Summer Tips: ఎండాకాలంలో ఇంట్లో చల్లగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు!

Published : Mar 10, 2026, 05:03 PM IST

వేసవి వచ్చిందంటే ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. బయటి ఎండ తట్టుకోవడమే కష్టమైతే, కొన్ని ఇళ్ల లోపల కూడా వేడి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మధ్యాహ్నం టైంలో ఇంట్లో ఉండటం చాలా కష్టంగా అనిపిస్తుంది. కొన్ని సింపుల్ చిట్కాలతో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. 

PREV
16
వేసవిలో ఇంటిని చల్లగా ఉంచే చిట్కాలు

వేసవి కాలంలో బయట ఉండటమే కాదు.. ఇంట్లో ఉండటం కూడా కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే కొన్ని ఇళ్లల్లో మధ్యాహ్నం టైంలో ఆ స్థాయిలో వేడిగా అనిపిస్తుంది. ఏసీ లేదా కూలర్ ఉన్నవారికి కొంత ఉపశమనం లభించినా.. అవి లేనివారికి ఇబ్బంది తప్పదు. కానీ పైసా ఖర్చులేకుండా సహజ మార్గాల్లో ఇంటిని చల్లగా ఉంచే చిట్కాలు కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దాం.

26
కిటికీలు, తలుపులు..

వేసవిలో ఉదయం, సాయంత్రం సమయంలో ఇంటి కిటికీలు, తలుపులు కొంతసేపు తెరిచి ఉంచడం మంచిది. ఉదయం వేళల్లో గాలి సాధారణంగా చల్లగా ఉంటుంది. ఆ సమయంలో గాలి ఇంట్లోకి ప్రవేశించేలా కిటికీలు తెరిస్తే ఇంటి లోపల ఉండే వేడి కొంత వరకు బయటకు వెళ్తుంది. అదే విధంగా సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత కూడా కొంతసేపు గాలి వచ్చేలా తలుపులు తెరిచి ఉంచితే ఇంటి వాతావరణం కొంత చల్లబడుతుంది. మధ్యాహ్న సమయంలో మాత్రం బయట నుంచి వచ్చే వేడి గాలి ఇంట్లోకి రాకుండా కిటికీలు మూసి ఉంచడం మంచిది.

36
మొక్కల పెంపకం

మొక్కలు సహజంగా వాతావరణాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడతాయి. బాల్కనీ, కిటికీ దగ్గర లేదా ఇంటి ముందుభాగంలో చిన్న చిన్న మొక్కలను పెంచితే చుట్టూ గాలి కొంత తేమతో ఉండి చల్లగా అనిపిస్తుంది. ముఖ్యంగా తులసి, మనీ ప్లాంట్, అలొవెరా వంటి మొక్కలు ఇంటి వాతావరణాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. మొక్కలు కార్బన్ డై ఆక్సైడ్‌ను తీసుకొని ఆక్సిజన్ విడుదల చేయడం వల్ల ఇంట్లో గాలి నాణ్యత మెరుగవుతుంది.

46
మందపాటి కర్టెన్స్ వినియోగం

ఇంట్లోకి నేరుగా సూర్యరశ్మి రాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా కిటికీలకు మందపాటి కర్టెన్లు లేదా లైట్ కలర్ కర్టెన్లు ఉపయోగించడం ద్వారా ఇంటి లోపలికి వచ్చే వేడి కొంత వరకు తగ్గుతుంది. కొన్ని ఇళ్లలో కిటికీలకు బయటపక్కన గడ్డి, తాటి చాపలు లేదా బాంబూ కర్టెన్లు ఉపయోగిస్తారు. ఇవి కూడా బయట నుంచి వచ్చే వేడిని తగ్గించడంలో సహాయపడతాయి. అదేవిధంగా ఇంటి పైకప్పు మీద సూర్యరశ్మి ఎక్కువగా పడే ప్రాంతాల్లో తెలుపు రంగు పెయింట్ వేయడం వల్ల కూడా ఇంటి లోపల వేడి తగ్గుతుంది.

56
నీళ్లు చల్లడం..

పాతకాలంలో చాలామంది ఇంటి ముందుభాగంలో లేదా ఆవరణలో నీళ్లు చల్లి చల్లదనం పొందేవారు. ఈ పద్ధతి ఇప్పటికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంటి ముందు భాగంలో లేదా టెర్రస్‌పై నీరు చల్లడం వల్ల చుట్టూ ఉన్న వాతావరణం కొంత చల్లబడుతుంది. అలాగే కొన్ని ఇళ్లలో కిటికీలకు తడి బట్టలు లేదా తడి చాపలు వేలాడదీయడం ద్వారా కూడా గాలి చల్లగా మారుతుంది.

66
ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం

టెలివిజన్, కంప్యూటర్, లైట్లు, కిచెన్‌లోని కొన్ని పరికరాలు కూడా వేడిని ఉత్పత్తి చేస్తాయి. వీటిని ఎక్కువసేపు ఉపయోగిస్తే ఇంటి లోపల ఉష్ణోగ్రత కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అవసరం లేని సమయంలో లైట్లు లేదా ఇతర పరికరాలను ఆఫ్ చేయడం మంచిది. ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో వంట చేయాల్సి వస్తే గాలి సరిగ్గా వెళ్లేలా కిచెన్ కిటికీలు తెరిచి ఉంచడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories