నిర్ణయం తీసుకోవడానికి అతిగా ఆలోచించడం
మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలంటే ఎక్కువగా ఆలోచిస్తున్నారా? ఇది తీసుకుంటే ఏమవుతుందో? అది తీసుకుంటే ఏం జరుగుతుందో అంటూ అనుమానించడం వల్ల మానసిక ఒత్తిడి తప్ప ఫలితం ఉండదు. దీని వల్ల మీరు నిర్ణయం కూడా చాలా ఆలస్యంగా తీసుకుంటారు. దీని వల్ల పనులు ఫెయిల్ కూడా కావచ్చు. అతిగా ఆలోచించడం, అనుమానించడం ఒత్తిడిని సృష్టిస్తాయి. మనల్ని నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉంచుతాయి. ఏ విషయంపై నిర్ణయం తీసుకోవాలన్నా వేగంగా ఆలోచించి లేట్ చేయకుండా నిర్ణయాలు తీసుకోవడం మంచిది.