Mutton Biryani: మటన్ బిర్యానీ చేయడం కష్టమని చాలామంది అనుకుంటారు. కానీ టేస్టీ బిర్యానీ చేయాలంటే అంతగా కష్టపడాల్సిన పనిలేదు. ఈ సింపుల్ టిప్స్ తో వంట రానివారు కూడా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ మటన్ బిర్యానీని ఈజీగా చేసేయొచ్చు. అవేంటో చూసేయండి.
కొత్తగా వంట నేర్చుకునే వాళ్లకు, త్వరగా వంట ముగించాలనుకునే వాళ్లకు 'వన్ పాట్ మటన్ బిర్యానీ' బెస్ట్ ఆప్షన్. సాధారణంగా బిర్యానీ చేయాలంటే అన్నం, మసాలా వేర్వేరుగా చేసి 'దమ్' పెట్టాలి. కానీ ఒకే ప్రెజర్ కుక్కర్‌లో, టేస్ట్ ఏమాత్రం తగ్గకుండా ఈజీగా బిర్యానీ చేయొచ్చు. మరి ఈ రెస్టారెంట్ స్టైల్ బిర్యానినీ ఇంట్లోనే ఈజీగా, సక్సెస్ ఫుల్ గా ఎలా చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
28
ఫస్ట్ మ్యారినేషన్
మటన్ ముక్కలు మెత్తగా, మసాలా బాగా పట్టాలంటే మ్యారినేషన్ చాలా ముఖ్యం. తాజా పెరుగు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, కొద్దిగా నిమ్మరసం, పసుపు, ఉప్పు వేసి మటన్‌ను బాగా కలపాలి. కనీసం గంటసేపు నానబెడితే, వండేటప్పుడు ముక్కలు దూదిలా మెత్తగా అవుతాయి.
38
మసాలా తయారీ
షాపుల్లో దొరికే ప్యాకెట్ మసాలాల కన్నా, ఇంట్లో అప్పటికప్పుడు చేసుకున్న మసాలా బిర్యానీకి మంచి సువాసన ఇస్తుంది. యాలకులు, లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, అనాస పువ్వు, జాజికాయ-జాపత్రిని దోరగా వేయించి పొడి చేసుకోవాలి. దీనికి కొద్దిగా సోంపు కలిపితే మంచి ఫ్లేవర్ వస్తుంది.
బిర్యానీ రుచి, రంగు రెండూ ఉల్లిపాయలు వేయించే విధానంపైనే ఆధారపడి ఉంటాయి. నూనె, నెయ్యి మిశ్రమంలో సన్నగా తరిగిన ఉల్లిపాయలను గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేవరకు వేయించాలి. ఉల్లిపాయలు త్వరగా వేగడానికి చిటికెడు చక్కెర వేసుకోవచ్చు. కానీ మాడిపోకుండా చూసుకోవాలి, లేదంటే బిర్యానీ చేదుగా వస్తుంది.
58
మంచి ఫ్లేవర్ కోసం..
ఉల్లిపాయలు వేగాక, తరిగిన టమాట, పుదీనా, కొత్తిమీర ఆకులు వేయాలి. టమాట పూర్తిగా మెత్తబడి గ్రేవీలా అవ్వాలి. పుదీనా, కొత్తిమీరలో సగం తాలింపులో, మిగతా సగం దించే ముందు వేస్తే బిర్యానీకి మంచి ఫ్లేవర్ చివరి వరకు ఉంటుంది.
68
బిర్యానీ పొడిపొడిగా రావాలంటే..
బియ్యాన్ని కడిగి, 20 నుంచి 25 నిమిషాలు మాత్రమే నానబెట్టాలి. ఎక్కువసేపు నానబెడితే అన్నం ఉడికేటప్పుడు విరిగిపోతుంది. నానబెట్టిన బియ్యాన్ని మసాలాలో వేసే ముందు, కొద్దిగా నెయ్యిలో వేయిస్తే అన్నం పొడిపొడిగా, పొడవుగా వస్తుంది.
78
నీటి కొలత ముఖ్యం
వన్ పాట్ బిర్యానీలో నీళ్ల కొలత చాలా ముఖ్యం. ఒక కప్పు బాస్మతి బియ్యానికి, ఒకటిన్నర కప్పుల నీళ్లు పోయాలి. మటన్ ఉడికేటప్పుడు వచ్చే నీళ్లను కూడా లెక్కలోకి తీసుకోవాలి. కొద్దిగా చిక్కటి కొబ్బరిపాలు వేస్తే బిర్యానీకి అదనపు రుచి, సాఫ్ట్ నెస్ వస్తాయి.
88
ఆవిరి మొత్తం పోయేవరకు..
కుక్కర్‌లో మటన్‌ను 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి, 70 శాతం ఉడికాక బియ్యం వేయాలి. బియ్యం, నీళ్లు పోశాక, కుక్కర్ మూతపెట్టి, మీడియం ఫ్లేమ్ మీద ఒకే ఒక్క విజిల్ రానిచ్చి స్టవ్ ఆపేయాలి. ఆవిరి మొత్తం పోయే వరకు 15-20 నిమిషాలు మూత తీయకూడదు. ఇదే వన్ పాట్ బిర్యానీకి సహజమైన 'దమ్'. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే, వంట రానివాళ్లు కూడా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ బిర్యానీని ఈజీగా చేసేయొచ్చు.