3. దుంపలను నాటే సరైన సమయం, పద్ధతి
కుంకుమపువ్వు దుంపలను నాటడానికి ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్య సమయం అత్యంత అనుకూలం. కుండీలోని మట్టిలో సుమారు 4 అంగుళాల లోతులో చిన్న గుంతలు చేయాలి. ఒక్కో దుంపను దాని మొన భాగం పైకి ఉండేలా నాటాలి. దుంపల మధ్య కనీసం 4 అంగుళాల దూరం ఉండేలా చూసుకుని, పైన మట్టితో కప్పి కొద్దిగా నీరు చల్లాలి. ప్రతిరోజూ నీళ్లు పోయాల్సిన అవసరం లేదు; ఆకులు వచ్చే వరకు వేచి చూడాలి.
4. ఎండ, నీరు ఎంత అవసరం?
కుంకుమపువ్వు మొక్కలకు ఎండ బాగా తగలాలి. కాబట్టి కుండీని ఎండ బాగా పడే చోట ఉంచాలి. ఆకులు పెరగడం మొదలయ్యాక, మట్టి పైభాగం పొడిగా అనిపిస్తేనే కొద్దిగా నీరు పోయాలి. మట్టి ఎప్పుడూ తడిగా ఉంటే దుంపలు పాడైపోతాయి. పువ్వులు పూయడం పూర్తయ్యాక ఆకులు వాటంతట అవే పసుపు రంగులోకి మారి ఎండిపోనివ్వాలి. వేసవిలో మొక్క విశ్రాంతి దశలో ఉంటుంది కాబట్టి ఆ సమయంలో మట్టిని పొడిగానే ఉంచాలి.
5. కుంకుమపువ్వును ఎప్పుడు, ఎలా సేకరించాలి?
సాధారణంగా అక్టోబర్, నవంబర్ నెలల్లో కుంకుమపువ్వు పూలు వికసిస్తాయి. పువ్వు విచ్చుకోగానే దాని మధ్యలో ఉండే మూడు ఎర్రటి రేకులు కనిపిస్తాయి. ఇవే మనం వంటల్లో వాడే అసలైన కుంకుమపువ్వు. ఆ ఎర్రటి రేకులను జాగ్రత్తగా బయటకు తీసి ఒక కాగితంపై ఉంచి 2 నుంచి 3 రోజులపాటు ఆరబెట్టాలి. పూర్తిగా ఆరిన తర్వాత వాటిని ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది.