USA: క్లాసుల‌కు డుమ్మాకొడితే వీసా ర‌ద్దు.. అమెరికాలో ఇండియ‌న్ విద్యార్థుల‌కు చుక్క‌లు చూపిస్తున్న ట్రంప్

Published : May 27, 2025, 05:28 PM IST

అమెరికా అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన నాటి నుంచి ట్రంప్ సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటూ ప్ర‌పంచాన్ని షేక్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా అమెరికాలో చ‌దువుకుంటున్న ఇండియ‌న్స్‌పై పిడుగు లాంటి ఓ న్యూస్ చెప్పారు.

PREV
15
అలాంటి వారిపై క‌ఠిన చ‌ర్య‌లు:

అమెరికా అద్య‌క్షుడు ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణ‌యంతో అమెరికాలో ఉన్న వేలాది మంది విదేశీ విద్యార్థులు భయభ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా అమెరికా ప్రభుత్వం మరో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. క్లాసులకు హాజరు కాకుండా కోర్సులు మధ్యలో విడిచిపెట్టి వెళ్లిపోయే విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

25
వీసా ర‌ద్ద‌య్యే అవ‌కాశం:

కొత్త నిబంధనల ప్రకారం విద్యార్థులు తమ యూనివర్సిటీలకు ముందుగా తెలియజేయకుండానే కోర్సులను మానేస్తే లేదా తరగతులకు హాజరుకాకపోతే వారి విద్యార్థి వీసా తక్షణమే రద్దయ్యే అవకాశం ఉంది. భవిష్యత్తులో అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసే అర్హత కూడా కోల్పోవచ్చు.

అమెరికాలో ఆప్టిక‌ల్ ప్రాక్టిక‌ల్ ట్రైనింగ్ వీసాపై ఉన్న విద్యార్థులకు కూడా హెచ్చరిక జారీ చేశారు. జాబ్ ప్రారంభమైన 90 రోజుల్లోగా ఉద్యోగ వివరాలను SEVIS (Student and Exchange Visitor Information System) ద్వారా తెలియజేయకపోతే, వారి లీగల్ స్టేటస్ రద్దు అవుతుందని US Immigration and Customs Enforcement (ICE) ప్రకటించింది.

35
విద్యా సంస్థ‌లు హెచ్చ‌రిక‌లు:

అమెరికాలో మాస్ డిపోర్టేషన్ డ్రైవ్ (గుంపులుగా దేశానికి పంపించే చర్య) కొనసాగుతున్న నేపథ్యంలో, విద్యార్థులు దేశం దాటి వెళ్లొద్ద‌ని కొన్ని విద్యాసంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఇటీవల భారతదేశంలోని అమెరికా రాయబారి కార్యాలయం (US Embassy) భారత విద్యార్థులకు కూడా హెచ్చరిక జారీ చేసింది:

"మీ అనుమతించిన గడువును మించి అమెరికాలో ఉంటే, మీరు నిర్భందానికి గురి కావ‌చ్చు. భవిష్యత్తులో అమెరికా ప్రయాణానికి శాశ్వత నిషేధం ఎదురవచ్చు," అని అమెరికా రాయబారి ట్వీట్ చేసింది.

45
హార్వ‌ర్డ్ వ‌ర్సిటీపై విమ‌ర్శ‌లు:

ఇదిలా ఉంటే ట్రంప్ ప్రభుత్వం ఇటీవల హార్వర్డ్ యూనివర్సిటీపై తీవ్ర విమర్శలు చేస్తూ, విదేశీ విద్యార్థులను అడ్మిట్ చేయొద్దని ఆదేశించింది. “విదేశీ విద్యార్థులను యూనివర్సిటీలలో చేర్చడం హక్కు కాదు – అది ఒక ప్రివిలేజ్ (అధికారం),” అని పేర్కొంది. హార్వర్డ్ యూనివర్సిటీ “అమెరికా వ్యతిరేక, యూదులవ్యతిరేక, ఉగ్రవాద మద్దతుదారుల కేంద్రంగా మారింది” అని ట్రంప్ ఆరోపించారు.

55
విద్యార్థుల్లో పెరుగుతోన్న భ‌యం:

యూనివర్సిటీ డైవర్సిటీ, సమానత్వం, ఇంటిగ్రేషన్ పేరుతో “వర్గవాద విధానాలు” అమలు చేస్తోందని ఆరోపించారు. క్యాంపస్‌లో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి సంబంధించిన నిరసనల్లో విదేశీ విద్యార్థుల ప్రమేయం ఉందని అభియోగించారు. 

ఈ పరిణామాలతో భారత సహా ఇతర దేశాల విద్యార్థులు తమ భవిష్యత్ గురించి ఆందోళన చెందుతున్నారు. అమెరికాలో చదువు పూర్తిచేయాలన్న కలలు అర్థాంతరంగా మిగిలే ప్రమాదం ఉందన్న భయం పెరుగుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories