Tiger Urine Sale: పులి మూత్రాన్ని విక్ర‌యిస్తున్న చైనా.. దాంతో ఏం చేస్తార‌నేగా సందేహం

Published : Aug 11, 2025, 12:11 PM ISTUpdated : Aug 11, 2025, 12:42 PM IST

ర‌క‌ర‌కాల ఆహార అల‌వాట్లు, వ్యాధుల‌తో నిత్యం వార్త‌ల్లో నిలుస్తుంది చైనా దేశం. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యంతో ప్ర‌పంచం దృష్టిని ఆక‌ర్షించింది. వివ‌రాల్లోకి వెళితే.. 

PREV
15
మొన్న గాడిద మాంసం నేడు..

ఆహారపు అలవాట్లు, వింత ఉత్పత్తులతో తరచూ వార్తల్లో నిలిచే చైనా మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచింది. గతంలో గాడిద మాంసం అమ్మకాలతో వివాదాస్పదంగా మారిన ఈ దేశం, ఇప్పుడు మరింత వింత కారణంతో వార్తల్లోకి వచ్చింది. అదే పులి మూత్రం అమ్మకం.

DID YOU KNOW ?
ధర ఎంతంటే.?
250 గ్రాముల పులి మూత్రం సీసా ధర 50 యువాన్‌లుగా ఉంది. అంటే మ‌న భార‌తీయ క‌రెన్సీలో చెప్పాలంటే రూ. 600 అన్న‌మాట‌.
25
సిచువాన్‌లోని జూ ప్రత్యేక ఆఫర్

నైరుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో ఉన్న యాన్ బిఫెంగ్షియా వన్యప్రాణి ప్రదర్శనశాల ప్రత్యేకంగా సైబీరియన్ పులుల మూత్రాన్ని సీసాలలో నింపి విక్రయిస్తోంది. దీనిని అక్క‌డి ప్ర‌జ‌లు కూడా ఎగ‌బ‌డి కొనుగోలు చేయ‌డం విశేషం. ఈ పులి మూత్రంలో ఉండే వైద్య గుణాలు దీని ఆద‌ర‌ణ‌కు కార‌ణ‌మ‌ని జూ నిర్వాహ‌కులు చెబుతున్నారు.

35
ఉప‌యోగాలు ఏంటంటే.?

జూ నిర్వాహకుల ప్రకారం.. పులి మూత్రం రుమటాయిడ్ ఆర్థరైటిస్, కండరాల నొప్పి, వాపు వంటి సమస్యలకు సహాయపడుతుందని చెబుతున్నారు. పులి శక్తి, ధైర్యానికి ప్రతీకగా భావించబడటమే కాకుండా, పలు పాత చైనీస్ వైద్య పుస్తకాలలో కూడా పులి ఉత్పత్తుల ప్రస్తావన ఉందని జూ అధికారులు అంటున్నారు. ఆర్థ‌రైటిస్ నొప్పులు ఉన్న చోట పులి మూత్రాన్ని అప్లై చేస్తే ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంద‌ని ప్ర‌చారం చేస్తున్నారు.

45
ధ‌ర ఎంతంటే.?

ధ‌ర విష‌యానికొస్తే.. 250 గ్రాముల పులి మూత్రం సీసా ధర 50 యువాన్‌లుగా ఉంది. అంటే మ‌న భార‌తీయ క‌రెన్సీలో చెప్పాలంటే రూ. 600 అన్న‌మాట‌. ఈ మూత్రాన్ని వైట్ వైన్‌లో కలిపి, వెల్లుల్లి ముక్కతో నొప్పి ఉన్న ప్రదేశంలో రుద్దమని సూచిస్తున్నారు. అంతేకాకుండా పులి మూత్రాన్ని తాగొచ్చ‌ని కూడా జూ నిర్వాహ‌కులు చెబుతున్నారు. అయితే ఏదైనా అల‌ర్జీతో బాధ‌ప‌డేవారు మాత్రం దీనిని తీసుకోకూడ‌ద‌ని చెబుతున్నారు.

55
ఇందులో ఎంత వ‌ర‌కు నిజం ఉంది.?

పులి మూత్రంలో నిజంగానే ఇన్ని సుగుణాలు ఉన్నాయా.? అంటే క‌చ్చితంగా అవున‌నే స‌మాధానం మాత్రం లేదు. జూ నిర్వాహ‌కులు చెబుతున్న వివ‌రాల‌కు ఇప్పటివరకు వైద్య శాస్త్రంలో ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు. పులి మూత్రం నిజంగా వైద్య ప్రయోజనాలు కలిగిస్తుందా లేదా అనే దానిపై నిపుణులు స్పష్టమైన అభిప్రాయం ఇవ్వలేదు. అయినప్పటికీ ఈ వింత వ్యాపారం చైనాలో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories