నారింజ పండ్లను వీళ్లు పొరపాటున కూడా తినొద్దు..

First Published Jan 6, 2023, 12:41 PM IST

నారింజ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ పండును తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. కొన్ని అనారోగ్య సమస్యలు కూడా నయమవుతాయి. అయితే కొంతమంది మాత్రం ఈ పండ్లను అసలే తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 

భారతదేశంలో ఎక్కువ మంది ఇష్టంగా తినే పండ్లలో నారింజ పండ్లు ఒకటి. ఇవి చవకగా లభిస్తాయి. వీటిని సీజన్లతో సంబంధం లేకుండా తినొచ్చు. ఎందుకంటే ఈ పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. నారింజల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, భాస్వరం వంటి పోషకాలు ఉంటాయి. ఇవన్నీ మన శరీరాలకు ఎన్నో విధాలా మేలు చేస్తాయి.  ఈ పండును తింటే రోగాలతో పోరాడటానికి మన  ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఈ పండ్ల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నా..  కొంతమంది మాత్రం అస్సలు తినకూడదు. ఎవరెవరంటే.. 
 

ఎసిడిటీతో బాధపడుతున్న వాళ్లు

ఎసిడిటీకి ఎన్నో కారణాలుంటాయి. కారణమేదైనా ఈ సమస్య ఉన్నవారు మాత్రం నారింజ పండును కానీ దాని రసాన్ని కానీ తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది సిట్రస్ పండు. వీటిని తింటే కడుపు, ఛాతిలో చికాకు పెడుతుంది. ఎసిడిటీ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. సిట్రస్ పండ్లలో ఎసిడిటీని పెంచే లక్షణాలు ఉంటాయి. 
 

దంతాలలో కుహరం

నారింజ పండ్లు ఆరోగ్యానికి మేలు చేసేవే అయినా.. వీటిలో ఒకరకమైన ఆమ్లం ఉంటుంది. ఇది దంతాల ఎనామిల్ లో ఉన్న కాల్షియంతో కలిస్తే బ్యాక్టీరియా సంక్రమణకు దారితీస్తుంది. దంతాల కుహరం ఉన్నప్పుడు నారింజ తినకపోవడమే మంచిది. ఒకవేళ తింటే మీ దంతాలు చెడిపోతాయి. 
 

కడుపు నొప్పి

కడుపు నొప్పి ఒక్కటేమిటీ ఎన్నో కారణాల వల్ల వస్తుంది. మీకు ఈ కడుపు నొప్పి ఉన్నప్పుడు నారింజ పండును పొరపాటున కూడా తినకండి. ఎందుకంటే ఈ నారింజ పండులో ఉండే ఆమ్లం కడుపు నొప్పిని మరింత పెంచుతుంది. అందుకే ఇలాంటి సమయంలో ఈ సిట్రస్ పండును తినకపోవడమే మంచిది. 
 

కడుపు సమస్యలు

పడుపునకు సంబంధించిన సమస్యలతో బాధపడేవారు నారింజ పండ్లను ఎట్టి పరిస్థితిలో తినకూడదు. ఎందుకంటే ఈ పండ్లను తింటే కడుపు తిమ్మిరి, అజీర్థి, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి. నారింజ పండ్లలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది విరేచనాలు వంటి సమస్యలను కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. 
 

click me!