Layoffs: రోడ్డున పడుతోన్న సాఫ్ట్‌వేర్ ఎంప్లాయిస్‌.. 30 వేల ఉద్యోగుల‌ను తొల‌గించ‌నున్న టెక్ దిగ్గ‌జం

Published : Mar 06, 2026, 03:24 PM IST

Layoffs: ఏఐ కార‌ణంగా ఐటీ రంగంలో సంక్షోభంలోకి వెళ్తోంది. ఇప్ప‌టికే భారీ టెక్ దిగ్గ‌జాలు ఉద్యోగుల‌ను తొల‌గిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రో ప్ర‌ముఖ టెక్నాల‌జీ సంస్థ ఒరాకిల్ కార్పొరేష‌న్ భారీగా ఉద్యోగుల‌ను ఇంటికి పంపేందుకు సిద్ధ‌మ‌వుతోంది. 

PREV
15
భారీ స్థాయిలో ఉద్యోగాల కోతకు ప్రణాళిక

రిపోర్ట్ ల ప్రకారం, ఒరాకిల్ కంపెనీ త్వరలోనే ఉద్యోగుల తొలగింపులు ప్రారంభించే అవకాశం ఉంది. మొత్తం 30 వేల ఉద్యోగుల‌ను తొల‌గించే ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. ఇది అమల్లోకి వస్తే కంపెనీ చరిత్రలోనే అత్యంత పెద్ద రీస్ట్రక్చరింగ్ చర్యగా నిలిచే అవకాశం ఉంది. ఈ నిర్ణయం అమలు చేస్తే ఉద్యోగులకు ఇచ్చే సెవరెన్స్ ప్యాకేజీలతో కలిపి కంపెనీకి సుమారు 1.6 బిలియన్ డాలర్లు ఖర్చు కావచ్చని కంపెనీ ముందుగా వెల్లడించింది. ఇక పలు విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల స్థానంలో AI ఆధారిత వ్యవస్థలను ఉపయోగించే అవకాశమూ ఉందని రిపోర్టులు సూచిస్తున్నాయి.

25
AI డేటా సెంటర్లపై భారీ పెట్టుబడులు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టాలని ఒరాకిల్ అధినేత లారీ ఎల్లిస‌న్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ దిశగా కంపెనీ OpenAIతో కలిసి భారీ AI మౌలిక సదుపాయాల నిర్మాణాన్ని ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ మొత్తం విలువ 300 బిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని అంచనా. AI డేటా సెంటర్ల కోసం సుమారు 3 మిలియన్ GPUs అవసరమవుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుల కోసం ఒరాకిల్ ఇప్పటికే 58 బిలియన్ డాలర్ల అప్పు తీసుకుంది. ఇందులో టెక్సాస్, విస్కాన్సిన్ డేటా సెంటర్ల కోసం 38 బిలియన్ డాలర్లు, న్యూ మెక్సికోలో క్యాంపస్ నిర్మాణం కోసం 20 బిలియన్ డాలర్లు ఉన్నాయి.

35
100 బిలియన్ డాలర్లకు చేరిన అప్పులు

AI ప్రాజెక్టులపై భారీ ఖర్చులు చేయడం వల్ల ఒరాకిల్ మొత్తం అప్పులు 100 బిలియన్ డాలర్లను దాటినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పెట్టుబడుల ఫలితాలు వెంటనే రావడం లేదు. మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం 2030 ప్రాంతంలోనే ఈ ప్రాజెక్టుల నుంచి లాభాలు కనిపించే అవకాశం ఉంది. ఇంతలో కంపెనీ క్యాష్ ఫ్లోపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉండటంతో ఉద్యోగాల కోత వంటి చర్యలను పరిశీలిస్తున్నట్లు సమాచారం

45
షేర్ మార్కెట్‌లో భారీ పతనం

ఒరాకిల్ షేర్లు గతంలో భారీగా పెరిగాయి. 2024లో 61% పెరిగాయి, తరువాత మరో 20% వృద్ధి సాధించాయి. కానీ 2025 సెప్టెంబర్‌లో ఉన్న గరిష్ఠ స్థాయి నుంచి ఇప్పటివరకు సుమారు 54% వరకు పడిపోయాయి. దీని వల్ల కంపెనీ మార్కెట్ విలువలో సుమారు 463 బిలియన్ డాలర్లు తగ్గిపోయాయి. ఇదే సమయంలో కంపెనీ ఈ ఏడాది 50 బిలియన్ డాలర్ల వరకు నిధులు సమీకరించే ప్రణాళిక కూడా రూపొందిస్తోంది.

55
టెక్ రంగంలో పెరుగుతున్న ఉద్యోగాల కోత

AI టెక్నాలజీపై భారీ పెట్టుబడులు పెట్టడం వల్ల ఇతర టెక్ కంపెనీల్లో కూడా ఉద్యోగాల కోతలు కనిపిస్తున్నాయి. అమెజాన్ ఈ ఏడాది ప్రారంభంలో 16,000 ఉద్యోగాలు తగ్గించింది. ఇక మైక్రోసాఫ్ట్ గత ఏడాది 15,000 మంది ఉద్యోగులను తొలగించింది. సేల్స్‌ఫోర్స్ సైతం వేలాది ఉద్యోగాలను తగ్గించింది. బ్లాక్ ఐఎన్‌సీ సంస్థ సుమారు 3,500 ఉద్యోగాలను తొల‌గించింది. దీనిపై కంపెనీ సహ వ్యవస్థాపకుడు Jack Dorsey మాట్లాడుతూ.. AI కారణంగా సామర్థ్యం పెరిగిందని చెప్పారు. ఇలా AI టెక్నాలజీ విస్తరణతో టెక్ రంగంలో ఉద్యోగాల స్వరూపం వేగంగా మారుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories