Government Jobs : రూ.78,800 శాలరీతో 173 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ

Published : Jan 13, 2026, 08:39 AM IST

Government Jobs : ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్దం అయ్యే యువతీయువకులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం NCERT లో నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది… దరఖాస్తుకు మరో మూడ్రోజులే సమయం మిగిలివుంది. కాబట్టి వెంటనే అప్లై చేసుకొండి. 

PREV
17
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

కేంద్ర విద్యా శాఖ ఆధ్వర్యంలోని National Council of Educational Research and Training(NCERT) లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతోంది. దేశవ్యాప్తంగా మొత్తం 173 నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అన్ని అర్హతలుండి ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు.

27
పోస్టులు, ఖాళీల వివరాలు

NCERT రిక్రూట్‌మెంట్ గ్రూప్ ఎ, బి, సి కేటగిరీల కింద జరుగుతుంది. ఇందులో ఇంజనీర్, ఆఫీసర్, అకౌంటెంట్, టెక్నీషియన్, కంప్యూటర్ ఆపరేటర్, స్టోర్ కీపర్ వంటి వివిధ పోస్టులు ఉన్నాయి.

ఖాళీలు :

లెవెల్ 2-5 : 138 పోస్టులు

లెవెల్ 6-8 : 26 పోస్టులు

లెవెల్ 10-12 : 09 పోస్టులు

37
ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 27 డిసెంబర్ 2025

దరఖాస్తు స్వీకరణకు చివరితేదీ : 16 జనవరి 2026

పరీక్షలు, పలితాలు వెల్లడించే తేదీలను తర్వాత వెల్లడించనుంది NCERT.

47
దరఖాస్తు ఫీజు

దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్‌లో చెల్లించాలి. 

జనరల్/OBC/EWS (లెవల్ 10-12) - రూ.1500

జనరల్/OBC/EWS (లెవెల్ 6 -7) - రూ.1200

జనరల్/OBC/EWS (లెవెల్ 5) -రూ.1000

ఎస్సి, ఎస్టి, PWD, మాజీ సైనికులకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు .

57
విద్యార్హతలు, వయోపరిమితి

పోస్టుల వారిగా విద్యార్హతలున్నాయి. సాధారణంగా డిగ్రీ, పిజీ, ఇంజనీరింగ్ అర్హతతో ఉద్యోగాలున్నాయి.

మినిమం వయసు 18 ఏళ్లు. అత్యధికంగా 40 ఏళ్లలోపు వారు అర్హులు. రిజర్వేషన్లు కలిగిన అభ్యర్థులు, దివ్యాంగులు, మాజీ సైనికులకు వయోపరిమితి సడలింపు ఉంటుంది.

67
దరఖాస్తు, ఎంపిక ప్రక్రియ

అర్హులైన అభ్యర్థులు ncert.nic.in వెబ్‌సైట్‌లో జనవరి 16, 2026 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత తుది ఎంపిక ఉంటుంది.

77
శాలరీ

పోస్టును బట్టి శాలరీ ఉంటుంది. HRA, DA, TA వంటి ప్రభుత్వ ఉద్యోగులకు లభించే అన్నిరకాల అలవెన్సులు ఉంటాయి.

లెవెల్ 2 - రూ.19,900

లెవెల్ 5 - రూ.29,200

లెవెల్ 6 - రూ.35,400

లెవెల్ 8 - రూ.47,600

లెవెల్ 10 - రూ.56,100

లెవెల్ 11 - రూ.67,700

లెవెల్ 12 - రూ.78,800

Read more Photos on
click me!

Recommended Stories