డబ్బులు వృథా కావొద్దంటే ఈ 5 చిట్కాలు కచ్చితంగా ఫాలో కావాల్సిందే!

Published : Nov 10, 2025, 02:41 PM IST

మనం ఎంత సంపాదించినా.. దాన్ని సరైన పద్ధతిలో వినియోగించకపోతే.. దానికి విలువ ఉండదు. కొన్నిసార్లు మనం చేసే చిన్న చిన్న తప్పులే డబ్బు వృథా అయ్యేలా చేస్తాయి. మరి వృథా కావొద్దంటే తప్పక పాటించాల్సిన 5 ముఖ్యమైన చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. ఓసారి ట్రై చేయండి.

PREV
16
Money Saving Tips

ప్రతి ఒక్కరు డబ్బు విలువను అర్థం చేసుకోవడం చాలా అవసరం. మనలో చాలామంది డబ్బు సంపాదిస్తారు. కానీ కొందరే దాన్ని సరిగ్గా వినియోగించుకుంటారు. కొన్ని సార్లు మనం అజాగ్రత్తగా తీసుకునే చిన్న నిర్ణయాలు కూడా మన ఆర్థిక పరిస్థితిపై పెద్ద ప్రభావం చూపుతాయి. కొంచెం జాగ్రత్త, కొంత ఆలోచన, కొద్దిగా నియంత్రణ ఉంటే మన డబ్బులు వృథా కాకుండా చూసుకోవచ్చు. డబ్బు వృథా కావొద్దంటే కచ్చితంగా పాటించాల్సిన ముఖ్యమైన చిట్కాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. 

26
అవసరం, కోరిక మధ్య తేడా తెలుసుకోవాలి

మన రోజువారీ జీవితంలో మనకు నిజంగా అవసరమైనవి ఒకవైపు ఉంటే, మనం కోరికతో కొనాలనుకునే వస్తువులు మరోవైపు ఉంటాయి. ఉదాహరణకు మొబైల్ ఫోన్ మనకు అవసరం కానీ, ప్రతి సంవత్సరం కొత్త మోడల్ కొనడం కోరిక. ఈ రెండింటి మధ్య తేడాను అర్థం చేసుకుంటే చాలా డబ్బు ఆదా అవుతుంది. ఏదైనా వస్తువు కొనుగోలు చేసే ముందు ఒకసారి ఆలోచించండి. వీలైతే రెండు రోజులు ఆగండి. అప్పటికీ ఆ వస్తువు కొనాలి అనిపిస్తే.. అప్పుడు మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి.  

36
బడ్జెట్ తయారు చేసుకోవాలి

ప్రతి నెలా వచ్చే ఆదాయం, ఖర్చులను రాయడం, వాటిని కేటగిరీలుగా విభజించడం చిన్న పనే అయినా పెద్ద ఫలితాలు ఇస్తుంది. వారం వారం లేదా నెల నెలా మీ ఖర్చులు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయో చూసి, వచ్చే నెలలో దాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి. బడ్జెట్ తయారీ అంటే ఖర్చుపై నియంత్రణ. ఒకసారి ఈ అలవాటు చేసుకుంటే.. అనవసర ఖర్చులు కచ్చితంగా తగ్గుతాయి. 

46
ఆకస్మికంగా షాపింగ్ చేయవద్దు:

మనలో చాలా మంది చేసే ఒక సాధారణ తప్పు ఆకస్మికంగా షాపింగ్ చేయడం. అంటే ఆన్‌లైన్ ఆఫర్లు, తగ్గింపులు చూసి వెంటనే కొనేసి తర్వాత బాధ పడుతుంటారు. షాపింగ్ చేసే ముందు ఒక లిస్టు తయారు చేసుకోవాలి. ఆ లిస్టులో లేని వస్తువులు అస్సలు కొనకూడదు. షాపింగ్‌కి వెళ్లినప్పుడు అవసరాలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలి. ఏం కొన్నా సరే వీలైనంత వరకు డిజిటల్ పేమెంట్ చేయవద్దు. క్యాష్ ఇవ్వాలి. మన చేతుల నుంచి క్యాష్ ఇచ్చినప్పుడే ఎన్ని డబ్బులు ఖర్చు అవుతున్నాయో.. వాటికోసం మనం ఎంత కష్టపడాల్సి వచ్చిందో గుర్తుకువస్తుంది. దానివల్ల కూడా డబ్బు వృథా చేయడానికి మనసు అంగీకరించదు.

56
పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలి

డబ్బు వృథా కాకుండా ఉండటానికి ఉత్తమ మార్గం పొదుపు చేయడం. ప్రతి నెల మీ ఆదాయంలో కనీసం 10 నుంచి 20 శాతం మొత్తాన్ని పొదుపు చేయాలి. లేదా ఏదో ఒక చోట భద్రంగా పెట్టుబడి పెట్టాలి. దానివల్ల చిన్న మొత్తం కూడా టైంతోపాటు పెద్ద మొత్తంగా మారుతుంది. పొదుపు చేయడమంటే భవిష్యత్తుకు భరోసా ఇవ్వడమే.

66
క్రెడిట్ కార్డును జాగ్రత్తగా వాడాలి

చాలామంది క్రెడిట్ కార్డు వాడుతుంటారు. కానీ నియంత్రణ లేకుండా వాడితే అప్పుల బారిన పడే ప్రమాదం ఉంటుంది. వడ్డీలు, లేట్ ఫీజులు వంటివి మన డబ్బును నెమ్మదిగా వృథా చేస్తాయి. నిజంగా అవసరమైన సందర్భంలో మాత్రమే అప్పు తీసుకోవాలి. క్రెడిట్ కార్డు బిల్లులు సమయానికి చెల్లించాలి. తద్వారా డబ్బు వృథాను అరికట్టవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories