మనలో చాలా మంది దుస్తులను శుభ్రంగా ఉతికేసి నీట్ గా ఐరన్ చేసుకుని వేసుకునే అలవాటు ఉంటుంది. అయితే మీరు ఐరన్ చేసిన దుస్తులను ఎలా పెడుతున్నారనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఐరన్ చేసిన తర్వాత కొన్ని తప్పులు చేస్తే ఐరన్ చేసిన వాటిలా అస్సలు కనిపించవు.
ఎప్పుడైనా సరే మరకలు, మురికిగా ఉన్న దుస్తులను ఐరన్ అస్సలు చేయకూడదు. ఎందుకంటే దీనివల్ల దుస్తులకున్న మురికి, మరకలు ఎప్పటికీ అలాగే ఉంటాయి. అంటే ఈ మరకలు మీరు తర్వాత ఉతికినా కూడా పోవు. అందుకే ఇలాంటి వాటిని ఇస్త్రీ చేయకూడదు.
25
మరకలున్న ఐరన్ బాక్స్
చాలా మంది ఐరన్ పై ఏమైన దుమ్ము, ధుళి, మరకలు ఉన్నాయా?లేవా? అని కూడా చూడకుండా ఐరన్ చేస్తుంటారు. కానీ మరకలున్న ఐరన్ బాక్స్ తో ఇస్త్రీ చేస్తే అవి దుస్తులకు పడుతుంది. అందుకే ఐరన్ బాక్స్ కు తుప్పు లాంటిది ఉందేమో చెక్ చేసిన తర్వాతే ఐరన్ చేయండి.
35
ఐరన్ ఇలా చేయాలి
ఐరన్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలను ఖచ్చితంగా తీసుకోవాలి. ముఖ్యంగా దుస్తులను ఎప్పుడైనా సరే లోపలి నుంచే ఐరన్ చేయాలి. ఎందుకంటే దీని వేడి దుస్తులను పాడు చేస్తుంది.
ఐరన్ ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు. దుస్తులకున్న ముడతలు పోవాలంటే మెత్తని ప్రదేశాల్లో ఐరన్ చేయకూడదు. మెత్తని ప్రదేశంపై ఐరన్ చేస్తే దుస్తులకు ముడతలు అలాగే ఉంటాయి. కాబట్టి మీరు గట్టిగా ఉండే ప్రదేశంలోనే ఐరన్ చేయాలి. అలాగే క్లాత్ రకాన్ని బట్టి ఇస్త్రీ వేడిని సర్దుబాటు చేసుకోవలి.
55
మడతపెట్టడం
దుస్తులను ఐరన్ చేసిన వెంటనే మడత పెట్టేస్తుంటారు చాలా మంది. కానీ ఇస్త్రీ చేసిన వెంటనే దుస్తులను అస్సలు మడత పెట్టకూడదు. ఎప్పుడైనా సరే దుస్తుల వేడి తగ్గిన తర్వాతే మడతపెట్టండి.