Ravana: రావణుడిలోని ఈ మంచి గుణాలు మీకు తెలుసా?

మంచి, చెడులకు ఉదాహారణ చెప్పాలంటే ముందుగా గుర్తొచ్చేవి రాముడు, రావణుడి పేర్లు. ఉత్తమ పురుషుడిగా రాముడికి ఎంత మంచి పేరుందో... దుర్గుణాలు, దురహంకారిగా రావణుడికి అంత చెడ్డ పేరు ఉంది. కానీ రావణుడిలోనూ ఒక వ్యక్తి విజయానికి ఉపయోగపడే కొన్ని మంచి గుణాలు ఉన్నాయట. అవెంటో ఓసారి తెలుసుకుందామా?

Good Qualities of Ravana You Should Know in telugu KVG

లంకాధిపతి రావణాసురుడి గురించి తెలియని వారుండరు. రావణుడు ఎన్నో తప్పులు చేశాడు. వాటికి ఫలితం కూడా అనుభవించాడు. కానీ పురణాల ప్రకారం రావణుడిలోనూ కొన్ని మంచి గుణాలు ఉన్నాయట. అవెంటో ఇక్కడ తెలుసుకుందాం.

Good Qualities of Ravana You Should Know in telugu KVG
గొప్ప పండితుడు

రావణుడు బ్రహ్మణ వంశంలో జన్మించాడు. పురాణాల ప్రకారం రావణుడు అనేక శాస్త్రాల్లో గొప్ప పండితుడు. వేదాలు, జ్యోతిష్యం మొదలైనవాటిలో రావణుడు ఆరితేరినవాడిగా పేరుపొందాడు.


వరాలు పొందాడు..

పురాణాల ప్రకారం.. రావణుడు గొప్ప భక్తుడు. బ్రహ్మదేవుడిని తపస్సు చేసి.. కొన్ని అద్భుతమైన వరాలు పొందాడట. ఈ వరాలు రావణుడిని శక్తివంతుడిగా చేశాయని చెబుతుంటారు.

గొప్ప సేనాని

రావణుడు ధర్మం, నీతిని గౌరవించేవాడట. అంతేకాదు ఆయన గొప్ప సేనాని. రావణుడు అపారమైన సైన్యంతో లంకా రాజ్యాన్ని రక్షించాడని పురాణాలు చెబుతున్నాయి.

మంచి పాలకుడు

పురాణాల ప్రకారం లంకాధిపతి రావణుడు తన రాజ్యంలోని ప్రజలకు ఎలాంటి లోటు రాకుండా చూసుకోవడానికి ప్రయత్నించాడు. తన రాజ్యాన్ని అభివృద్ధి చేశాడు. తన ప్రజలకు ఆయన గొప్ప పాలకుడు.

Latest Videos

vuukle one pixel image
click me!