Chapati: నీళ్లు ఎక్కువై చపాతీ పిండి చేతికి అంటుకుంటుందా? పొడి పిండి వేయకుండా ఇలా ట్రై చేయండి

Published : May 22, 2026, 03:27 PM IST

Chapati: చపాతీ, రోటీ కలిపేటప్పుడు పిండిలో నీళ్లు ఎక్కువై చేతికి అంటుకుంటోందా? వెంటనే కంగారు పడి పొడి పిండి వేసేయకండి. ఇలా ట్రై చేయండి. చపాతీలు మెత్తగా వస్తాయి, రుచి కూడా అదిరిపోద్ది. 

PREV
17
చపాతీ పిండిలో నీళ్లు ఎక్కువయ్యాయా?

చపాతీ, రోటీ లేదా పరోటా బాగా రావాలంటే పిండి సరైన టెక్స్చర్‌లో ఉండాలి. మరీ గట్టిగా ఉన్నా, మరీ జారుగా ఉన్నా చపాతీలు సరిగా రావు. ముఖ్యంగా నీళ్లు ఎక్కువై పిండి చేతికి అంటుకుంటే చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అయితే అలాంటి సమయంలో ఓ హైరానా పడిపోయి వెంటనే పొడి పిండి వేసేయకండి. కొన్ని సింపుల్ కిచెన్ చిట్కాలతో మెత్తటి పిండిని ఈజీగా సరిచేసుకుని చపాతీలు తయారు చేసుకోవచ్చు.

27
మెత్తబడిన పిండిని సరిచేసే చిట్కాలు

పిండి చేతికి అంటుకుంటుంటే, కొద్దిగా వంట నూనె లేదా పాలను చేతికి రాసుకుని పిండిని మరోసారి కలపండి. ఇలా చేయడం వల్ల పిండి చేతికి అంటదు. మీరు సులభంగా ఉండలు చేసుకోవచ్చు.

37
ఫ్రిజ్‌లో పెట్టండి

ఫ్రిజ్‌లో పెట్టండి. ఇది చాలా ప్రభావవంతమైన పద్ధతి. మెత్తగా అయిన పిండిని ఒక గాలి చొరబడని డబ్బాలో పెట్టి 15 నుంచి 20 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో ఉంచండి. ఫ్రిజ్‌లోని చల్లటి వాతావరణానికి పిండిలోని గ్లూటెన్ సెట్ అయి, జిగురుతనం తగ్గుతుంది.

47
పొడి పిండి కలపండి

పొడి పిండి కలపండి. మెత్తబడిన పిండిపై కొద్దిగా పొడి పిండి చల్లి, తేలికగా మరోసారి కలపండి. గుర్తుంచుకోండి, ఒకేసారి ఎక్కువ పొడి పిండి వేయొద్దు. అలా చేస్తే చపాతీలు గట్టిగా అయిపోతాయి.

57
నెయ్యి ఉపయోగించండి

కిచెన్ ప్లాట్‌ఫామ్‌ను శుభ్రం చేసి, దానిపై ఒక చెంచా నెయ్యి రాయండి. తర్వాత దానిపై పిండిని పెట్టి చేతితో బాగా కలపండి. దీంతో పిండి సరైన పద్ధతిలోకి వస్తుంది.

67
బటర్ పేపర్ లేదా ప్లాస్టిక్ షీట్ ఉపయోగించండి

ఒక ప్లాస్టిక్ కవర్ లేదా బటర్ పేపర్ తీసుకుని, దానికి కొద్దిగా నెయ్యి లేదా పొడి పిండి రాయండి. దాని మధ్యలో పిండి ఉండను పెట్టి, పైన మరో ప్లాస్టిక్ షీట్ వేసి చపాతీ చేయండి. ఇలా చేస్తే చపాతీ ఎక్కడా అంటుకోకుండా సులభంగా వస్తుంది.

77
కొంతసేపు తెరిచి ఉంచండి

గిన్నెపై మూత తీసి 5-10 నిమిషాల పాటు ఫ్యాన్ గాలికి పెట్టండి. గాలి తగలడం వల్ల పిండి పైభాగంలో ఉన్న తేమ ఆరిపోయి, చపాతీ చేయడానికి సులభంగా ఉంటుంది.  పిండి కలిపేటప్పుడు ఎప్పుడూ నీళ్లను కొద్దికొద్దిగా పోసుకోండి. ఒకవేళ పొరపాటున నీళ్లు ఎక్కువైతేనే పైన చెప్పిన ఉపాయాలు వాడండి.

Read more Photos on
click me!

Recommended Stories