Foreign Origin Foods: అన్నీ మనవి కావు...మనవనుకుని భ్రమ పడుతున్న 5 ఇండియన్ ఫుడ్స్

Published : Nov 21, 2026, 07:42 PM IST

Foreign Foods: మన వంటలుగా భావించే ఫేమస్ ఫుడ్స్ నిజానికి విదేశాల నుంచి వచ్చినవే. వ్యాపారం, వలసల ద్వారా భారత్‌కు చేరిన ఈ వంటలు..మన మసాలాలు, మన అభిరుచికి తగ్గట్టుగా మారిపోయాయి. అలా విదేశాల నుంచి వచ్చి ప్రత్యేక స్థానం సంపాదించుకున్న 5 పాపులర్ ఫుడ్స్.

PREV
15
సమోసా

సాయంత్రం టీతో పాటు సమోసా లేకపోతే చాలామందికి కాలం గడవదు. కానీ, ఈ త్రిభుజాకారపు స్నాక్ సెంట్రల్ ఆసియా, మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి వచ్చింది. మొదట్లో అక్కడ మాంసంతో చేసే ఈ వంటకం, ఇండియాకి వచ్చాక ఆలుగడ్డ మసాలాతో మన టేస్ట్‌కి తగ్గట్టు మారిపోయింది.

25
జిలేబి

పెళ్లి భోజనాలు, పండుగ సమయాల్లో జిలేబికి ఎప్పుడూ స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ఈ స్వీట్ వెస్ట్ ఆసియా ప్రాంతాల్లో పుట్టింది. అక్కడ 'జలాబియా' అని పిలిచే ఈ స్వీట్, ఇండియాకి వచ్చాక పులిసిన పిండిని నూనెలో వేయించి చక్కెర పాకంలో నానబెట్టే మన లోకల్ స్టైల్‌గా మారిపోయింది.

35
బిర్యానీ

ఇండియా ఐడెంటిటీగా చూసే బిర్యానీ, పర్షియన్, సెంట్రల్ ఆసియా వంటకాల స్టైల్ నుంచి వచ్చింది. 'బిరియన్' అనే పర్షియన్ పదం నుంచి దీనికి ఈ పేరు వచ్చింది. ఇండియాకి వచ్చాక హైదరాబాద్, కోల్‌కతా లాంటి ప్రతి ఊరికి తగ్గట్టు లోకల్ మసాలాలు కలుపుతూ ఎన్నో రకాలుగా పాపులర్ అయింది.

45
నాన్

గ్రేవీ, మసాలా కూరలకు బెస్ట్ కాంబినేషన్ అయిన 'నాన్.., పర్షియన్, సెంట్రల్ ఆసియా దేశాల నుంచి పరిచయమైన ఒక రకమైన రొట్టె. అక్కడ తయారు చేసే ఫ్లాట్ బ్రెడ్ రకాలు ఇండియాకి వచ్చాక తందూరీ పొయ్యిల్లో కాల్చి, నేడు బటర్ నాన్, గార్లిక్ నాన్ లాంటి ఎన్నో ఫ్లేవర్లలో హోటల్స్‌లో అదరగొడుతున్నాయి.

55
గులాబ్ జామున్

ఏ సెలబ్రేషన్‌నైనా కంప్లీట్ చేసే గులాబ్ జామున్, మిడిల్ ఈస్ట్, పర్షియన్ స్వీట్స్ ప్రభావంతో తయారైంది. అక్కడ పాపులర్ అయిన పిండి ముద్ద స్వీట్స్ లాగానే, ఇండియాలో కోవాతో చేసి, నూనెలో వేయించి సువాసన వచ్చే చక్కెర పాకంలో నానబెట్టి మనకంటూ ఒక స్పెషల్ స్వీట్‌గా మార్చేశారు.

Read more Photos on
click me!

Recommended Stories