Published : Jan 15, 2026, 09:11 AM ISTUpdated : Jan 15, 2026, 09:23 AM IST
బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం ప్రిపేరయ్యే తెలుగు యువతకు అద్భుత అవకాశం. యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ 2026 ఆరంభంలోనే ఉద్యోగాల ప్రక్రియను ప్రారంభించింది. ఇంకెందుకు ఆలస్యం… అర్హతలు కలిగినవారు వెంటనే అప్లై చేసుకొండి.
Bank Jobs : హాయిగా ఏసిలో కూర్చుని పని ఒత్తిడి లేకుండా టైమ్ టు టైమ్ చేసే ఉద్యోగాలనే ఎవరైనా కోరుకునేది. ఇలాంటి వైట్ కాలర్ ఉద్యోగాల్లో బ్యాంక్ జాబ్స్ ముందుంటాయి. అందుకే చాలామంది యువత కేవలం బ్యాంక్ ఉద్యోగాల కోసమే ఎదురుచూస్తుంటారు... వాటికోసమే ప్రత్యేకంగా సన్నద్దం అవుతుంటాయి. ఇలాంటివారికి గుడ్ న్యూస్... ఓ బ్యాంక్ 2026 ఆరంభంలోనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది.
యూకో బ్యాంక్ (United Commercial Bank) 2026-27 సంవత్సరానికి రిక్రూట్‌మెంట్ ప్రక్రియను ప్రారంభించింది. ఈసారి స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO), జనరలిస్ట్ ఆఫీసర్ విభాగాల్లో మొత్తం 173 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
27
యూకో బ్యాంకులో భర్తీచేసే పోస్టులివే...
ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ (JMGS-I), మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ (MMGS-II) స్థాయిలలో కింది పోస్టులను భర్తీ చేస్తున్నారు
• ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్
• ట్రెజరీ ఆఫీసర్
• చార్టర్డ్ అకౌంటెంట్
• సాఫ్ట్‌వేర్ డెవలపర్
• డేటా అనలిస్ట్ & డేటా సైంటిస్ట్
• సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్, క్లౌడ్ ఇంజనీర్.
37
విద్యార్హతలు, వయో పరిమితి
గ్రాడ్యుయేట్/ఇంజనీరింగ్/సీఏ/ఎంబిఏ/ఎంసిఏ/ఎమ్మెస్సి తో పాటు మరికొన్ని విద్యార్హతలతో యూకో బ్యాంక్ లో ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. (పోస్టును బట్టి విద్యార్హతలు ఉన్నాయి)
20 నుండి 35 ఏళ్లలోపు వయసు గలవారు ఈ ఉద్యోగాలకు అర్హులు (పోస్టును బట్టి వయోపరిమితి నిర్ణయించారు)
UCO బ్యాంకులో పోస్టును బట్టి శాలరీ ఉంటుంది. రూ.48,480 నుండి రూ.93,960 వరకు శాలరీలు ఉన్నాయి. సాధారణంగా బ్యాంకు ఉద్యోగులకు లభించే ఇతర అలవెన్సులు కూడా వర్తిస్తాయి.