Washing Machine:వాషింగ్ మెషిన్‌లో ఐస్ క్యూబ్స్ వేస్తే.. బట్టలు ముడతలు పడవా?

Published : Sep 01, 2026, 01:25 PM IST

Washing Machine: వాషింగ్ మెషిన్ లో ఉతికిన బట్టలకు ముడతలు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. వాటిని కచ్చితంగా మళ్లీ ఐరన్ చేయించాలి. కానీ, చిన్న ట్రిక్ ఫాలో అయితే... ఐరన్ అవసరమే రాదు.. ముడతలు కూడా ఉండవు.

PREV
13
వాషింగ్ మెషిన్ లో బట్టలు ఉతుకుతున్నారా?

ఇప్పుడున్న బిజీ లైఫ్ స్టైల్ లో.. చాలా మందికి టైమ్ కి భోజనం చేసే సమయమే ఉండటం లేదు. ఇలాంటి సమయంలో.. వీకెండ్స్ లో.. వాషింగ్ మెషిన్ లో బట్టలు ఉతకడమే పెద్ద పని అనుకుంటుంటే.. మళ్లీ.. వాటికి ఐరన్ చేయడం మరో పెద్ద పని. వాషింగ్ మెషిన్ డ్రయ్యర్ చాలా స్పీడ్ గా పనిచేస్తుంది. దీని వల్ల.. బట్టలకు ఎక్కువగా ముడతలు పడిపోతూ ఉంటాయి. అయితే.. ఒకే ఒక్క సింపుల్ ట్రిక్ తో ముడతలు పడటం కాదు కదా.. ఐరన్ అవసరమే రాదు. ఆ ట్రిక్ ఏంటి..? ఎలా పని చేస్తుందో ఇప్పుడు చూద్దాం...

23
ఐస్ క్యూబ్స్ ట్రిక్..

మీరు మీ బట్టలకు ముడతలు పడకూడదు అనుకుంటే.. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. మీ డ్రయ్యర్ లో కొన్ని ఐస్ క్యూబ్స్ వేస్తే సరిపోతుంది. ఉతికిన లేదా పొడి బట్టలతో పాటు 2 నుండి 3 ఐస్ క్యూబ్స్‌ను వాషింగ్ మెషిన్ డ్రైయర్ లో వేయాలి. వాషింగ్ మెషిన్ పనిచేస్తున్నప్పుడు ఎక్కువ టెంపరేచర్ రిలీజ్ అవుతుంది. ఆ వేడికి ఐస్ క్యూబ్స్ త్వరగా కరిగి నీరుగా, ఆపై ఆవిరిగా మారతాయి. డ్రైయర్ లోపల తిరిగేటప్పుడు ఉత్పత్తయ్యే ఈ వేడి దుస్తుల మీద ముడతలు పడకుండా ఆపుతుంది. ఇది ఇంట్లో స్టీమ్ ఐరన్ ఎలా పనిచేస్తుందో సరిగ్గా అలాగే పనిచేసి, బట్టలు బైటికి వచ్చేసరికి ముడతలు లేకుండా ప్లాట్‌గా, నీట్‌గా మారేలా చేస్తుంది.

33
ఈ చిట్కాను పాటించే సరైన పద్ధతి:

ఈ ట్రిక్ బాగా పనిచేయాలంటే డ్రైయర్‌లో కేవలం 2 నుండి 3 దుస్తులు మాత్రమే వేయాలి (ఉదాహరణకు: 2 షర్టులు లేదా ఒక ప్యాంట్, షర్ట్). డ్రైయర్ నిండా బట్టలు వేస్తే ఆవిరి సరిగ్గా వ్యాపించక ముడతలు పోవు. బట్టల పరిమాణాన్ని బట్టి కనీసం ఐదు లేదా ఆరు ఐస్ క్యూబ్స్ వేయాలి. మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఇవి సరిపోతాయి. డ్రైయర్ ఆగిపోగానే బట్టలను వెంటనే బయటకు తీసి హ్యాంగర్‌కు తగిలించాలి. డ్రైయర్‌లోనే వదిలేస్తే మళ్లీ ముడతలు పడే అవకాశం ఉంటుంది.

ఈ హాక్ వల్ల ప్రయోజనాలు:

అత్యవసరంగా బయటకు వెళ్లేటప్పుడు బట్టలు ఐరన్ చేయడానికి సమయం లేనప్పుడు ఈ చిట్కా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఐరన్ బాక్స్ వాడే అవసరం తగ్గడం వల్ల శ్రమ కూడా తగ్గుతుంది. ముఖ్యంగా, కాటన్ షర్టులు, బ్లౌజులు, లేదా తేలికపాటి డ్రెస్‌లపై ఉన్న ముడతలను తొలగించడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది.

ముఖ్యమైన జాగ్రత్తలు..

మందపాటి జీన్స్ ప్యాంట్లు, సూట్లు లేదా హెవీ ఫ్యాబ్రిక్ దుస్తులపై ఈ ట్రిక్ అంత ప్రభావవంతంగా పనిచేయదు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఎక్కువ ఐస్ క్యూబ్స్ వేస్తే డ్రైయర్ లోపల నీరు ఎక్కువై బట్టలు తడిసిపోతాయి తప్ప ముడతలు పోవు.

Read more Photos on
click me!

Recommended Stories