RRB Recruitment Notification 2026 : ఇండియన్ రైల్వే కొత్త సంవత్సరం ఆరంభంలోనే భారీ ఉద్యోగాల భర్తీకి సిద్దమయ్యింది. కేవలం పదో తరగతి అర్హతతో ఒకటి రెండు కాదు ఏకంగా 22 వేల ఉద్యోగాల భర్తీ చేపడుతోంది.
Indian Railway Jobs : భారతీయ రైల్వేలో స్థిరమైన, గౌరవప్రదమైన ఉద్యోగం కోసం చూస్తున్న యువతకు మంచి అవకాశం వచ్చింది… పదులు, వందల్లో కాదు వేలల్లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడింది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB), గ్రూప్ డి విభాగంలో సుమారు 22,000 ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించింది. దీనికోసం ఆన్‌లైన్ దరఖాస్తుల నమోదు జనవరి 20, 2026న మొదలై, ఫిబ్రవరి 20, 2026 వరకు కొనసాగుతుంది.
27
రైల్వే ఉద్యోగాల భర్తీకి సంబంధించి కీలక సమాచారం
• మొత్తం ఖాళీలు: సుమారు 22,000 (గ్రూప్ డి పోస్టులు)
• ప్రకటన సంఖ్య: CEN 09/2025
• ప్రారంభ జీతం: రూ.18,000 (అదనపు అలవెన్సులతో)
• ఉద్యోగ రకాలు: ట్రాక్ మెయింటెయినర్, పాయింట్స్‌మ్యాన్, సిగ్నల్, టెలికాం అసిస్టెంట్ లాంటి వివిధ సాంకేతిక పనులు.
37
విద్యార్హతలు, వయోపరిమితి
1. విద్యార్హత: అభ్యర్థులు 10వ తరగతి (మెట్రిక్యులేషన్) పాసై ఉండాలి లేదా ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
2. వయోపరిమితి: జనవరి 1, 2026 నాటికి, అభ్యర్థులు 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి.
3. వయోపరిమితి సడలింపు: ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC/ST, OBC, దివ్యాంగులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అభ్యర్థులను ఈ కింది మూడు దశల ఆధారంగా ఎంపిక చేస్తారు.
1. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) : రాత పరీక్ష ఆన్‌లైన్‌లో జరుగుతుంది.
2. శారీరక దారుఢ్య పరీక్ష (PET) : శారీరక బలం, పరుగు పందెం లాంటివి పరీక్షిస్తారు.
3. సర్టిఫికేట్ వెరిఫికేషన్ : చివరగా అసలు పత్రాలను సరిచూస్తారు.
67
తెలుగులోనే రాత పరీక్ష
రాత పరీక్ష కేవలం ఇంగ్లీష్, హిందీలోనే కాదు మరో 13 దేశీయ భాషల్లో ఉంటుంది. ఇందులో తెలుగు, ఉర్దూ కూడా ఉన్నాయి... అంటే తెలుగు విద్యార్థులు సొంత భాషలో ఎగ్జామ్ రాయవచ్చు.
ఎగ్జామ్ సెంటర్స్ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి... హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లోనే కాదు చిన్నచిన్న పట్టణాల్లో కూడా ఈ రైల్వే ఎగ్జామ్ రాయవచ్చు.
77
దరఖాస్తు ప్రక్రియ
ఆసక్తి ఉన్నవాళ్లు rrbsecunderabad.gov.in అనే అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. పోస్ట్ ద్వారా పంపిన దరఖాస్తులు అంగీకరించరు.
దరఖాస్తు చేయాలనుకునే వాళ్ళు చివరి నిమిషంలో సాంకేతిక సమస్యలు రాకుండా, ఫిబ్రవరి 20వ తేదీకి ముందే దరఖాస్తు చేసుకోవడం మంచిది. విద్యా సర్టిఫికెట్లు, గుర్తింపు కార్డు, ఫోటోలను సిద్ధంగా ఉంచుకోండి.