Train: ఒక్క స్టేషన్ లో కూడా ఆగకుండా..528 కిలో మీటర్లు ప్రయాణించే నాన్ స్టాప్ రైలు..!

Published : Sep 12, 2026, 01:52 PM IST

Train: ఒక రైలు దాదాపు 528 కిలో మీటర్ల దూరం ప్రయాణిస్తుంది. కానీ, ఏ స్టేషన్ లోనూ ఆగదు. మధ్యలో ఏ ఒక్క ప్రయాణికుడిని కూడా ఎక్కించుకోదు. ఈ రైలుు ఏ స్టేషన్ లోనూ ఎందుకు ఆగదు?

PREV
13
Non Stop Train

మన దేశంలో ఎక్కువ మంది రైలు ప్రయాణమే చేస్తూ ఉంటారు. ఎక్కువ దూరం ప్రయాణించాలి అంటే.. ఎక్కువ మంది ముందు ఉండే ఆప్షన్ రైలు. కొన్ని గంటల పాటు సాగే ఈ రైలు ప్రయాణంలో ఎన్నో స్టేషన్స్ లో రైలు ఆగుతూనే ఉంటుంది. ఎక్కేవాళ్లు ఎక్కుతూనే ఉంటారు.. దిగేవాళ్లు దిగుతూనే ఉంటారు. కానీ, మన దేశంలో ఒక్క స్టేషన్ లో కూడా ఆగకుండా, ఏకంగా 528 కిలో మీటర్లు నాన్ స్టాప్ గా దూసుకెళ్లే రైలు ఒకటి ఉందంటే నమ్ముతారా? అవును, రాజస్థాన్ లోని కోటా నుంచి గుజరాత్ లోని వడోదరా వరకు ప్రయాణించే ఆ రైలు గురించి ఇప్పుడు చూద్దాం..

23
ఏంటి ఆ రైలు..?

ఒక్క స్టేషన్ లో కూడా ఆగకుండా.. 528 కిలో మీటర్లు ప్రయాణించే రైలు గా రికార్డు క్రియేట్ చేసుకున్నది త్రివేండ్రం రాజధాని ఎక్స్ ప్రెస్. సాధారణంగా ఎక్స్ ప్రెస్ లేదా సూపర్ ఫాస్ట్ రైళ్లు కూడా ప్రతి 50 నుండి 100 కిలోమీటర్లకు ఒకసారి ఏదో ఒక స్టేషన్ లో ఆగుతూ ఉంటాయి. కానీ త్రివేండ్రం రాజధాని ఎక్స్‌ప్రెస్ మాత్రం కోటా జంక్షన్ నుండి బయలుదేరితే, మళ్లీ 528 కిలోమీటర్ల దూరంలో ఉన్న వడోదర జంక్షన్‌లోనే ఆగుతుంది. ఈ రెండు పెద్ద జంక్షన్ల మధ్య ఉన్న పదుల సంఖ్యలోని చిన్న, పెద్ద రైల్వే స్టేషన్లను ఇది అసలు కనీసం పటించుకోకుండా ఈ రైలు దూసుకెళ్తోంది.

33
ఎందుకు ఇది అంత స్పెషల్?

భారతదేశంలోనే సుదీర్ఘ నాన్‌స్టాప్ రన్: భారతీయ రైల్వే వ్యవస్థ మొత్తం మీద రెండు కమర్షియల్ హాట్ల మధ్య అత్యంత ఎక్కువ దూరం నాన్‌స్టాప్‌గా ప్రయాణించే రైలు ఇదే కావడం విశేషం. మధ్యలో ఎక్కడా ఆగకపోవడం వల్ల.. ఈ రైలు దాదాపు 528 కిలోమీటర్ల ఈ భారీ దూరాన్ని ఎలాంటి ఆటంకం లేకుండా కేవలం 5 నుండి 6 గంటల్లోనే కవర్ చేస్తుంది. ఈ సుదీర్ఘ నాన్‌స్టాప్ సమయంలో ప్రయాణికులు ఎక్కడా డిస్టర్బెన్స్ లేకుండా గ్రేట్ వ్యూస్ చూస్తూ, నిరంతర ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు. ఎక్కువ దూరం ప్రయాణించాల్సి ఉన్నా.. రైలు వేగంగా వెళ్లడం వల్ల అలసిపోయిన ఫీలింగ్ రాదు. చాలా తక్కువ సమయంలోనే తమ డెస్టినేషన్ చేరుకుంటారు.

ట్రెయిన్ జర్నీలను, వేగాన్ని ఇష్టపడే వారికి త్రివేండ్రం రాజధానిలో కోటా-వడోదర మధ్య ప్రయాణించడం ఒక అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories