Kitchen Tips: బంగాళాదుంపలు లేదా గుడ్లు ఉడికించేటప్పుడు ఆ నీటిలో నిమ్మచెక్క వేసి చూడండి

Published : Nov 10, 2025, 01:04 PM IST

Kitchen Tips: వంటగదిలో చేసే చిన్న చిన్న పనులు ఎక్కువ లాభాలను ఇస్తాయి. అలాగే గుడ్లు, ఆలూ ఉడికించేటప్పుడు అందులో నిమ్మచెక్క వేస్తే ఎన్నో ప్రయోజనాలు కలుగతాయి. 

PREV
15
నిమ్మ ముక్కతో మ్యాజిక్

వంటగదిలో పాటించే చిన్ చిన్న చిట్కాలు ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. అలాంటి ఒక ఆసక్తికరమైన చిట్కా .. గుడ్లు లేదా బంగాళాదుంపలు ఉడికించే సమయంలో నీటిలో ఒక నిమ్మ ముక్క వేయడం. ఈ చిట్కా వెనుక ఉన్న శాస్త్రీయ కారణం,కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. నిమ్మలో సిట్రిక్ ఆమ్లం ఎక్కువగా ఉంటుంది. ఇది సహజంగానే శుభ్రపరిచే లక్షణాన్ని కలిగి ఉంటుంది. నీటిలోని కఠినమైన ఖనిజాలను కరిగించే గుణం దీనికి ఉంటుంది. మీరు గుడ్లు లేదా బంగాళాదుంపలు ఉడికిస్తున్నప్పుడు నీటిలో ఉన్న కాల్షియం, మాగ్నీషియం లాంటి ఖనిజాలు వాటి మీద తెల్లటి పొరలా పేరుకుపోతాయి. అందులో నిమ్మ ముక్క వేసినప్పుడు ఆ ఖనిజాలు కరిగిపోతాయి. వంట పదార్థాలు సహజ రంగు, రుచి కోల్పోకుండా ఉడుకుతాయి.

25
గుడ్లు ఉడికించేటప్పుడు

గుడ్లు ఉడికించే సమయంలో షెల్ చాలా కఠినంగా మారి తీయడానికి కష్టం అవుతుంది. నిమ్మలోని ఆమ్లత నీటిలో కలిసినప్పుడు, షెల్ కింద ఉన్న పొరను కొద్దిగా బలహీనపరుస్తుంది. ఫలితంగా గుడ్లు చల్లారిన తరువాత పొట్టు సులభంగా విడిపోతుంది. అలాగే, గుడ్డు విరగకుండా సమానంగా ఉడికేందుకు కూడా ఇది సహకరిస్తుంది.

35
బంగాళాదుంపలు ఉడికించేటప్పుడు

బంగాళాదుంపలు ఉడికించేటప్పుడు నీటిలో నిమ్మ ముక్క వేయడం వల్ల అవి పగలకుండా, తేలికగా ఉడుకుతాయి. ముఖ్యంగా పాత బంగాళాదుంపలు ఉడికించేటప్పుడు అవి మెత్తగా అయి విరిగిపోయే ప్రమాదం తక్కువగా ఉంటుంది. నిమ్మలోని ఆమ్లం వాటి పైపొరను గట్టిగా ఉంచి ఆకారం చెదరకుండా చేస్తుంది.

45
ఇంకెన్నో ప్రయోజనాలు

గుడ్లు ఉడికించేటప్పుడు వచ్చే సల్ఫర్ వాసనను నిమ్మ తక్కువ చేస్తుంది. నిమ్మలోని సిట్రిక్ ఆమ్లం నీటిలోని కఠినమైన మూలకాలను సాఫ్ట్ చేస్తుంది. నిమ్మముక్క చేర్చిన నీరు పాత్రల్లో పొరలు, మరకలు ఏర్పడకుండా కాపాడుతుంది. కొద్దిగా నిమ్మ సువాసన వలన ఆహార పదార్థాలకు తాజా వాసన వస్తుంది.

55
వెనిగర్ కూడా

గుడ్లు, బంగాళాదుంపలు ఉడికించేటప్పుడు ఒకటి లేదా రెండు చిన్న నిమ్మ ముక్కలు వేస్తే చాలు. ఎక్కువ వేస్తే ఆమ్లత ఎక్కువై రుచి మారే అవకాశం ఉంది. గుడ్లు లేదా బంగాళాదుంపలు ఉడికిన వెంటనే చల్లటి నీటిలో వేయడం వలన అవి మరింత మృదువుగా అవుతాయి. నిమ్మ బదులు వెనిగర్ కూడా ఉపయోగించవచ్చు కానీ నిమ్మ సువాసన వలన వంట మరింత సహజంగా ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories