రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టుల కోసం భారీ నోటిఫికేషన్ ఇచ్చింది. మొత్తం 11,127 ఖాళీలను భర్తీ చేయనుంది. పదో తరగతి పాసై, ఐటీఐ లేదా డిప్లొమా చేసిన 18-30 ఏళ్ల యువత ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
RRB Notification 2026 : భారతీయ రైల్వేలో ఉద్యోగం సాధించాలనుకునే తెలుగు యువతకు ఇది బంపర్ ఆఫర్. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) ఏకంగా 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా పలు జోన్లలో ఈ నియామకాలు జరగనున్నాయి.
25
సికింద్రాబాద్ జోన్ లో ఎన్ని పోస్టులు..?
ఈ రిక్రూట్‌మెంట్‌ను దేశంలోని 21 రైల్వే జోన్లలో చేపట్టనున్నారు. మన సికింద్రాబాద్ రైల్వే జోన్ పరిధిలో కూడి 674 పోస్టులు ఉన్నయి. అలాగే చెన్నై, బెంగళూరుతో పాటు ముంబై వంటి నగరాల్లో కూడా వందలాది పోస్టులు ఉన్నాయి. ఖాళీలు ఎక్కువగా ఉండటంతో, పోటీ ఉన్నప్పటికీ ఉద్యోగం పొందే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.
35
అర్హతలివే..
ఈ పోస్టులకు అప్లై చేయాలంటే కనీసం పదో తరగతి పాసై ఉండాలి. దానితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ లేదా డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. మే 15న దరఖాస్తులు మొదలవుతాయి, జూన్ 14 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ప్రారంభంలో నెలకు రూ.19,900 జీతం ఇస్తారు. దీనికి అదనంగా కేంద్ర ప్రభుత్వ అలవెన్సులు, ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి.
55
ఎంపిక ప్రక్రియ
సెలక్షన్ ప్రాసెస్‌లో పలు దశలు ఉంటాయి. ముందుగా CBT-1, CBT-2 అనే రెండు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఉంటాయి. ఈ అన్ని దశల్లో పాసైన వారిని ఫైనల్‌గా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలు త్వరలో వెలువడే అధికారిక నోటిఫికేషన్‌లో ఉంటాయి.