చిన్న వయసులో జుట్టు తెల్లబడొద్దంటే ఈ పనులను చేయండి..

First Published Jan 6, 2023, 12:04 PM IST

చిన్న వయసులో జుట్టు తెల్లబడటానికి కారణాలెన్నో ఉంటాయి.  అయితే కొన్ని పనులు చేస్తే జుట్టు తెల్లబడే అవకాశం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే.. 
 

ముఖంపై ముడతలు, ఎముకల్లో బలం తగ్గడం, డబుల్ చిన్ వంటివన్నీ వృద్ధాప్యానికి సంకేతాలు. అంతేకాదు తెల్లజుట్టు కూడా వృద్ధాప్యానికి స్పష్టమైన సంకేతం. ఒకప్పుడు తెల్లజుట్టు వస్తే వీళ్ల వయసు మీద పడుతుందని అర్థం చేసుకునే వాళ్లు. కానీ ఇప్పుడు 25, 30 ఏండ్ల వారికి కూడా తెల్లజుట్టు వస్తోంది. దీనివల్ల వీరి వయసు పెద్దవారిలా కనిపిస్తుంది. అంతేకాదు ఈ తెల్లజుట్టు మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఇలా తెల్లజుట్టు చిన్నవయసులో రావడానికి కారణాలు చాలానే ఉన్నాయి. అయితే కొన్ని పనులను చేస్తే తెల్లజుట్టు వచ్చే అవకాశమే ఉండదంటున్నారు నిపుణులు. 

ఒత్తిడిని తగ్గించండి

ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది తమ ఆరోగ్యం గురించి పూర్తిగా పట్టించుకోవడమే మానేశారు. ముఖ్యంగా తీరికలేని పనుల వల్ల ఒత్తిడికి గురవుతున్నారు. మీకు తెలుసా ఒత్తిడి పెరిగితే కూడా జుట్టు తెల్లబడటం మొదలవుతుందని ఎన్నో పరిశోధనలు నిరూపించాయి. అందుకే సాధ్యమైనంత వరకు ఒత్తిడి లేకుండా ఉండండి. ఇందుకోసం ప్రతిరరోజూ ధ్యానం చేయండి. 
 

ఆయిలీ ఫుడ్, జంక్ ఫుడ్

మనలో చాలా మంది ఇంటి ఫుడ్ కంటే బయటి ఫుడ్ అయిన జంక్ ఫుడ్, ఆయిల్  ఫుడ్ నే ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఇది టేస్టీగా ఉంటుంది. రుచిలో బాగున్నా.. ఈ ఫుడ్ మనన ఆరోగ్యాన్ని మాత్రం దారుణంగా దెబ్బతీస్తుంది. చిన్న వయసులో తెల్లజుట్టు రాకూడదంటే ప్రోటీన్, బయోటిన్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ఐరన్, జింక్, విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహారాలను రోజూ తినండి. 
 

పుష్కలంగా నిద్రపోండి

ప్రస్తుత కాలంలో చాలా మంది రాత్రిళ్లు ఫోన్ లను ఎక్కువగా వాడుతున్నారు. ఫోన్ల వాడకం వల్ల ఎన్నో ఎన్నోన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా వీటివల్ల కంటినిండా నిద్ర ఉండదు. దీనివల్ల జుట్టు కూడా ప్రభావితం అవుతుంది. అంటే నిద్రలేమి వల్ల  జుట్టు తెల్లబడుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఆరోగ్యవంతమైన వయోజనులు రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇంతకు మించి తక్కువ గంటలు నిద్రపోతే మీకు తెల్లజుట్టు రావడాన్ని ఎవరూ ఆపలేరు. 

ఆయిల్ మసాజ్

మన జుట్టుకు అంతర్గత పోషణ చాలా అవసరం. అలాగే బాహ్య పోషణ కూడా అంతే అవసరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తెల్లజుట్టు నల్లగా మారాలన్నా.. తెల్ల జుట్టు మొత్తమే రాకూడదన్నా.. సహజ నూనెలతో నెత్తిమీద మసాజ్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. మసాజ్ కోసం ఆముదం, ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె, ఆవనూనెలను వాడండి. 
 

సిగరెట్లు

పెద్దలే కాదు చిన్న వయసు వారు కూడా సిగరేట్లకు, సిగార్లు, బీడీలు, హుక్కా, గంజాయికి బానిసలవుతున్నారు. కానీ వీటివాడకం వల్ల మీకు ఎన్నో ప్రాణాంతకమైన రోగాలు వస్తాయి. అంతేకాదు ఈ అలవాట్లు మీ జుట్టుపై కూడా ప్రభావాన్ని చూపిస్తాయి. అంటే మీ జుట్టు చిన్నవయసులోనే తెల్లబడటానికి కారణమవుతుంది. అందుకే వీలైనంత తొందరగా స్మోకింగ్ అలవాటును మానుకోండి. 
 

click me!