Jobs in Germany: జర్మనీలో ఉద్యోగుల కొరత తీవ్రంగా ఉంది. దాంతో భారతీయులకు ఉద్యోగాలు ఆఫర్ చేస్తోంది జర్మనీ. ఇందుకోసం ఇప్పటికే భారత్‌తో ఒప్పందం కూడా చేసుకుంది. మన దేశంలోని యువతను జర్మనీ ఆహ్వానిస్తోంది.
జర్మనీ ఉద్యోగుల అధికంగా ఉంది. తమకు తగిన వర్క్ ఫోర్స్ లేక జర్మనీ సతమతమవుతోంది. ఇందుకోసం భారత్ సాయం కోరింది. మంచి జీతంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తామని భారతీయ యువతను తన దేశానికి రమ్మని ఎన్నో ఉద్యోగాలను ఆఫర్ చేస్తోంది. జర్మనీ ఆర్థిక వ్యవస్థ, పరిశ్రమల్లోని కొరతను తీర్చడానికి భారతీయ కార్మికులపై ఆ దేశం ఎంతో నమ్మకం ఉంది. జర్మనీలో ఆరోగ్యం, ఐటీ, ఇంజినీరింగ్, సాఫ్ట్‌వేర్, పరిశ్రమలు రంగాలలో లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఆరోగ్య రంగంలో నర్సులు, వైద్యులు వారికి అవసరం. మంచి నైపుణ్యం, అనుభవం ఉంటే చాలు మీకు జర్మనీ పెద్ద జీతాలతో ఉద్యోగం ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.
24
ఇప్పటికే ఒప్పందం
జర్మనీ ప్రభుత్వం తమకు మంచి ఉద్యోగులు కావాలని కోరుతూ ఇప్పటికే భారత ప్రభుత్వంతో వలస ఒప్పందం చేసుకుంది. దీనివల్ల పని కోసం జర్మనీ వెళ్లేవారికి వీసా, ఇతర అనుమతులు సులువుగా దొరుకుతాయి. విద్యార్హతలు, ఇతర డాక్యుమెంట్ల విషయంలో కఠిన నిబంధనలను కూడా సులభతరం చేశారు. ఈ ఒప్పందంలోనే వేతనం, బీమా వంటివి కూడా ఉన్నాయి. జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు. ఒప్పందం తర్వాత జర్మనీ ఇప్పటికే ఉద్యోగాలు ఇవ్వడం ప్రారంభించింది. ప్రతి ఏడాది 4 లక్షల మంది విదేశీ ఉద్యోగులను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీరిలో ఎక్కువ మందిని భారత్ నుంచే తీసుకోవడానికి సిద్ధమైంది. ఇది ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని జర్మనీ చెబుతోంది.
34
భాష ఎలా నేర్చుకోవాలి?
ఉద్యోగం కోసం జర్మనీ వెళ్లే భారతీయులకు భాష పెద్ద సమస్యగా మారుతుంది. అలాగే అక్కడి సంస్కృతులు, పద్ధతులు, ఆహారం విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు తప్పవు. అయితే దీన్ని అధిగమించేందుకు కూడా ఒప్పందంలోనే ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. జర్మనీలో ఉద్యోగాలకు ఎంపికైన వారికి భారత్‌లో జర్మన్ భాషా శిక్షణా కేంద్రాలను ప్రారంభిస్తున్నారు. భారత్, జర్మనీ మధ్య కుదిరిన వలస ఒప్పందం ప్రకారం.. పని కోసం వెళ్లేవారికి వీసా త్వరగా వచ్చేస్తుంది. జర్మన్ భాష్ నేర్చుకుంటే జర్మనీలో జీవించడం చాలా సులువుగా మారుతుంది.
జర్మనీలో లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మీరు జర్మన్ వాళ్లకి క్లియర్ అర్థమయ్యేలా ఆంగ్లంలోనే మీ రెజ్యుమెను సిద్ధం చేసుకోండి. తరువాత LinkedIn, Indeed Germany, Make it in Germany (Official portal) వంటి వెబ్ సైట్లో ఎప్పటికప్పుడు ఉద్యోగాలు సెర్చ్ చేస్తూ ఉండాలి. మీకు తగిన జాబ్ పడినప్పుడు అప్లై చేయాలి. ఆన్ లైన్లోనే ఇంటర్య్వూ అవుతుంది.