్టం. అయినా ఈ 27 అంతస్తుల భవనం ఏసీ లేకుండానే చల్లగా ఉంటుంది. ఇల్లు కట్టినప్పుడే దానికి తగ్గ ఏర్పాట్లు చేశారు. ఇంటి లోపలికి అడుగుపెడితే వేడే తగలదు. హాయిగా ఉంటుంది.

34
కూలింగ్ సిస్టమ్ ఇది

అంబానీల ఆంటిలియాలో ఏసీలకు బదులుగా, అత్యాధునిక సెంట్రలైజ్డ్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ (సెంట్రలైజ్డ్ కూలింగ్ సిస్టమ్) ఉంది. ఈ సిస్టమ్ ప్రత్యేకత ఏంటంటే బయట కనిపించే కంప్రెషర్లు లేదా అవుట్‌డోర్ యూనిట్లు దీనికి ఉండవు. ఈ సిస్టమ్ ఆటోమేటిక్ గా పనిచేస్తుంది.  కానీ ఇంటిలోపల మాత్రం చల్లగా ఉంటుది.

44
ఎందుకిలా కట్టారు

ఆంటిలియా బయటి నుంచి అందంగా కనిపించాలనే ఉద్దేశంతో ఆర్కిటెక్ట్‌లు ఏసీ కంప్రెషర్లు వంటివి బయటికి కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. అలాంటి ఏసీలను వాడలేదు.  ఇంట్లోని ఖరీదైన మార్బుల్స్, అరుదైన మొక్కలు, పువ్వులు.. సాధారణ ఏసీల నుంచి వచ్చే తీవ్రమైన చల్లగాలికి దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే, మొక్కలు, మార్బుల్స్‌కు అనుగుణంగా ఉష్ణోగ్రత ఆటోమేటిక్‌గా కంట్రోల్ అయ్యేలా భవనంలోని అత్యాధునిక కూలింగ్ సిస్టమ్ పనిచేస్తుంది. ః

Read more Photos on
click me!

Recommended Stories