Government Jobs : కేవలం 10వ తరగతి అర్హతతో.. రూ.50 వేల వరకు జీతంగల 10 రకాల ప్రభుత్వ ఉద్యోగాలివే

Published : Mar 18, 2026, 03:42 PM ISTUpdated : Mar 18, 2026, 04:01 PM IST

Government Jobs 2026: 10వ తరగతి పాసైన యువతకు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించడానికి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ఇలా తక్కువ విద్యార్హతలతో నెలకు రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు జీతంగల ప్రభుత్వ ఉద్యోగాలేవో తెలుసా..?

PREV
17
10వ తరగతి చదివినా ప్రభుత్వ ఉద్యోగాలు..

Government Jobs : ప్రభుత్వ ఉద్యోగం అంటే కేవలం డిగ్రీలు, పీజీలు చేసినవారికే అనే అపోహ ఉంది. కానీ కేవలం పదో తరగతి అర్హతతో కూడా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించవచ్చని ఎంతమందికి తెలుసు..? తక్కువ విద్యార్హతలతో మంచి శాలరీతో పాటు సమాజంలో గౌరవాన్ని అందించే ఉద్యోగాలకు కొదవలేదు.

ప్రతి సంవత్సరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక విభాగాల్లో పదో తరగతి అర్హతతో పోస్టులను భర్తీ చేస్తుంటాయి. ఈ ఉద్యోగాల్లో మంచి జీతం, ఉద్యోగ భద్రత, పెన్షన్ (కొత్త స్కీమ్ ప్రకారం), ప్రమోషన్లు వంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఇక్కడ 10వ తరగతి పాసైన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోగల 10 రకాల ప్రభుత్వ ఉద్యోగాల గురించి, వాటి జీతం, వయోపరిమితి, ఎలా అప్లై చేయాలో వివరంగా తెలుసుకుందాం. 

27
రైల్వే, ఎస్ఎస్‌సీ జాబ్స్

 1. రైల్వే గ్రూప్ D (RRB Group D)

పదో తరగతి పాసైన అభ్యర్థులకు రైల్వే గ్రూప్ D రిక్రూట్‌మెంట్ అతిపెద్ద అవకాశాల్లో ఒకటి. ఇందులో ట్రాక్ మెయింటెయినర్, హెల్పర్ వంటి పోస్టులు ఉంటాయి.

అర్హత: 10వ తరగతి పాస్ / ITI 

వయోపరిమితి: 18-33 ఏళ్లు 

జీతం: రూ. 22,000-32,000 (అలవెన్సులతో కలిపి)

ఎక్కడ అప్లై చేయాలి: RRB అధికారిక వెబ్‌సైట్

2. SSC MTS (మల్టీ టాస్కింగ్ స్టాఫ్)

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖల్లో ఉద్యోగాలను SSC (Staff Selection Commission) ఎగ్జామ్ ద్వారా భర్తీ చేస్తారు. ఇందులో పదో తరగతి అర్హతతో MTS (మల్టీ టాస్కింగ్ స్టాఫ్) పోస్టులను భర్తీ చేస్తారు.

అర్హత: 10వ తరగతి పాస్ 

వయోపరిమితి: 18-25/27 ఏళ్లు (పోస్ట్‌ను బట్టి) 

జీతం: రూ. 18,000-30,000 

ఎక్కడ అప్లై చేయాలి: SSC వెబ్‌సైట్

37
పోస్టల్, పోలీస్ శాఖల్లో ఉద్యోగాలు

3. భారత తపాలా శాఖ (GDS/పోస్ట్‌మ్యాన్)

తపాలా శాఖలో గ్రామీణ డాక్ సేవక్ (GDS), పోస్ట్‌మ్యాన్, మెయిల్ గార్డ్ వంటి పోస్టులకు నోటిఫికేషన్లు వస్తుంటాయి. పదో తరగతి అర్హతతోనే ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు… కాబట్టి తక్కువ విద్యార్హతలు కలిగినవారికి మంచి అవకాశం.

అర్హత: 10వ తరగతి పాస్ 

వయోపరిమితి: 18-40 ఏళ్లు (GDSకు మినహాయింపు ఎక్కువ)

జీతం: రూ. 20,000-35,000 

ఎక్కడ అప్లై చేయాలి: India Post GDS పోర్టల్

4. పోలీస్ కానిస్టేబుల్ (స్టేట్ పోలీస్)

వివిధ రాష్ట్రాల పోలీస్ శాఖల్లో కానిస్టేబుల్ పోస్టులను 10వ/12వ తరగతి అర్హతతో భర్తీ చేస్తారు.

అర్హత: 10వ లేదా 12వ తరగతి 

వయోపరిమితి: 18-25 ఏళ్లు 

జీతం: రూ. 25,000-40,000 

ఎక్కడ అప్లై చేయాలి: రాష్ట్ర పోలీస్ వెబ్‌సైట్

47
ఆర్మీ, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు

5. ఆర్మీలో సోల్జర్ (GD)

భారత సైన్యంలో సోల్జర్ GD పోస్టులకు 10వ తరగతి పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

అర్హత: 10వ తరగతి పాస్ (కనీస మార్కులు అవసరం) 

వయోపరిమితి: 17.5-21 ఏళ్లు 

జీతం: రూ. 30,000-45,000 + అలవెన్సులు, మొత్తం సుమారు రూ. 50,000 వరకు 

ఎక్కడ అప్లై చేయాలి: Join Indian Army వెబ్‌సైట్

6. అటవీ శాఖ (ఫారెస్ట్ గార్డ్)

రాష్ట్ర ప్రభుత్వాల అటవీ శాఖల్లో ఫారెస్ట్ గార్డ్ పోస్టులను భర్తీ చేస్తారు.

అర్హత: 10వ/12వ తరగతి పాస్ 

వయోపరిమితి: 18-27 ఏళ్లు 

జీతం: రూ. 20,000-35,000 

ఎక్కడ అప్లై చేయాలి: రాష్ట్ర అటవీ శాఖ వెబ్‌సైట్

57
హోంగార్డ్, PWD, మున్సిపల్ కార్పొరేషన్‌లో జాబ్స్

7. హోంగార్డ్

రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు హోంగార్డ్ పోస్టులను భర్తీ చేస్తుంటాయి. ఇందుకు పదో తరగతి అర్హత గత అభ్యర్థులనే ఎంపిక చేస్తారు.

అర్హత: 10వ తరగతి పాస్

వయోపరిమితి: 18-35 ఏళ్లు 

జీతం: రూ. 15,000-25,000 (డ్యూటీని బట్టి) 

ఎక్కడ అప్లై చేయాలి: రాష్ట్ర హోంగార్డ్ పోర్టల్

8. PWD/మున్సిపల్ కార్పొరేషన్‌లో ప్యూన్/సహాయక్

మున్సిపల్ కార్పొరేషన్, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (PWD)లో ప్యూన్, హెల్పర్ వంటి పోస్టులు వస్తుంటాయి.

అర్హత: 10వ తరగతి పాస్ 

వయోపరిమితి: 18-30 ఏళ్లు 

జీతం: రూ. 18,000-28,000 

ఎక్కడ అప్లై చేయాలి: సంబంధిత శాఖ వెబ్‌సైట్

67
అంగన్‌వాడీ, విద్యుత్ శాఖలో ఉద్యోగాలు

9. అంగన్‌వాడీ హెల్పర్

మహిళా, శిశు అభివృద్ధి శాఖ కింద అంగన్‌వాడీ హెల్పర్ పోస్టులను కూడా పదో తరగతి అర్హతతోనే భర్తీ చేస్తారు.

  • అర్హత: 8వ/10వ తరగతి పాస్
  • వయోపరిమితి: 18-35 ఏళ్లు
  • జీతం: రూ. 8,000-15,000 (రాష్ట్రాన్ని బట్టి)
  • ఎక్కడ అప్లై చేయాలి: రాష్ట్ర WCD పోర్టల్

10. విద్యుత్ శాఖ (లైన్‌మ్యాన్/హెల్పర్)

రాష్ట్ర విద్యుత్ శాఖలో లైన్‌మ్యాన్, హెల్పర్ వంటి పోస్టులకు నోటిఫికేషన్లు వస్తుంటాయి.

  • అర్హత: 10వ తరగతి + ITI (చాలా పోస్టులకు)
  • వయోపరిమితి: 18-30 ఏళ్లు
  • జీతం: రూ. 20,000-35,000
  • ఎక్కడ అప్లై చేయాలి: రాష్ట్ర విద్యుత్ బోర్డు వెబ్‌సైట్
77
10వ తర్వాత ప్రభుత్వ ఉద్యోగం కోసం ఏం చేయాలి?

మీరు 10వ తరగతి పాసై ప్రభుత్వ ఉద్యోగం కోరుకుంటున్నారా? అయితే ముందుగా SSC, రైల్వే, పోస్టల్ డిపార్ట్‌మెంట్, రాష్ట్రాల నోటిఫికేషన్లపై ఓ కన్నేసి ఉంచండి. రోజూ కరెంట్ అఫైర్స్ చదవండి. బేసిక్ మ్యాథ్స్, రీజనింగ్ ప్రాక్టీస్ చేయండి. పాత ప్రశ్నపత్రాలను తప్పకుండా సాల్వ్ చేయండి.

గుర్తుంచుకోండి, ప్రతి నోటిఫికేషన్‌లో వయోపరిమితి, జీతం అనేవి పోస్ట్, రాష్ట్రాన్ని బట్టి కొద్దిగా మారవచ్చు. ఎప్పుడూ అధికారిక వెబ్‌సైట్ నుంచే అప్లై చేయండి. నకిలీ జాబ్ ఆఫర్లు, ఏజెంట్ల పట్ల జాగ్రత్తగా ఉండండి.

Read more Photos on
click me!

Recommended Stories