Ugadi 2026: ఉగాది రోజు తప్పనిసరిగా చేయాల్సిన 7 శుభకార్యాలు

Published : Mar 10, 2026, 03:15 PM IST

Ugadi 2026: తెలుగు ప్రజల కొత్త సంవత్సరం ఉగాది. విశ్వావసు నామ సంవత్సరం నుంచి పరాభవ నామ సంవత్సరంలో అడుగుపెడుతున్నాం. మరి ఈ ఉగాది రోజు చేయాల్సిన 7 గొప్ప శుభకార్యాలేంటో తెలుసా? 

PREV
18
ఉగాది.. తెలుగు ప్రజల కొత్త ఏడాదికి ప్రారంభం

ఉగాది.. తెలుగు ప్రజల కొత్త ఏడాదికి ప్రారంభం. చైత్ర మాస శుద్ధ పాడ్యమి రోజున జరుపుకునే ఈ పండుగను ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ రోజున చేసే పనులు ఏడాది మొత్తం జీవితంపై ప్రభావం చూపిస్తుందని పెద్దలు, పండితులు చెప్తారు. అందుకే ఉగాది రోజు కొని శుభకార్యాలు చేయడం ఆచారంగా ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

28
తలస్నానం చేయడం

తెల్లవారుజామునే లేచి తలస్నానం చేయడం-ఇది చాలా ముఖ్యం. తలకు నూనె రాసుకుని తలస్నానం చేయడం తెలుగు వారు శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేస్తే శరీరం, మనసు పవిత్రంగా మారి కొత్త ఏడాదిని సంతోషంగా ప్రారంభించవచ్చని నమ్ముతారు.

38
ఇంటిని శుభ్రపరచి మామిడి తోరణాలు కట్టడం

ఉగాది రోజు ఇంటిని శుభ్రంగా ఉంచి తలుపుల దగ్గర మామిడి ఆకులతో తోరణాలు కడతారు. దీన్ని శుభసూచకంగా భావిస్తారు. మామిడి ఆకులు పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయని నమ్ముతారు. అంతేకాదు...తాజా మామిడి ఆకుల వల్ల ప్రెష్ ఆక్సిజన్ కూడా దొరుకుతుంది.

48
రంగవల్లులు వేయడం(ముగ్గులు పెట్టడం)

ఉగాది రోజు ఇంటి ముందు రంగవల్లులు వేయడం, ఇంట్లోనూ ముగ్గులు పెట్టడం పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయం. ఇది ఇంటికి శుభాన్ని, సంతోషాన్ని తీసుకువస్తుందని అంటారు. ఇంకా ఎవరి ఇంటి ముందైతే చక్కగా రంగవల్లులు ఉంటాయో...ఆ ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుందని, లక్ష్మీదేవి నడుచుకుంటూ వస్తుందని నమ్ముతారు.

58
షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడం

షడ్రుచుల సమ్మేళనం అయిన ఉగాది పచ్చడం తినడం-ఉగాది పండుగల్లో అన్నింటికన్నా ముఖ్యమైనది ఉగాది పచ్చడి. దీనిలో పులుపు, తీపి, చేదు, మామిడి, కారం, ఉప్పు వంటి ఆరు రుచులు ఉంటాయి. జీవితం కూడా ఇలా ఆనందం, బాధ, కోపం, ఆశ్చర్యం, భయం, తీపి వంటి అనుభవాలతో నిండి ఉండి హాయిగా సాగుతుందని విశ్వసిస్తారు.

68
భగవంతుడిని ప్రార్థించడం

ఉగాది రోజు తెల్లవారుజామునే లేచి స్నానం చేసి ఇంట్లో పూజలు చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఆ భగవంతుడిని ప్రార్థించి కొత్త ఏడాదిలో అష్టైశ్వార్యాలు, ఆరోగ్యం, శాంతి కలగాలని కోరుకుంటారు.

78
పంచాంగ శ్రవణం

మరో ముఖ్యమైన ఎపిసోడ్ పంచాంగ శ్రవణం-ఉగాది రోజున పండితులు చెప్పే పంచాంగ శ్రవణం వినడం సంప్రదాయం. ఇందులో గ్రహస్థితులు, రాశి ఫలాలు, వర్షాలు, పంటల పరిస్థితి వంటి విషయాలు క్షుణ్ణంగా చెబుతారు. అందుకే పంచాంగ శ్రవణానికి ఎంతో ప్రాముఖ్యత.

88
ఇక చివరి అంకం పెద్దవాళ్ల నుంచి ఆశీర్వాదం తీసుకోవడం

ఉగాది రోజున ఉగాది పచ్చడి తినేసి కుటుంబంలోని పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం మంచిది. వారి ఆశీర్వాదంతో కొత్త ఏడాది మొదలుపెడితే మంచి ఫలితాలు ఉంటాయని నమ్ముతారు.

ఉగాది పండుగ కేవలం కొత్త ఏడాదికి ప్రారంభం మాత్రమే కాదు...జీవితం ఎలా ఉన్నా ఆనందంగా స్వీకరించాలనే సందేశాన్ని ఇస్తుంది. మంచి ఆలోచనలు, మంచి పనులను ఏడాదిని ప్రారంభిస్తే జీవితంలో విజయాలు సాధించవచ్చని పెద్దలు చెబుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories