శరీరంలో ఉత్పత్తి అయ్యే ఒక వ్యర్థ పదార్థం యూరిక్ యాసిడ్. ఇది శరీరంలో అధికంగా పేరుకుపోతే ఎన్నో ఆరోగ్యసమస్యలు వస్తాయి. మీ శరీరంలో యూరిక్ ఆమ్లం అధికంగా ఉంటే కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. అది కూడా రాత్రిపూటే అధికంగా ఈ లక్షణాలు కనిపించే అవకాశం ఉంది.
యూరిక్ యాసిడ్ ప్రతి ఒక్కరి శరీరంలో విడుదలయ్యే ఒక ఆమ్లం. ఇది ప్యూరిన్ విచ్ఛిన్నం వల్ల ఏర్పడుతుంది. దీన్ని కిడ్నీలు ఫిల్టర్ చేసి బయటికి పంపేస్తాయి. కానీ శరీరంలో అత్యధికంగా యూరిక్ యాసిడ్ ఉత్పత్తి అయితే మూత్రపిండాలు దాన్ని ఫిల్టర్ చేయలేవు. అలాంటప్పుడు అది శరీరంలోనే పేరుకుపోతుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగిపోతే కొన్ని లక్షణాల ద్వారా ఆ విషయాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్యంగా రాత్రివేళల్లోనే లక్షణాలు కనిపిస్తాయి.
25
కీళ్ల నొప్పులు
రాత్రిపూట మీకు తరచూ కీళ్ల నొప్పులు వస్తూ ఉంటే తేలికగా తీసుకోకండి. మీ శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి ఎక్కువగా ఉందనడానికి ఇది ఒక లక్షణమని చెప్పుకోవాలి. యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగినప్పుడు అది కీళ్లలో స్ఫటికాలుగా పేరుకుపోతుంది. దీని ఫలితంగా చీలమండ, మోచేతులు, మోకాళ్లలో నొప్పి వస్తుంది. అదీ ఈ నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది.
35
కీళ్ల గట్టిదనం
కీళ్లలో నొప్పి, వాపు, ఎరుపు, దురద ఇవన్నీ కూడా యూరిక్ యాసిడ్ శరీరంలో అధికంగా పేరుకుపోవడం వల్ల కనిపించే లక్షణాలు ఇవి. ఈ సమస్య ఉన్నవారు ఒకే పొజిషన్‌లో నిద్రపోకూడదు. అలా నిద్రపోతే కీళ్లలో రక్త ప్రసరణకు ఆటంకం కలుగుతుంది. అప్పుడు గట్టిదనం పెరుగుతుంది. తర్వాత ఉదయం లేచేటప్పుడు కాలు కదపలేనంత ఇబ్బంది కలుగుతుంది. ఈ వాపు, గట్టిదనం మోకాళ్లలో స్పష్టంగా కనిపిస్తుంది.
అధిక యూరిక్ యాసిడ్ వల్ల కిడ్నీలపై అధిక ఒత్తిడి పడుతుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు మూత్రపిండాలు అదనంగా కష్టపడాలి. దీనివల్ల తరచుగా మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. ఆ సమయంలో మూత్రం చాలా తక్కువగానే వస్తుంది.
55
చెమటలు పట్టడం
యూరిక్ యాసిడ్ వల్ల శరీరంలో పేరుకుపోత శరీరమంతా విపరీతంగా చెమటలు పడతాయి. వాపు, నిరంతర నొప్పి నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల రాత్రిళ్లు ఎలాంటి కారణం లేకుండా అసౌకర్యం, ఆందోళనగా అనిపిస్తుంది.