ఎండలోకి వెళ్లినప్పుడు లేదా ఇంట్లో ఉన్నప్పుడు సన్‌స్క్రీన్ వాడకపోతే, UV కిరణాలు చర్మంలోని కొల్లాజెన్ పొరను దెబ్బతీసి త్వరగా ముసలితనం వచ్చేలా చేస్తాయి.
మితిమీరిన తీపి పదార్థాలు: చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల 'గ్లైకేషన్' ప్రక్రియ జరిగి చర్మాన్ని బిగుతుగా ఉంచే కొల్లాజెన్, ఎలాస్టిన్ ప్రోటీన్లు నాశనమవుతాయి. దీని వల్ల కూడా ముఖంపై తొందరగా ముడతలు వచ్చేస్తాయి.
ధూమపానం, ఆల్కహాల్: స్మోకింగ్ వల్ల చర్మానికి ఆక్సీజన్ అందదు, ఆల్కహాల్ చర్మంలోని తేమను విపరీతంగా తగ్గిస్తుంది. ఈ అలవాట్లు మార్చుకోకపోతే.. చర్మం పై ముడతలు వచ్చేస్తాయి.
దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి: ఎక్కువగా ఒత్తిడికి గురైనప్పుడు 'కార్టిసోల్' అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది చర్మ కణజాలాన్ని దెబ్బతీసి ముడతలను వేగవంతం చేస్తుంది. వీలైనంత వరకు ఒత్తిడి తగ్గించుకోవాలి.
రాత్రివేళ ముఖాన్ని శుభ్రం చేసుకోకపోవడం: రోజంతా పేరుకుపోయిన దుమ్ము, మురికి లేదా మేకప్‌ను తొలగించకుండా పడుకోవడం వల్ల చర్మ రంధ్రాలు పూడుకుపోయి మెరుపు కోల్పోతుంది. ముడతలు కూడా వచ్చేస్తాయి. అందుకే.. రాత్రి పడుకునే ముందు కచ్చితంగా ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
ఈ అలవాట్లు మార్చుకుంటే...ముఖంపై ముడతలు తగ్గించి మీరు ఎక్కువ రోజులు యవ్వనంగా కనిపిస్తారు.