గుడ్ల కంటే ఈ ఆహారాల్లోనే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది తెలుసా..?

First Published Jan 6, 2023, 1:44 PM IST

ప్రోటీన్లకు బెస్ట్ ఫుడ్ అంటే మనందరికీ ముందుగా గుర్తొచ్చే ఆహారం గుడ్డు. ఒక్క గుడ్డులోని ప్రోటీన్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయనుకుంటారు. నిజమేంటంటే.. గుడ్లకంటే ఇతర ఆహారాల్లో కూడా ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అవేంటంటే.. 
 

protein rich foods

మన శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉండటానికి ప్రోటీన్ కంటెంట్ చాలా ముఖ్యం. ప్రోటీన్ వివిధ ఆహారాల్లో ఉంటుంది. కానీ చాలా మంది ప్రోటీన్ కోసం ప్రోటీన్ షేక్స్ ను తాగుతుంటారు. ప్రోటీన్లు పొందాలంటే వీటినే తాగాల్సిన అవసరం. వీటివి బదులుగా ప్రోటీన్లు ఎక్కువగా ఉండే  ఆహారాలను తింటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ మీ శరీరంలో ప్రోటీన్ లోపం ఉంటే.. కండరాల నొప్పి, కండరాల సమస్యలు, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం, హార్మోన్ల మార్పులు వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. వ్యాయామం చేసిన తర్వాత కండరాలు త్వరగా కోలుకోవడానికి ప్రోటీన్ ఎంతో సహాయపడుతుంది.

protein

ఓపెన్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. మన శరీర శక్తిని పెంచుకోవడానికి రోజుకు కనీసం 0.7 గ్రాముల ప్రోటీన్ ను శరీర బరువులో ఒక పౌండ్ కోసం తీసుకుంటే సరిపోతుంది. అంటే మీరు మీ ప్రతి భోజనంలో 15 నుంచి 20 గ్రాములు, ఒకటి నుంచి రెండు స్నాక్స్ లో 10 నుంచి 15 గ్రాముల ప్రోటీన్ ను తీసుకోవాలన్న మాట. మన శరీర ప్రోటీన్ అవసరాలను తీర్చడానికి ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినడం అలవాటు చేసుకోవాలి. అవేంటంటే.. 

గ్రీకు పెరుగు

అర కప్పు గ్రీకు పెరుగు (100 గ్రాములు) ద్వారా సుమారు 10 గ్రాముల ప్రోటీన్ అందుతుంది. ఈ గ్రీకు పెరుగులో క్యాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది దంతాలను, ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. 
 

కాటేజ్ చీజ్

అరకప్పు కాటేజ్ చీజ్ ద్వారా మన శరీరానికి 11 గ్రాముల ప్రోటీన్ అందుతుంది. తక్కువ కొవ్వు ఉన్న ఆహారాన్ని  ఎంచుకుంటే వాటిలో  కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. అందుకే మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నట్టైతే కొవ్వులేని చీజ్ ను ప్రయత్నించండి. 
 

గుడ్డు

రెండు గుడ్ల ద్వారా మన శరీరానికి 12 గ్రాముల ప్రోటీన్ అందుతుంది. గుడ్లలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు విటమిన్ ఎ, కాల్షియం, మెగ్నీషియం వంటి ఎన్నో రకాల పోషకాలు గుడ్లలో పుష్కలంగా ఉంటాయి. రోజూ ఒక ఉడక బెట్టిన గుడ్డును తింటే మీ ఆరోగ్యానికి ఏ డోకా ఉండదు. 
 

చికెన్

100 గ్రాముల చికెన్ నుంచి సుమారు 27 నుంచి 29 గ్రాముల ప్రోటీన్ అందుతుంది. దీనిలో కొవ్వు తక్కువగా ఉంటుంది. దీనిలో విటమిన్ బి 6, విటమిన్ బి 12 లు పుష్కలంగా ఉంటాయి. ఎర్ర రక్త కణాలు ఏర్పడటానికి, నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి ఇది చాలా ముఖ్యం.
 

పాలు

200 మి.లీ పాల ద్వారా మన శరీరానికి 7.2 గ్రాముల ప్రోటీన్  అందుతుంది. పాలలో అయోడిన్, విటమిన్ బి 12 తో పాటుగా కాల్షియంతో సహా ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 
 

సోయా

200 మి.లీ సోయా పాల నుంచి 6.6 గ్రాముల ప్రోటీన్ ను పొందుతాము. దీనిలో కొవ్వు, కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే ఈ పాలలో చక్కెర కలపకుండా వట్టిగానే తాగితే మంచిదని నిపుణులు చెబుతున్నారు. 
 

పన్నీర్

పనీర్, పెరుగులో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. పనీర్ లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రోటీన్లు మాత్రం ఎక్కువగా ఉంటాయి. అందుకే పన్నీర్ ను తీసుకుంటే బరువు పెరిగిపోతామేమోనని భయపడొద్దు. నాలుగు ఔన్సుల పనీర్ సుమారుగా 14 గ్రాముల ప్రోటీన్ ను ఇస్తుంది.

click me!