రెండు చెంచాల ధనియాల విత్తనాలను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఆ నీటిని సన్నని మంటపై 5 నుండి 10 నిమిషాల పాటు మరిగించాలి. నీరు చల్లారిన తర్వాత దానిని వడకట్టి, ఒక స్ప్రే సీసాలోకి తీసుకోవాలి.
ఉపయోగించే విధానం:
హెయిర్ రిన్స్ : షాంపూతో తలస్నానం చేసిన తర్వాత, చివరిగా ఈ ధనియాల నీటితో మాడును, జుట్టును కడిగి 10-15 నిమిషాల పాటు ఉంచి, ఆ తర్వాత సాధారణ నీటితో తడిపి వదిలేయవచ్చు.
స్ప్రే : స్ప్రే సీసా సహాయంతో జుట్టు కుదుళ్లకు నేరుగా స్ప్రే చేసి, వేళ్లతో సున్నితంగా మసాజ్ చేసుకోవచ్చు. వారంలో 2 నుండి 3 సార్లు ఈ విధంగా చేయవచ్చు.
ఇది నిజంగా పనిచేస్తుందా? ధనియాల నీరు జుట్టు ఆరోగ్యానికి తోడ్పడుతుందనడంలో సందేహం లేదు, కానీ ఇది అందరికీ ఒకేలా పనిచేయకపోవచ్చు. కానీ, దీనిలోని విటమిన్లు, ఖనిజాలు జుట్టుకు బాహ్య పోషణను అందిస్తాయి.
అయితే.. నాలుగు రోజులు నీటిని వాడి జుట్టు పెరగలేదు అని మాత్రం అనుకోవద్దు. రెగ్యులర్ గా ఫాలో అయితే అనుకున్న ఫలితాలు వస్తాయి. జన్యుపరమైన జుట్టు రాలే సమస్యలు , హార్మోన్ల అసమతుల్యత లేదా తీవ్రమైన విటమిన్ లోపాలు ఉన్నప్పుడు కేవలం ఈ నీరు మాత్రమే సరిపోదు. ఇతర జాగ్రత్తలు కూడా తీసుకోవాలి.