Air Cooler: ఎండలకు వేడి విపరీతంగా పెరిగిపోతోంది. ఏసీ కొనలేని వారు కూలర్ తోనే సర్దుకుంటున్నారు. అయితే కూలర్ నుంచి చల్లని గాలి రావాలంటే చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. మీ కూలర్ ఏసీలా చల్లని గాలిని అందించే ఉపాయాన్ని ఇక్కడ ఇచ్చాము.
వేసవిలో మధ్యతరగతి వారు ఎక్కువగా వాడేది ఎయిర్ కూలర్‌నే. ఏసీ ని కొనే స్తోమత అందరికీ ఉండదు. అయితే కూలర్‌ని కూడా ఏసీలా మార్చుకోవచ్చు. కూలర్ వాడేటప్పుడు చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే ఏసీ కన్నా చల్లని గాలిని పొందవచ్చు. దానికోసం ఎలాంటి చిట్కాను ఉపయోగించాలో తెలుసుకోండి.
23
ఉప్పు చిట్కా పాటించండి
కూలర్ నుంచి వచ్చే గాలి చల్లగా రావాలంటే మీరు ఉప్పును, ఐస్ క్యూబ్స్ ను ఉపయోగించవచ్చు. మార్కెట్లో 10 రూపాయలకే సాధారణ ఉప్పు ప్యాకెట్ దొరుకుతుంది. ఈ ఉప్పు, మంచు కలిసి కూలర్లోని గాలిని బాగా చల్లబరుస్తాయి. మీ కూలర్ నుండి చల్లటి గాలి రాకపోతే అందులో వేసిన కొన్ని ఐస్ క్యూబ్స్ పై ఉప్పు చల్లండి. అప్పుడు మీ కూలర్ నుండి చల్లటి గాలి రావడం మొదలవుతుంది. ఉప్పు ఐస్ క్యూబ్స్ త్వరగా కరగకుండా అడ్డుకుంటుంది. కాబట్టి ఎక్కువ సేపు ఐస్ క్యూబ్స్ అలాగే నిలిచి ఉంటాయి. దీనివల్ల చల్లని గాలిని ఎక్కువ సేపు నీరు అనుభూతి చెందవచ్చు .
33
కూలర్ ఎక్కడ పెడితే మంచిది
చాలామంది చేసే పని కూలర్‌ను గది లోపల ఉంచుతారు. దీని వల్ల కూలర్ నుంచి వేడిగాలి బయటకు వస్తుంది. అది కూడా గది లోపలే ఉండడం వల్ల చల్లని గాలిని అనుభూతి చెందలేరు. కాబట్టి కూలర్‌ను గదికి కొంచెం బయట ఉంచడమే మంచిది. అప్పుడు కూలర్ నుంచి వచ్చే గాలి గది లోపలికి వెళుతుంది. ఇక వేడిగాలి కూలర్ వెనుక నుంచి బయటికి పోతుంది. నిజానికి ఏసీ కంటే కూలర్ ఎక్కువ ప్రయోజనకరమైనది. ఏసీ గాలి వల్ల గది పొడిగా మారుతుంది. అదే కూలర్ ను ఉపయోగించడం వల్ల గాలిలో తేమ అలాగే నిలిచి ఉంటుంది. దీని వల్ల చర్మం పొడిబారదు.