Bananas: అరటిపండ్లు కొనేటప్పుడు చాలామంది చేసే 5 తప్పులు ఇవే.. మీరు కూడా చేస్తున్నారా?

Published : Sep 01, 2026, 02:48 PM IST

Bananas: చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఇష్టంగా తినే పండు అరటి. చాలామంది మార్కెట్‌కు వెళ్లగానే పెద్దగా ఆలోచించకుండా పసుపు రంగులో ఉన్న అరటిపండ్లను కొనేస్తుంటారు. కానీ అరటిపండు కొనేటప్పుడు కొన్ని విషయాలను కచ్చితంగా గమనించాలి. అవేంటో తెలుసుకుందాం.

PREV
16
అరటి పండు కొనేటప్పుడు చేయకూడని తప్పులు

అరటి పండు రుచిగా ఉండటంతో పాటు తక్కువ ధరకు వస్తుంది. ఈజీగా దొరుకుతుంది కాబట్టి చాలామంది అరటిపండ్లను ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అయితే అరటిపండ్లు కొనేటప్పుడు కనిపించిన వెంటనే పసుపురంగు గుత్తిని తీసుకోవడం కంటే కొన్ని విషయాలను గమనించడం మంచిది. చాలామంది తెలియక చేసే కొన్ని చిన్న తప్పుల వల్ల ఇంటికి తెచ్చిన అరటిపండ్లు త్వరగా పండిపోవడం, మెత్తబడటం లేదా ఎక్కువ రోజులు నిల్వ ఉండకపోవడం జరుగుతుంది. అందుకే అరటిపండ్లు కొనేటప్పుడు చేయకూడని తప్పులేంటో చూద్దాం.

26
పూర్తిగా పసుపు రంగులోనే ఉండాలనుకోవడం

చాలామంది అరటి పండ్లు కొద్దిగా పచ్చగా ఉన్నా.. అవి పండలేదని భావించి పక్కన పెట్టేస్తారు. కానీ మీరు వెంటనే తినడానికి కాకుండా కొన్ని రోజులు ఇంట్లో ఉంచుకోవడానికి అరటిపండ్లు కొనుగోలు చేస్తుంటే, కొద్దిగా పచ్చగా ఉన్నవి ఎంచుకోవడం మంచిది. పూర్తిగా పసుపు రంగులోకి మారిన అరటిపండ్లు ఇప్పటికే బాగా పండిన దశలో ఉంటాయి. కాబట్టి త్వరగా మెత్తబడే అవకాశం ఉంటుంది.

36
నల్ల మచ్చను చూసి పండు చెడిపోయిందనుకోవడం

పండిన అరటిపండ్ల తొక్కపై చిన్న చిన్న నల్ల మచ్చలు కనిపించడం సాధారణమే. అయితే మచ్చలు విస్తృతంగా ఉండటం, తొక్క పగిలిపోవడం, అరటిపండు నుంచి అసహజమైన వాసన రావడం లేదా లోపల భాగం అసాధారణంగా మారినట్లు కనిపించడం వంటి లక్షణాలు ఉంటే దాన్ని కొనకపోవడం మంచిది. కానీ కేవలం ఒకటి రెండు చిన్న మచ్చలు ఉన్నాయని చాలామంది మంచి అరటిపండును పక్కనపెట్టేస్తుంటారు.

46
పరిమాణాన్ని చూసి నాణ్యతను నిర్ణయించడం

పెద్దగా, ఆకర్షణీయంగా కనిపించే అరటిపండే మంచిదని చాలామంది అనుకుంటారు. కానీ పరిమాణం ఒక్కటే నాణ్యతకు ప్రమాణం కాదు. అరటిపండు తాజాగా ఉందా, తొక్క బలంగా ఉందా, ఎక్కడైనా పగుళ్లు ఉన్నాయా, పండు ఎలా ఉంది అనే విషయాలను కూడా గమనించాలి. చిన్న పరిమాణంలో ఉన్న అరటిపండ్లు కూడా మంచి నాణ్యతతో ఉండవచ్చు.

56
మెత్తగా ఉన్న అరటిపండ్లను కొనడం

వెంటనే తినాలనుకునేవారు పూర్తిగా మెత్తగా ఉన్న పండ్లను ఎంచుకోవచ్చు. కానీ వాటిని ఇంట్లో కొన్ని రోజులు ఉంచుకోవాలనుకుంటే మాత్రం ఇది సరైన ఎంపికకాదు. అరటిపండు ఇప్పటికే ఎక్కువగా మెత్తబడి ఉంటే త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లో ఎక్కువ మంది లేకపోతే ఒకేసారి ఎక్కువగా పండిన అరటిపండ్లను కొనడం వల్ల అవి వృథా కావచ్చు. కాబట్టి కుటుంబ అవసరానికి అనుగుణంగా అరటి పండ్లను ఎంచుకోవడం మంచిది.

66
ఎలా నిల్వ చేయాలో పట్టించుకోకపోవడం

మార్కెట్ నుంచి తెచ్చిన అరటిపండ్లను ఇతర పండ్లతో కలిపి కుప్పగా పెట్టడం వల్ల అవి త్వరగా మెత్తబడవచ్చు. ముఖ్యంగా పండిన అరటి పండ్లను వేడి ఎక్కువగా ఉండే ప్రదేశంలో ఉంచితే వేగంగా పక్వానికి రావచ్చు. కాబట్టి ఇంటికి తెచ్చిన తర్వాత వాటిని గాలి ప్రసరణ ఉండే, ఎక్కువ వేడి లేని ప్రదేశంలో ఉంచడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories