క్షణం గడిచిందంటే చాలు.. మనం ఆ క్షణానికి పాతబడిపోయినట్టే.. వయసు మీద పడిపోయినట్టే.. ప్రతీ ఒక్కరూదీనినుంచి తప్పించుకోలేదు. వృద్ధాప్యం అనేది తప్పించుకోలేని తప్పని జీవనచక్రం. అలాంటప్పుడు భయపడడం దేనికి? అయితే.. వయసుకు మించి ముందుగానే ఏజింగ్ సంకేతాలు కనిపించడం సమస్య. అందుకే ఇలా కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు.
దీనికి అనేక రకాల కారణాలు ఉంటాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి లేకపోవడం వల్ల కూడా తొందరగా ఏజింగ్ లక్షణాలు కనిపిస్తాయి. తొందరగా శరీరాన్ని వృద్ధాప్యంలోకి నెట్టేస్తాయి. అలాంటి ఏడు అలవాట్లు మిమ్మల్ని వయసు కంటే తొందరగా ముసలివారిని చేసేస్తాయి. అవేంటో చూండి..
సన్ స్క్రీన్ : ఆల్ట్రా వాయిలెట్ సూర్యకిరణాలకు ఎక్కువగా ఎక్స్ పోజ్ అవ్వడం వల్ల సహజంగా వయసు మీద పడడం కంటే 80 శాతం ఎక్కువ తొందరగా వృద్ధాప్య ఛాయలు వచ్చేస్తాయి. దీనివల్ల చర్మం పొడిబారిపోయి, మచ్చలు, పిగ్మెంటేషన్, ముడతలు పడుతుంది.
రాత్రిపూట సరిగా నిద్రపోకపోవడం.. ఏడుగంటలకంటే తక్కువ నిద్ర పోవడం ఇవన్నీ మీ చర్మాన్ని డల్ గా చేస్తాయి. దీంతో పాటు చర్మంపై ప్రభావం చూపించి తొందరగా ఏజింగ్ వచ్చేలా చేస్తుంది.
పొగ తాగడం మీ ఆరోగ్యానికే కాదు.. చర్మానికి కూడా నష్టాన్ని కలిగిస్తుంది. పొగవల్ల చర్మం ఎలాస్టిసిటీని తగ్గించే ఎంజైమ్ ను యాక్టివేట్ చేస్తుంది. దీనివల్ల చర్మంమీద ముడతలు, గీతలు తొందరగా పడతాయి. దీనివల్ల వయసు తొందరగా మీద పడ్డట్టుగా కనిపిస్తాయి.
చాలామందికి బోర్లా పడుకోవడం అలవాటు ఉంటుంది. బోర్లా పడుకున్నప్పుడు మొహం దిండుకు అదుముకుపోయి.. మొహం మీద గీతలు ఏర్పడే అవకాశం ఉంది.
చక్కెర ఎక్కువగా తినడం వల్ల ఫ్రీ రాడికల్స్ శరీరంలో ఎక్కువయి అనారోగ్యంగా తయారవుతారు. దీనివల్ల చర్మం దెబ్బతింటుంది. ఇది అటోమెటిక్ గా వృద్ధాప్య లక్షణాలకు దారి తీస్తుంది.
ఎలక్ట్రానిక్ వస్తువులకు అతిగా ఎక్స్ పోజ్ అవ్వడం వల్ల కూడా తొందరగా ఏజింగ్ లక్షణాలు కనిపిస్తాయి. ఫోన్లు, టాబ్ లెట్స్, టీవీలు ఎక్కువగా చూడడం వల్ల చర్మం సెన్సిటివ్ అయి.. ప్రిమెచ్యూర్ ఏజింగ్ కి దారి తీస్తుంది.
stress
బాగా ఒత్తిడికి లోనవడం వల్ల కూడా తొందరగా వృద్దాప్యఛాయలు కనిపించేలా చేస్తుంది. ఒత్తిడి తెలియకుండానే మన శరీరం మీద పనిచేసి.. శరీరం సాగే గుణాన్ని కోల్పోయేలా చేస్తుంది. దీనివల్ల పిగ్మెంటేషన్ కూడా వస్తుంది.