ఇమ్యూనిటీ పెంచే సూపర్ పానీయాలు.. రోజూ ఉదయాన్నే తాగితే...

First Published Apr 20, 2021, 11:51 AM IST

ఇమ్యూనిటీ.. ఇప్పుడున్న కరోనా ప్రళయంలో మనల్ని కాపాడే ఒకే ఒక సంజీవని. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో డబుల్ మ్యుటేషన్ లతో వైరస్ తీవ్రరూపం దాలుస్తోంది. ఈ పరిస్థితుల్లో రోగనిరోధక శక్తి మీద ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన పరిస్థితి. 

ఇమ్యూనిటీ.. ఇప్పుడున్న కరోనా ప్రళయంలో మనల్ని కాపాడే ఒకే ఒక సంజీవని. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో డబుల్ మ్యుటేషన్ లతో వైరస్ తీవ్రరూపం దాలుస్తోంది. ఈ పరిస్థితుల్లో రోగనిరోధక శక్తి మీద ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన పరిస్థితి.
undefined
బలమైన రోగనిరోధక వ్యవస్థ మీ శరీరాన్ని వ్యాధికారక క్రిములు, వైరస్ లతో పోరాడటానికి సిద్ధం చేస్తుంది. వైరస్,బ్యాక్టీరియా సంక్రమణకు అడ్డుకట్టవేస్తుంది. ఇమ్యూనిటీ అనేది ఒక్క రాత్రిలో వచ్చే విషయం కాదు.. దానికి నిరంతరం ఆరోగ్యకరమైన అలవాట్లు ఉండాలి.
undefined
రోజూ ఉదయమే పరగడుపున కొన్న ఆయుర్వేద సమ్మేళితమైన పానీయాలు తాగడం వల్ల రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. అలాంటి పానీయాల వివరాల మీకోసం..
undefined
అల్లం, పసుపు పానీయం..కావలసిన పదార్థాలు :1 కప్పు నీరు¼ స్పూను తురిమిన అల్లం¼ స్పూన్ పసుపు కొమ్ము1 స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్1 స్పూన్ తేనె
undefined
తయారు చేసే విధానం...ఒక లోతైన బాణలిలో నీరు, అల్లం, పసుపు వేసి 5-10 నిమిషాల పాటు మరిగించాలి. నీరు మరగడం ప్రారంభించిన తర్వాత, పొయ్యిని ఆపివేసి, ఈ నీటిని చల్లారనివ్వండి. ఆ తరువాత ఈ పానీయాన్ని ఒక కప్పులో వడకట్టి దానికి తేనె, ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి తాగండి.
undefined
ఇది ఎలా పనిచేస్తుంది..ఈ పానీయంలో రోగనిరోధక శక్తిని పెంచే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఆపిల్ సైడర్ వెనిగర్ (ఎసివి) శరీరంలో చెడు వ్యాధికారక కారకాల పెరుగుదలను నిషేధిస్తుంది. ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, ఈ రెండింటివల్ల రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. ఇక పసుపు, అల్లం వేర్లు రెండూ యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, క్రిమినాశక లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో పసుపు నేచురల్ మెడిసిన్, అల్లం తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచుతుంది, ఇవి బైటినుంచి వచ్చే వ్యాధికారక కణాలను నాశనం చేయడానికి సహాయపడుతాయి.
undefined
ఓమ, తులసి పానీయం..కావలసిన పదార్థాలు :12 స్పూన్ వాము5 తులసి ఆకులు12 స్పూన్ నల్ల మిరియాలు పొడి1 స్పూన్ తేనె
undefined
తయారు చేసే విధానం...ఒక పాన్ తీసుకొని 1 గ్లాసు నీరు, వాము, నల్ల మిరియాలు, తులసి ఆకులను వేయండి. ఈ నీటిని 5 నిమిషాలు మరిగించండి. ఆ తరువాత స్టౌ ఆపేసి ఈ మిశ్రమాన్ని ఒక కప్పులో వడకట్టండి. కాస్త చల్లారాక, దీనికి తేనె కలిపి తాగండి.
undefined
ఇది ఎలా పనిచేస్తుంది..వాములో అనేక శక్తివంతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే దీన్ని చాలాకాలంగా అనేక వ్యాధుల చికిత్సలో వాడుతున్నారు. వీటిలో ఉంటే యాంటీ ఇనఫ్లమేటరీ లక్షణాలు, రోగ నిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడుతుంది. అందుకే తీవ్రమైన జలుబు, దగ్గుల నుండి ఉపశమనం కలిగించడంతో బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఈ పానీయంలో తులసి ఆకులు, నల్ల మిరియాలు, తేనె కలపడం వల్ల మిశ్రమం మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది.
undefined
తులసి, లవంగాల పానీయాలుకావలసిన పదార్థాలు :6-7 తులసి గింజలు లేదా తులసి ఆకులు5 లవంగాలు1 స్పూన్ తురిమిన అల్లం1 కప్పు గిలోయ్ రసం2 టేబుల్ స్పూన్లు నిమ్మరసంకొద్దిగా నల్ల ఉప్పు
undefined
తయారు చేసే విధానం...ఒక పాన్ లో ఒక కప్పు నీరు, తులసి ఆకులు, లవంగాలు, అల్లం వేసి.. దీన్ని 5 నిమిషాల పాటు బాగా మరిగించండి. చల్లారక ఈ మిశ్రమాన్ని ఒక గాజు సీసాలో వడకట్టి నిల్వ చేయండి. ఒక కప్పు గిలోయ్ రసంలో ఈ మిశ్రమం 1 టీస్పూన్, చిటికెడు నల్ల ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలపి తాగాలి. ప్రతి రోజూ ఉదయం తాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
undefined
ఇది ఎలా పనిచేస్తుంది..గిలోయ్ రసంలో శరీరంలో వ్యాధికారకమైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడే యాంటీఆక్సిడెంట్స్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ ఆయుర్వేద మూలకం రకంలోని విషాన్ని తొలిగించి, రక్తాన్ని శుద్ధి చేయడానికి, కాలేయ వ్యాధులను నివారించడానికి, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లను నయం చేయడంలో కూడా తోడ్పడుతుందని ఇటీవల తేలింది. ఇక తులసి, అల్లం, లవంగాలు కూడా యాంటీమైక్రోబయల్, యాంటీబయాటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగిఉంటాయి. కాబట్టి వాటిని ఈ పానీయంలో చేర్చడం వల్ల రుచి మెరుగుపడుతుంది. రోగనిరోధకశక్తి పెరుగుతుంది.
undefined
click me!