
పాకిస్థాన్ అంటేనే ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశం. ఇటీవల భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌తో ఈ విషయం మరోసారి ప్రపంచానికి స్పష్టమైంది. అమెరికాలో ఉన్న ఉగ్ర స్థావరాలను సాక్ష్యాలతో సహా భారత్ ప్రపంచం ముందు పెట్టింది. అయితే తాము ఉగ్రవాదానికి పూర్తి వ్యతిరేకమని చెప్పుకునే అమెరికా మాత్రం అదే పాకిస్థాన్‌తో ఎందుకు స్నేహం చేస్తోంది. అసలు అమెరికా-పాకిస్థాన్ బంధం ఎప్పటి నుంచి మొదలైంది. ప్రస్తుతం ఎలా ఉంది.? లాంటి వివరాల్లోకి వెళితే..
* ప్రచ్ఛన్న యుద్ధం కాలం: సోవియట్ యూనియన్ విస్తరణను అడ్డుకోవడానికి అమెరికా పాకిస్థాన్‌ను వ్యూహాత్మక మిత్రుడిగా వాడుకుంది.
* చైనా లింక్ (1970లో): అమెరికా–చైనా సంబంధాలకు మార్గం సుగమం చేసేందుకు పాకిస్థాన్ మధ్యవర్తిగా కీలక పాత్ర పోషించింది.
* అఫ్గానిస్థాన్ (1980లు): సోవియట్ దళాలపై ముజాహిదీన్‌లను మద్దతు ఇవ్వడానికి పాకిస్థాన్ అమెరికాకు ప్రధాన స్థావరంగా మారింది.
* 2001 తర్వాత: 9/11 దాడుల తరువాత అమెరికా ‘వార్ ఆన్ టెరర్’లో పాకిస్థాన్‌ను తిరిగి తనవైపు లాగుకుంది. ఆఘ్గనిస్థాన్‌లో తమ ఆపరేషన్స్ కోసం పాకిస్థాన్‌ను ఉపయోగించుకుంది.
* 2011 తర్వాత: అయితే 2011లో ఒసామా బిన్ లాడెన్ హతమైన తర్వాత అమెరికా పాకిస్థాన్ బంధాలు దెబ్బతిన్నాయి. పాకిస్థాన్‌లో ఆశ్రయం పొందుతున్న ఒబామాను సీక్రెట్ ఆపరేషన్‌తో అమెరికా హతమార్చింది. తమకు కనీస సమాచారం ఇవ్వకుండా అమెరికా ఆపరేషన్ చేపట్టడం, తమ శత్రువు ఆశ్రయం పొందుతున్న విషయాన్ని పాకిస్థాన్ తెలపలేదన్న కారణాలతో ఇరు దేశాల బంధాలు దెబ్బ తిన్నాయి.
ఇటీవల అమెరికా–పాకిస్థాన్ సంబంధాలు కొత్త మలుపు తిరిగాయి. పాకిస్థాన్ సైన్యాధిపతి జనరల్ ఆసిం మునీర్ అమెరికా పర్యటనలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భోజన విందులో పాల్గొనడం, ఇంధన వాణిజ్య ఒప్పందం కుదరడం, అణ్వాయుధ భద్రతపై మునీర్ చేసిన వ్యాఖ్యలు ఈ మార్పునకు సంకేతాలుగా నిలిచాయి. గతంలో అనేక ఒడిదుడుకులు చూసిన ఈ రెండు దేశాలు మళ్లీ దగ్గరఅవుతుండడానికి కారణాలు ఏంటన్న అంశంపై ప్రపంచం చర్చిస్తోంది.
* పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభం
* ప్రస్తుతం పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ దివాలా తీసిన స్థితిలో ఉంది.
* IMF, వరల్డ్ బ్యాంక్ రుణాలు పొందడానికి అమెరికా సహాయం అత్యవసరం.
* FATF ఆంక్షలను ఎత్తివేయించుకోవడంలో కూడా అమెరికా కీలక పాత్ర పోషించనుంది.
భద్రతా సమస్యలు
* బలూచిస్తాన్ తిరుగుబాటు, తెహ్రీకే తాలిబాన్ దాడులను ఎదుర్కోవడంలో అమెరికా సైనిక సహాయం అవసరం.
* అణ్వాయుధ భద్రతను నిర్ధారించుకోవడం కూడా ప్రధాన సమస్య.
అమెరికా - పాక్ బంధం బలోపేతమవడానికి మరో ప్రధాన కారణం ఖనిజ సంపద అనే వాదనాలు సైతం తెరపైకి వస్తున్నాయి. పాకిస్థాన్‌లో $3–5 ట్రిలియన్ విలువైన అరుదైన ఖనిజాలు ఉన్నాయి. రాగి, బంగారం, బొగ్గు, క్రోమైట్, ఇనుము, ఉప్పు గనులు అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయి. రేకో డిక్ (Reko Diq) గనులు ప్రపంచంలోనే అతిపెద్ద రాగి–బంగారం నిక్షేపాలలో ఒకటి. ఇలా పాకిస్థాన్‌లో ఉన్న ఖనిజ సంపదే అమెరికాను ఆకర్షిస్తుందని వార్తలు వస్తున్నాయి.
ఆసిం మునీర్ అమెరికా పర్యటనతో రెండు దేశాల బంధం మరింత బలోపేతమైంది. మునీర్, ట్రంప్ భేటీలో ఇంధన వాణిజ్యం, భద్రతా అంశాలు, ఉగ్రవాద వ్యతిరేక చర్యలపై చర్చించారు. పాకిస్థాన్ అణ్వాయుధాలు ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లకుండా కట్టడి చేస్తామని హామీ ఇచ్చారు. అమెరికా–పాక్ మిలిటరీ సహకారం పెంచే దిశగా సూచనలు వెలువడ్డాయి.
పాకిస్థాన్‌లో ఖనిజ సంపద ఉందన్న వార్తల నేపథ్యంలో పలు దేశాలు అక్కడ పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. వీటిలో ప్రధానంగా..
* చైనా – గిల్గిట్-బల్టిస్తాన్ ప్రాంతంలో ఖనిజ హక్కులు పొందే అవకాశం.
* అమెరికా – ఉత్తర బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో మైనింగ్ ప్రాజెక్టులపై ఆసక్తి.
* సౌదీ అరేబియా – రేకో డిక్ గనులపై దృష్టి.
* యూకే, యూఏఈ, టర్కీ – పెట్టుబడుల కోసం పోటీ.
పాకిస్థాన్, అమెరికా దగ్గరైతే భారత్‌పై వ్యూహాత్మక ఒత్తిడి పెరిగే అవకాశం. చైనా–పాక్ కూటమితో పాటు అమెరికా సాంకేతిక మద్దతు లభిస్తే భారత్‌కు సవాలుగా మారుతుంది. కశ్మీర్ సమస్యలో అమెరికా మధ్యవర్తిత్వ ప్రయత్నాలు పునరావృతం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. పాకిస్థాన్‌కు అంతర్జాతీయ వేదికలపై మద్దతు మద్ధతు లభించే అవకాశాలు కూడా లేకపోలేవు. అమెరికా పెట్టుబడులు పాకిస్థాన్ వైపు మళ్లితే, దక్షిణాసియాలో పెట్టుబడి పోటీ పెరుగుతుంది.
పాకిస్థాన్–అమెరికా సాన్నిహిత్యం చైనాకు పెద్దగా ఇబ్బంది కాకపోవచ్చు. పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ స్థిరపడితే, చైనా పెట్టుబడులు మరింత లాభదాయకం అవుతాయని భావిస్తోంది. బలూచిస్తాన్ వేర్పాటువాద గ్రూపులను అమెరికా ఉగ్రవాద సంస్థలుగా గుర్తించడం చైనాకు మేలు చేస్తుంది. ఇప్పటికే చైనా–పాక్ ఎకనామిక్ కారిడార్ (CPEC) ద్వారా పాకిస్థాన్‌లో భారీ పెట్టుబడులు జరుగుతున్నాయి. అయితే అమెరికా, పాక్‌ను తనవైపు తిప్పుకోవడం ద్వారా చైనా ప్రభావాన్ని తగ్గించాలనుకుంటోంది.