వేసవి కాలంలో చెమట రావడం సహజం. కానీ కొంతమందికి చెమట ఎక్కువగా రావడంతో పాటు ఒకరకమైన వాసన వస్తుంటుంది. దానివల్ల నలుగురిలో కూర్చోవడానికి ఇబ్బందిపడాల్సి వస్తుంది. అంతేకాదు వేసుకున్న దుస్తులు కూడా తొందరగా మురికి అయిపోతాయి. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో ఇలాంటి పరిస్థితి నుంచి ఈజీగా ఎలా తప్పించుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
నిమ్మరసం..
నిమ్మకాయలో సహజ యాంటీ బాక్టీరియల్ గుణాలుంటాయి. నిమ్మ ముక్కలతో చంకలను రుద్దండి. కొన్ని నిమిషాల తర్వాత కడిగేయండి. చెమట దుర్వాసన ఈజీగా తగ్గిపోతుంది.
26
బేకింగ్ సోడా
బేకింగ్ సోడా చెమటను పీల్చుకుని.. దుర్వాసన కలిగించే బాక్టీరియాను చంపుతుంది. ఒక చెంచా బేకింగ్ సోడాలో నీళ్లు కలిపి పేస్ట్‌లా చేసి చంకలకు రాసి 10 నిమిషాల తర్వాత కడిగేయండి.
36
ఆపిల్ సైడర్ వెనిగర్
ఆపిల్ సైడర్ వెనిగర్ శరీర pH స్థాయిని సమతుల్యం చేసి, బాక్టీరియాను చంపుతుంది. స్నానం చేసే నీటిలో ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ కలిపి చంకలు శుభ్రంగా కడుక్కోండి.
46
పటిక వాడండి
పటికలో యాంటీసెప్టిక్ గుణాలు ఉంటాయి. ఇది చెమట దుర్వాసనను నియంత్రిస్తుంది. స్నానం తర్వాత తడి పటికను చంకలకు రుద్దండి. దీంతో చెమట, దుర్వాసన తగ్గుతాయి.
56
గులాబీనీరు, పుదీనా రసం
శరీరానికి చల్లదనం, తాజాదనం కోసం పుదీనా ఆకులు మరిగించి చల్లార్చండి. దీన్ని వడకట్టి గులాబీ నీరు కలిపి స్ప్రే బాటిల్‌లో పోసి డియోడరెంట్‌లా వాడండి.
66
కొబ్బరి నూనె
కొబ్బరి నూనెలో లారిక్ ఆమ్లం ఉంటుంది. ఇది బాక్టీరియాను చంపుతుంది. స్నానం తర్వాత శుభ్రమైన చంకలకు కొబ్బరి నూనె రాసుకోండి. లేదా కొబ్బరి నూనెలో టీ ట్రీ ఆయిల్ కలిపి కూడా రాసుకోవచ్చు.